Delhi who have decided: ఎవరెవరికి ఏయే శాఖలంటే..ఖరారు చేసింది ఢిల్లీ పెద్దలేనా.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఆపార్టీ నుండి రేవంత్ రెడ్డిని ముఖ్య మంత్రిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో అయన డిసెంబర్ ఎదవా తేదీన ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక అదే తోజున కాంగ్రెస్ పార్టీ లోని కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారు అనే దానిపై అప్పటికి క్లారిటీ లేదు, కానీ నేడు పార్టీ నాయకత్వం ఎవరెవరికి ఏయే శాఖలు ఇస్తున్నారు అనే విషయాలు తేల్చి చెప్పింది.
అయితే ఈ విషయంలో కసరత్తు చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఫైనల్ లిస్ట్ తోనే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో తిరిగివచ్చినట్టు తెలుస్తోంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. హోం శాఖ, పురపాలక శాఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖతో పాటు ఇతరులకు కేటాయించని కొన్ని శాఖలను రేవంత్ తన ఆధీనంలోనే పెట్టుకున్నారు.
శాఖల వివరాల్లోకి వెళితే:
- ఆర్థిక, ఇంధన శాఖను భట్టి విక్రమార్కకు అప్పగించారు.
- వ్యవసాయం, చేనేత శాఖ తుమ్మల నాగేశ్వరరావు .
- ఎక్సైజ్‌శాఖ, పర్యాటక శాఖలు జూపల్లి కృష్ణారావు
- నీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ దామోదర రాజనర్సింహకు
- ఇక ఆర్ అండ్ బీ తోపాటు, సినిమాటోగ్రఫీ శాఖ ను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- ఐటీ, పరిశ్రమల శాఖ , శాసనసభ వ్యవహరాలను దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.
- రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
- రవాణా, బీసీ సంక్షేమ శాఖలు పొన్నం ప్రభాకర్
- పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖను సీతక్కకి.
- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలను కొండా సురేఖ