Why South India is developed than North? : దక్షిణ భారత దేశ అభివృద్ధి కి కారణాలు ఏంటి..ఉత్తర భారతదేశం ఎందుకు వెనుకబడింది..దక్షిణాదికి ఉన్న ప్రధాన బలాలు ఏంటి..
భారతదేశం భిన్న మతాలకు భిన్న సంస్కృతులకు నెలవు, భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే పదానికి నిలువెత్తు అర్ధం.
అనేక మతాలు కులాలకు చెందిన వారు మన భారతదేశంలో ఉంటున్నారు. అయినప్పటికీ ఐక్యతతోనే మెలుగుతున్నారు. భారతీయులుగానే జీవిస్తున్నారు. ఈ మాటలన్నీ అక్షర సత్యమే కావచ్చు కానీ భారతదేశంలో కొన్ని భావాలు ఉన్నాయి.
దక్షిణ భారతదేశం అని, ఉత్తర భారతదేశం అని. అదేంటి ఉన్నది ఒక్కటే దేశం కదా అందులో మరలా ఈ వేరు భావం ఏమిటి అని చాల మందికి ఉన్న సందేహమే.
దక్షిణ భారతదేశం అంటే ఇందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళ్ నాడు తో పాటు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి.
North India – South India:
ఉత్తర భారతదేశం అంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల తోపాటు యూనియన్ టెరిటరీస్ అయిన జమ్మూ కాశ్మీర్, లద్దాక్, చండీఘడ్ ఇంకా ఢిల్లీ కూడా ఉన్నాయి.
అయితే నార్త్ ఇండియా ఇంకా సౌత్ ఇండియా వారికి ఒకరంటే ఒకరికి తెలియని వైరం ఉన్నమాట వాస్తవమే, ఇరు ప్రాంతాలకి చెందిన వారు ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకోవడం కూడా జరుగుతూనే ఉంది. కొన్ని కొన్ని స్నాదర్భాల్లో అవి శృతిమించిన దాఖలాలు కూడా లేకపోలేదు.
అయితే ఈ ప్రాంతాల వారివి భిన్నమైన సంస్కృతులు సంప్రదాయాలు. వేషధారణలు కూడా భిన్నంగానే ఉంటాయి.
దక్షిణాది ప్రజల కంటే తామే గొప్ప అని, తామే ఉన్నతమైన చదువులు చదువుకున్నామని ఉత్తరాది వారు భవిస్తూ ఉంటారు. అలాగే దక్షిణాది వారు కూడా ఉత్తరాది వారికంటే తామే గొప్ప అని భవిస్తూ ఉంటారు.
అయితే రాజకీయంగా కూడా వీరి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయి. దక్షిణాదివారు ప్రధానమంత్రి అయితే దక్షిణ భారతదేశానికి మరింత అభివృద్ధి అందుతుందని, మరిన్ని నిధులు అందుతాయని ఆలోచిస్తూ ఉంటారు.
ఉత్తరాది వారు మాత్రం దేశాన్ని పాలించే అవకాశం తమ వారి చేతుల్లోనే ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఏది జరగాలన్నా ఉత్తరాది వారికి దక్షిణాది రాష్ట్రాల సహకారం ఉండాలి, దక్షిణాది వారికి ఉత్తరాది వారి సహకారం ఉండాలి.
మొత్తం మీద చుస్తే ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో ఎక్కువగా ఉత్తరాది వారే ఉండటం గమనించదగ్గ విషయం.
ఈ విషయంలో దక్షిణాది వారు చెప్పేది కూడా అదే, పాలించే వారు ఉత్తరాది వారు కావడంతో దక్షిణ భారతదేశ అభివృద్ధికి ఎక్కువ శాతం నిధులు మంజూరు చేయడం లేదని అంటూ ఉంటారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపెట్టింది అంటూ ఆ ప్రాంత నేతలు గట్టిగానే గళం విప్పుతూ ఉంటారు.
Once the history is reversed:
పాలకుల ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు అనాది నుండి ఉత్తర దక్షిణ భారత దేశాలను ఎవరు పరిపాలించారు. ఈ రాష్ట్రాలు ఎవరి ఏలుబడిలో ఉన్నాయి అనే వాటిని చూద్దాం.
ముందుగా ఉత్తరభారతదేశాన్ని గనుక చుస్తే. స్వాతంత్ర్యానికి పూర్వం ఇంకా చెప్పాలంటే బ్రిటిషు వారు మన గడ్డపై అడుగు పెట్టడానికి పూర్వం చూసుకుంటే ఉత్తరాదిని గుప్తులు, మౌర్యులు, కుషానులు, హర్షవర్ధనులు, హన్స్ లు, గుర్జ్ ఇంకా ప్రతిహాద్ లు, తోమర్ లు, తుగ్లక్ లు, లోధీ లు, మొఘలులు, సుర్ లు, సిక్కు లు రాజపుత్ లు, మరాఠా ల ఏలుబడిలో ఉత్తరాది రాష్ట్రాలు ఉండేది.
ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే చేరాలు, చోళులు, పాద్యులు, శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర, మైసూర్ వంటి మహారాజులు దక్షిణాది ప్రాంతాన్ని ఏలినటు తెలుస్తోంది.
ఇక భౌగోళికంగా చూసుకుంటే ఉత్తరభారతదేశం నలుచెరగులా అనేక దేశాలు ఉన్నాయి. చైనా, యూరప్, ఏసియా, ఆఫ్రికా వంటివి చుట్టుప్రక్కల ఉంటాయి.
అయితే దక్షిణ భారత దేశానికి మూడు వైపులా సముద్రమే ఉంటుంది. అయితే సముద్రం ఉండటం వల్ల దక్షిణాది రాష్ట్రాలకి ఎవ్వరితో సంబంధం లేదనుకుంటే పొరపాటే. ఈ రాష్ట్రాలకు సువిశాలమైన సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంతం అనేది రవాణాకు ప్రధాన ఆధారం.
Exports from there:
దక్షిణ ప్రాంతానికి ఈ తీరా ప్రాంతం ఉండటంతోనే మొదటి నుండి కేరళ తీరం గుండా ఎగుమతులను చేసేవారు. తొలినాళ్లలో ఇక్కడి నుండి మిరియాలను ఎగుమతి చేసేవారని చరిత్ర చెబుతోంది.
కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి కూడా సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుండి ఎగుమతి అవుతూ ఉండేవని తెలుస్తోంది. కేరళ లో పండే మిర్చి ని బాబీలోనియన్లు, పర్షియన్లు, ఈజిప్టులోని వారు అమితంగా ఇష్టపడేవారు.
అంతే కాకుండా రవాణా అనేది ఎప్పుడైతే జరుగుతుందో అనేక ప్రాంతాల నుండి అనేకమంది ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకుని వీలు కూడా ఉంటుండీ. తీరప్రాంతం ఎక్కువగా ఉన్న దక్షిణాదికి అనాదిగా అనేకమైన ప్రాంతాల వారు వచ్చిస్థిరపడ్డారు.
ఇక దక్షిణ భారతదేశంలో వేల సంవత్సరాల నాటి శాంతియుత మతపరమైన సంబంధాలు, సహజీవనం అనే అంశాలు ఆ ప్రాంతాల అభివృద్హికి తోడ్పాటును ఇచ్చాయి.
పైగా బ్రిటిషు వారు మొదటగా అడుగుపెట్టింది ఉత్తరాదిలో కాదు, దక్షిణాదిలోనే. కాబట్టి ఇక్కడివారికే వారితో మాట్లాడే అవసరం ఎక్కువగా ఏర్పడటంతో ముందు ఇంగ్లిష్ నేర్చిన వారీగా వీరినే పరిగణించాలని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు.
మొదటి నుండి కూడా దక్షిణాది వారిలోనే అక్షరాస్యత ఎక్కువ. ఉత్తరాదిలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. కాబట్టి ప్రభుత్వాలు నిరక్షరాస్యతను పోగొట్టేందుకు ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాయి.
Investments have been made but:
ఇక దక్షిణ భారత దేశంలో ఇప్పటికి ఎగుమతులు దిగుమతులకు పెద్ద పీట వేయడం జరుగుతోంది. ఇక్కడ ఉన్న పోర్టులను మరింత అభివృద్ధి చేసి వాటి ద్వారా దేశ ఆర్ధిక వృద్హి మరింత మెరుగు పడేలా చూడాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఎప్పుడైతే పోర్టులను మెరుగుపరిచారో వాటికి అనుసంధానంగా రహదారులను, హైవేలను మెరుగుపరచడం, వాటి కనెక్టివిటి ని పెంపొందిచాల్సి ఉంటుంది. దాని వల్ల ప్రయాణ దూరం తగ్గడం, ఖర్చు తగ్గడమే కాక ఇంధనం ఆదా అవడం చూడొచ్చు.
అయితే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతో దేశంలో వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటును అందించడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ ఉండే రాష్ట్రాల మాట మాత్రం మరోలా ఉటుంది.
దక్షిణ భారతదేశం లోని రాష్ట్రాల నుండి వసూలు చేసే పన్నుల నుండి తిరిగి రాష్ట్రాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన మొత్తాన్ని ఆ లెక్కల ప్రకారం కేటాయించడం లేదని, నిబంధనలకన్నా తక్కువే ఇస్తున్నారని గగ్గోలు పెడుతున్నాయి.
Education is given priority:
దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన అభివృద్ధి కనిపించడానికి విద్య ముఖ్య కారణం అని చెప్పొచ్చు. తమిళ్ నాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఎక్కువశాతం ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
అయితే ఆపార్టీలు లోకల్ గా పుట్టుకొచ్చినవి కాబట్టి స్థానిక ప్రజల అవసరాలు అన్ని అవగతం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయి అని భావించవచ్చు. అందులో భాగంగానే ఈ రాష్ట్రాలలో ప్రజల ఆకాంక్ష మేరకు విద్య పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది.
చదువుకునే వారికి ఎక్కువ ప్రోత్సాహం అందించడం వల్ల పెద్ద సంఖ్య లో ఇక్కడ నుండి గ్రాడ్యుయేట్లు తయారు చేయబడుతున్నారు. వీరు వృత్తి కోసం అనేక ప్రాంతాలకు వెళ్లి స్థిరపడటం కూడా జరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులతోపాటు ప్రయివేటు పాఠశాలల్లో చదివే వారికి కూడా స్కాలర్ షిప్పులు ఇవ్వడం, ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం తో పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండటం వంటి అంశాలను దక్షిణాదిలో చూడొచ్చు.
పైగా దక్షిణాదిలో సంక్షేమ పధకాలను కూడా ఇక్కడి ప్రభుత్వాలు ఎక్కువగా అందిస్తూ ఉంటాయి. ప్రతి ఏటా వారు కేటాయిస్తున్న బడ్జెట్ ను చూసినా ఆ విషయం ఇట్టే అర్ధమైపోతుంది.
అయితే ఏ సంక్షేమ పధకాల వల్లనే అనేకమంది ఉన్నత విద్యను అభ్యసించడం, లేదంటే చిన్నపాటి పొదుపుతో వ్యాపారాన్ని స్థాపించి పేదరికం నుండి బయటపడటం జరుగుతోంది.
Political stability:
దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ స్థిరత్వం కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ స్థిరత్వం ఉండటం వల్లనే అభివృద్ధికి బాటలు పడుతున్నాయని కొందరు భావిస్తున్నారు.
స్థిరమైన సమాజం ఉన్నప్పుడే రాజకేయ స్థిరత్వం సాధ్యపడుతుంది. స్థిరమైన సమాజమే అందుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది.
దక్షిణాది ప్రజలు ఎల్లప్పుడూ రాజకీయ స్థిరత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. పైగా భారతదేశ రాజ్యాంగం స్థిరమైనది కాబట్టి ఆ అంశం కూడా దక్షిణాదిలో రాజకీయ స్థిరత్వం కొనసాగడానికి దోహదం చేస్తోంది.
Agriculture also contributed:
వ్యవసాయం కూడా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి బాగా దోహదపడింది చెప్పొచ్చు. సౌత్ ఇండియా లో చాలా సారవంతమైన నెల ఉంది. ఈ నేలల్లో అనేక రకాల పంటలను పండిస్తూ ఉంటారు.
వరి పంటకు దక్షిణాది లోని ఆంధ్ర తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలు ధాన్యాగారాలుగా నిలుస్తాయి. కేవలం వరి మాత్రమే కాకుండా, మినుము, వేరుశనగ, పెసర, సెనగ వంటి అపరాలు, ప్రత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలు, కొబ్బరి, జామ, దానిమ్మ వంటి ఉద్యాన పంటలు పండిస్తారు.
పైగా ఈ పంటలు పండించేందుకు ఇక్కడ విస్తారమైన వర్షాలు కురుస్తూ ఉండటం, అలాగే నదులు, కాలువలు, పెద్ద పెద్ద చెరువులు ఉండటం కలిసొచ్చే అంశం.
Abundant water resources:
ఎప్పుడైతే నీరు పుష్కలంగా ఉంటుందో ఎక్కడైతే పారే నదులు ఉంటాయో అక్కడ నాగరికత ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్రా వంటి నదులు దక్షిణాది రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి.
ఈ నీటిని ఆయా ప్రాంతాల ప్రజలు పంటలు పండించడానికి త్రాగు నీటికి ఉపయోగిస్తారు. అయితే పరిశ్రమలు నెలకొల్పాలన్నా ఖచ్చితంగా కావలసింది నీరు.
కాబట్టి పుష్కలంగా నీరు అందుబాటులో ఉండే ఈ దక్షిణాదిలో అనేక పరిశ్రమలు తమ పెట్టుబడులను పెట్టి, వివిధ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. తద్వారా దక్షిణాది అభివృద్ధి మరింత ముందుకి వెళుతోంది.
పైగా నీరు ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందో విద్యుత్ ఉత్పత్తికి కూడా కొదువ ఉండదు. దక్షిణాదిలో ఉన్న నీటి ప్రాజెక్టుల నుండి విద్యుత్తు ను ఉత్పత్తి చేయడంతో రాష్ట్రాలకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది.