Akhil Akkineni : అక్కినేని అఖిల్ సినిమా ఏ బ్యానర్ లో అంటే..అఖిల్ సినిమాకి పెడుతున్న బడ్జెట్ ఎంతంటే..
అక్కినేని నాగార్జున నటవారసుల టైం అస్సలు బాలేదని చెప్పాలి, ఒక పక్క నాగచైతన్యకి ఈ మధ్య హిట్లు పడట్లేదనే బాధ ఒకటైతే, మరో పక్క అసలు అక్కినేని అఖిల్ కి ఇంతవరకు సరైన హిట్టే పడలేదు అనే బెంగ ఒక పక్క.
వీరిద్దరి మాట అటుంచితే అసలు నాగార్జున కూడా హిట్టు అనే మాట విని చాలాకాలం అయింది. ఊపిరి, రాజు గారి గది 2 సినిమాల తరవాత నాగార్జునను ప్లాప్ లు ఊపిరి సలుపుకోనివ్వడం లేదు.
ఆయన ఎలాగూ సీనియర్ హీరో కదా అని సరిపెట్టుకుందాం అంటే, నాగచైతన్య కూడా సరైన హిట్టు చూసి చాల కాలం అవుతోంది. లవ్ స్టోరీ, బంగార్రాజు, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలు ఆయనకి అస్సలు కలిసి రాలేదు. అయితే ఇప్పుడు చై NC23 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
అఖిల్ తో పోల్చుకుంటే చైతన్య కాస్త బెటర్ అనిపిస్తాడు. ఒక లైలా కోసం, రారండోయ్ వేడుక చూద్దాం, మనం, ఏ మాయ చేశావే వంటి హిట్లు ఉన్నాయి.
కానీ అఖిల్ కెరియర్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ అనిపించే హిట్టు లేకపోవడం గమనార్హం. అఖిల్ ఫాన్స్ అక్కినేని ఫాన్స్ ఈ విషయంలో చాలా బాధ పడుతున్నారు.
ఇది ఇలా ఉంటె ఈ మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అయితే మరీ డిజాస్టర్ గా నిలిచించి. ఆ సినిమాను దాదాపు 70 కోట్ల వ్యయంతో నిర్మించారు. కానీ మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. కాస్త లో కాస్త బెటర్ అనిపించే సినిమా మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
పూజా హెగ్డే తో చేసిన ఈ మూవీ అఖిల్ కి కొద్దిగా ఉపశాంతిని కలిగించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజంట్ సినిమా విడుదలైన ఆరు నెలల తరువాత అఖిల్ తన తదుపరి సినిమాను చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇది కూడా సదా సీదా సినిమా కాదట, ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నారట ఈ సినిమాను. పైగా ఈ సినిమాకి అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని ఎంచుకున్నారట.
అయితే ఒక చిన్న హాప్ ఏమిటంటే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వస్తే ఖరారైపోయినట్టే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ ప్రాజెక్టు అయినా అఖిల్ కి కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు దక్కేలా చేయాలనీ ఫాన్స్ కోరుకుంటున్నారు.