What is Kumari Aunty income? who invested for Kumari Aunty business ? : గడిచిన రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాతోపాటు, వార్తల్లో కూడా విపరీతంగా వైరల్ అవుతున్న పేరు ఒకటుంది, అది ఎవరి పేరో తెలుసా అదే కుమారి ఆంటీ, ఆమె వయసు పెద్దది కాకపోయినా పదిమందీ ఆమెను కుమారి ఆంటీ కుమారి ఆంటీ(Kumari Aunty) అని పిలవడంతో ఆమె పేరే కుమారి ఆంటీ అయిపొయింది.
అయితే ఎంతమంది కుమారీలు ఉన్నా కానీ ఫుడ్ స్టాల్ కుమారి ఆంటీ అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. ఎందుకంటే ఆమె పేరు ఏకంగా తెలంగాణ సీఎంవో ఆఫీసు వరకు వెళ్ళింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కలుగజేసుకుని ఆమె ఫుడ్ స్టాల్ తీయించవద్దని, ఎక్కడ నిర్వహిస్న్చుకుంటున్నారో వారి వ్యాపారాన్ని యధాతధంగా నిర్వహించుకోనివ్వాలని అధికార యంత్రాంగానికి చెప్పడంతో ఆమె మరింత ఫెమస్ అయ్యారు.
హేమచంద్ర తల్లి సహాయం : Helped by Hemachandra’s mother
అసలు ఇంతకీ ఈ కుమారి ఆంటీ సొంత ఊరు ఏది, ఆమె హైదరాబాద్ కి ఎప్పుడొచ్చారు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఆమె భర్త పిల్లల వివరాలు చూద్దాం.
కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి కుమారి. వీరిది ఉమ్మడి కృష్ణా జిల్లా లోని గుడివాడ. అప్పట్లో పనులు లేక వ్యాపారం ఏదైనా చేసుకుందామని 2011 లో హైదరాబాద్ కు మకాం మార్చారు. హైదరాబాద్ రావడమైతే వచ్చారు కానీ ఎం వ్యాపారం చేయాలా అని ఆలోచనలో పడ్డారు.
అప్పటికే స్ట్రీట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న వారు ఆమెకు భోజనం స్టాల్ పెట్టుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారట. సలహా మాత్రమే ఇస్తే సరిపోదు పెట్టుబడి కూడా అవసరమే, ఆ పెట్టుబడి ఎలా వచ్చింది అంటే, కుమారి ఆంటీ అప్పట్లో సింగర్ హేమచంద్ర(Singer Hemachandra) వారింట్లో వంట మనిషిగా పనిచేసేవారట, ఆమె ప్రవర్తన నచ్చడంతో హేమచంద్ర తల్లి బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బు సహాయం చేశారు.
5 కిలోల నుండి 100 కిలోల వరకు : 5 kg to 100 kg
మొదట కేవలం ఐదు కేజీల బియ్యం కెపాసిటీ తో బిజినెస్ మొదలు పెట్టారు కుమారి ఆంటీ, నెమ్మదినెమ్మదిగా ఆ బిజినెస్ పెరిగి పెద్దదైంది. ఇప్పుడు అది 100 కేజీల కెపాసిటీ కి చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై మూడు గంటలకే క్లోస్ అవుతుంది.
ఈ ఫుడ్ స్టాల్ పెట్టేందుకు ఉదయం నుండే వంట పని మొదలవుతుంది. ఆమె తోపాటు కుటుంబ సభ్యులకు కూడా ఇదే బిజినెస్ లో పాలుపంచుకుంటారు. ఆమె ఫుడ్ స్టాల్ లో వంటలకు వాడే మసాలాలు అన్ని కూడా వారే స్వయంగా తయారు చేసుకుంటారు.
ఇక ఆమె బిజినెస్ 5 కేజీల స్థాయి నుండి 100 కేజీల స్థాయి వరకు వచ్చింది అంటే ఊరికే రాదు కదా ? ఆమె వంట వాసన చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది, ఇక తింటే జిహ్వచాపల్యం తృప్తి పడుతుంది. ఈమే ఫుడ్ స్టాల్ కి సామాన్య ప్రజలు మాత్రమే కాదు, సినిమా సెలెబ్రెటీలు కూడా వస్తుంటారట. అంత క్రేజ్ ఉంది కుమారి ఆంటీకి.
భర్త పిల్లలు ఏంచేస్తారో తెలుసా : What Kumari Aunty husband & children do?
ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే కుమారి ఆంటీ భర్త తో కలిసే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఎక్కువగా బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చదువు మధ్యలో ఆపివేశాడు, అయితే కొడుకును ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ గా చూడాలన్న లక్ష్యం తో అతడిని ప్రయివేటుగా డిగ్రీ చదివిస్తోంది.
ఇక ఆమె కుమార్తె హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తోంది. తన కూతురు కాలేజీని వెళుతూనే ఇంటి వద్ద వంట పనిలో తనకు సహాయం చేస్తుంది అని చెబుతారు కుమారి ఆంటీ.
మిగిలే ఆదాయం ఎంతంటే ? remaining income In Business is
ఇక ఆదాయం విషయానికి వస్తే కుమారి ఆంటీ దగ్గర వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు ఉంటాయి. ఆమె వద్ద నాన్ వెజ్ ఐటమ్స్ వంద రూపాయల నుండి మొదలవుతుంది. మనం తీసుకునే ఫుడ్ వెరైటీలను బట్టి రేట్లు ఉంటాయి.
మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటే రేట్లు కూడా పెరుగుతాయి. ఇక ఒక రోజుకి సుమారుగా 600 నుండి 700 వందల మంది ఈమె ఫుడ్ స్టాల్ కు వస్తుంటారు. సుమారుగా 100 రూపాయలు వేసుకున్నా కానీ రోజుకి 60 వేలు వస్తుంది. నెలకు చూసుకుంటే 18 లక్షలు ఉంటుంది. అయితే వాటిలో ఖర్చులు కింద 12 లక్షలు తీసేస్తే 6 లక్షలు వరకు మిగులుతుంది.
సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు : From common People to celebrities
రెస్టారెంట్లకు మించి టెస్ట్ ఉంటూ, తక్కువ బడ్జెట్ లో ఫుడ్ పెడుతూ ఆకలి తీర్చే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎక్కడ ఉందొ చెప్పనేలేదు కదా ఇది మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉంటుంది అక్కడి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది ఫెవరెట్ ఫుడ్ స్పాట్.
కుమారి ఆంటీ ఎంత ఫెమస్ అంటే ఈ మధ్య కాలంలో ఊరు పేరు భైరవకోన(Ooru peru Bhairavakona) మూవీ టీమ్ ఆమె హోటల్ వద్దకే వచ్చి ప్రొమోషన్ ప్రోగ్రాం చేసుకున్నారు. సందీప్ కిషన్(SandepKishan) వర్ష బొలమ్మ(Varsha Bollamma) సందడికి చేశారు.
అయితే కుమారి ఆంటీ ఫుడ్ ఇంత ఫెమస్ అవ్వడానికి కారణం మాత్రం ఫుడ్ వ్లాగ్స్ చేసే యూట్యూబర్లు అని చెప్పాలి. వాళ్ళు ఇక్కడి ఫుడ్ గురించి యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం వల్ల కుమారి ఆంటీ ఫుడ్ తెలియని వారికి కూడా తెలిసిపోయింది.