What is Blue Aadhaar card : చిన్నపిల్లల కోసం బ్లూ కలర్ ఆధార్‌ని ప్రత్యేకంగా ఇవ్వబోతోంది దీనినే బాల ఆధార్ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరించడం జరుగుతుంది.మన దేశం లో అధార్ కార్డు గురించి తెలియని వారు ఉండరు .
ఈ కార్డు లో మన పేరు, పుట్టిన తేది, ఇంటి అడ్రస్ తో పాటు ప్రత్యేకం గ ఓకే మనకి కేటాయించిన 12 అంకెలతో ఒక నెంబర్ కూడా ప్రింట్ చేయబడి ఉంటుంది. ఇది దేశం లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. దీనిని ఎక్కడైనా దృవీకరించడానికి ఉపయోగ పడుతుంది.
ఏ పధకం పొందాలన్న లేక ప్రభుత్వ కార్యాకలాపాల కోసం అయిన ఇప్పుడు ఖచ్చితం గా ఆధార్ కార్డు కంపల్సరీ. అయితే ఇప్పుడు చిన్న పిల్ల కోసం UIDA బాల అధార్ అనే కార్డు ని ప్రవేశ పెట్టబోతోంది. దీనిని ప్రత్యకం గా నీలి రంగు లో ప్రింట్ చేస్తారు. ఈ బాల ఆధార్ కార్డు ఉపయోగాలు కార్డు కోసం ఎం చేయాలి, ఎలా అప్లై చేయాలి , దీనికి ఉండే నియమ నిభందనలు ఏంటి ఒక సరి చూద్దాం !
ఈ బాల అధార్ కార్డు అనేది 5 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం పెద్దలు ఇచ్చినట్లు గా బయోమెట్రిక్ వివరాలు అవససం లేదు. ఒక ఫోటో, పేరు, ఇంటి అడ్రస్, తల్లి తండ్రుల పేర్లు వారి సమాచారం కూడిన ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, అయితే దీనిమీద తండ్రి ఆధార్ కార్డు మీద ఉండే నెంబర్ తో లింక్ చేస్తారు.
చిన్న పిల్లలకి ఇవ్వబడిన ఈ నీలి రంగు ఆధార్ కార్డు పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చేవరకు మాత్రమే పనిచేస్తుంది. మళ్ళి 5 సంవత్సరాలు నిండాక వేలిముద్రల తో పాటు కంటి ఐరీస్ తదితర వివరాలు అందించ వలసి ఉంటుంది. వీరికి మరల 15 సంవత్సరాలు నిండిన తర్వాత తనకి సంబందించిన అన్ని వివరాలతో తప్అపక అప్డేట్ చేసుకోవాలి
బాల ఆధార్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
- ఆధార్ సెంటర్ కు తల్లిదండ్రులు ఆధార్ కార్డు తో పాటు చిరునామా, పిల్లల బర్త్ సర్టిఫికేట్,అలాగే ఒక ఫొటో తీసుకొని వెళ్లాలి.
- ఆధార్ సెంటర్ లో వారిచ్చే అప్లికేషన్ లో అన్ని వివిఅరాలు నింపాలి. అందులో తల్లిదండ్రుల ఆధార్ వివరాలను కూడా జతచేయాలి. ఈ ఫారాన్ని ఉడాయ్ వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌నే పిల్లల ఆధార్ కార్డుకూ లింక్ చేస్తారు . కాబట్టి నంబర్ కూడా ఫారంలోనే నింపాలి. - తర్వాత మీరిచ్చిన ధ్రువీకరణ పత్రాలను అన్ని సరి చూసి వెంటనే మొబైల్ నంబర్‌కు ఓటిపి ద్వార ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది.
- అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ని తీసుకోవడం మర్చిపోకూడదు. అందులో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ కూడా ఉంటుంది. దీంతో మీ పిల్లల ఆధార్ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు.