Breaking News

Mohammad Shami Ex-wife: మహమ్మద్ షమీ గురించి మాజీ భార్య ఏమందంటే..

Mohammad Shami Ex-wife: మహమ్మద్ షమీ గురించి మాజీ భార్య ఏమందంటే..

Mohammad Shami Ex-wife : మహమ్మద్ షమీ గురించి మాజీ భార్య ఏమందంటే..

భారత పేసర్ మహమ్మద్ షమీ, ఇప్పుడు క్రికెట్ ప్రియులంతా ఇతడి గురించే మాట్లాడుకుంటున్నారు. వన్డే క్రికెట్ లో భారత జట్టు విజయాల పరంపరలో కీలకమైన పాత్ర పోషించిన షమీ, టాక్ ఆఫ్ ద క్రికెట్ గా మారిపోయాడు. బంతి పట్టుకుని పిచ్ మీదకి వచ్చాడంటే బ్యాట్స్ మెన్ కి చెమటలు పట్టాల్సిందే.

బంతి తో అతడు చేసే మాయాజాలంతో స్టాంప్ లు ఎగిరిపోవాల్సిందే. కీలకమైన సమయంలో టప టపా వికెట్లు పడగొడుతూ అబ్బురపరుస్తున్నాడు షమీ.

క్రికెట్ లైఫ్ మంచి జోరు మీద ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం కంప్లీట్ గా డిస్టర్బ్ గా ఉండిపోయింది. షమీ తన భార్య కుమార్తెకు దూరంగా ఉంటున్నాడు. అయితే రీసెంట్ గా షమీ మాజీ శ్రేమతి మరో మారు అతనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మహమ్మద్ షమీ మంచి క్రికెటరే కానీ మంచి వ్యక్తి, మంచి భర్త, మంచి తండ్రి కాదని అంటోంది. అతడు నిజంగా మంచి భర్త, మంచి తండ్రి అయి ఉంటె తాము విడివిడిగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అని అంటోంది మాజీ భార్య హసిన్ జహాన్.

షమీ మంచి ఆటగాడు మాత్రమే కాకుండా మంచి భర్త కూడా అయ్యి ఉంటె తమకి సొసైటీలో మంచి గుర్తింపు హోదా ఉంది ఉండేదని చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా షమీ పై హసిన్ జహాన్ కొన్ని తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. షమీ డబ్బు తో తనలోని నెగిటివ్ షేడ్స్ ను దాచిపెట్టే ప్రయత్నం చేశాడని అంటోంది.

షమీ తనను తీవ్రంగా వేధించాడని, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, గృహ హింసకు పాల్పడ్డాడని పేర్కొంది. అంతే కాదు ఈ అంశాల మీదనే ఆమె 2018 లో కోర్ట్ ను ఆశ్రయించింది. అయితే మాజీ భార్య ఆరోపణలను షమీ గతంలోనూ ఖండించాడు.

కేవలం తన పాపులారిటీ, ఫేమ్ మీద దెబ్బ కొట్టడానికి ఇలా చేస్తున్నారని అన్నాడు. హసిన్ జహాన్ కోర్ట్ లో వేసిన కేసుకి సంబంధించి కోల్‌కత్తా కోర్టు తీర్పుని వెలువరించింది.

షమీ ప్రతి నెలా 30 వేల రూపాయలు హసిన్ జహాన్ కు భరణంగా ఇవ్వాలని పేర్కొంది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో షమీ ఏడు వికెట్లు తీయడం పై జహాన్ తనదైన శైలిలో స్పందించింది,

అతను అన్ని వికెట్లు తీయడం తనకేమి ప్రత్యేకంగా అనిపించలేదని, కానీ భారత్ విజయం సాధించడం మాత్రం సంతోషాన్ని కలిగించింది అంటోంది. ఫైనల్ మ్యాచ్ లో కూడా భారత్ విజయ ఢంకా మ్రోగించాలి ప్రార్థిస్తున్నానని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *