శ్రీశాంత్ ఒకప్పుడు స్టార్ క్రికెటర్ – ఇప్పుడు పెద్ద విలన్ – ఏమైయ్యింది

WhatsApp Image 2024 03 14 at 5.13.48 PM శ్రీశాంత్ ఒకప్పుడు స్టార్ క్రికెటర్ - ఇప్పుడు పెద్ద విలన్ - ఏమైయ్యింది

అతను ఒకప్పుడు స్టార్ క్రికెటర్. టీమ్ ఇండియా తరపున ఎన్నో మ్యాచ్ లు ఆడాడు. అతని బౌలింగ్ అంటే ఆ రోజుల్లో అందరు ఆడడానికి ఇబ్బంది పడేవారు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ అంటూ బాట్స్ మెన్ ని తెగ ఇబ్భంది పెట్టేవాడు. అలాగే మంచి ఆల్ రౌండర్ గా కుడా పేరుంది. ఒక మ్యాచ్ లో హర్బహన్ సింగ్, శ్రీశాంత్ ని కొట్టడం కూడా జరిగింది. అప్పట్లో ఆ సంఘటన క్రికెట్ అభిమానులను అయోమయం లో పడేసింది.

చివరకు పెద్దలు కలగచేసుకుని ఆ గొడవను పెద్దది కాకుండా చూసారు. అంతే కాదు అతను ఆడే ఏ మ్యాచ్ అయిన అతని చుట్టు రూమర్స్ వస్తూ ఉండేవి. ఆ తర్వాత IPL మ్యాచ్ లు కూడా ఎన్నో ఆడాడు. అందులో కుడా ఎన్నో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కాని ఇప్పుడు అతడు మూవీ లోకి ఎంటర్ అవ్వ బోతున్నాడు. మూవీ పేరు ” యమదీర “.

ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ మూవీ తెలుగు లో మర్చి 23 న విడుదల కాబోతోంది. విశేషం ఏంటంటే ఈ సినిమా లో శ్రీశాంత్ పెద్ద విలన్ గా కనిపించబోతున్నాడు. ఇందులో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు. శ్రీశాంత్ క్రికెటర్ గా ఫాస్ట్ బౌలర్ గా గ్రౌండ్ లో చూపించిన దూకుడు మరి విలన్ గా ఎలా ఉన్నాడు అనేది మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.

Leave a Comment