RGV – Vyuham: రామ్ గోపాల్ వర్మ వేయనున్న ” వ్యూహం ” ఏంటి?
వ్యూహం టీజర్ పై స్పందన..మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ మాత్రమే కాదు, సెన్సేషనల్ హ్యూమన్ బీయింగ్ అయిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా రాబోతుంది.
రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు మాత్రామే కాదు మాట్లాడే మాటలకి ఆడియన్స్ అడిక్ట్ అయిపోతారు. అంతటి వ్యక్తి నుంచి ఈ మధ్యలో సినిమాలు రావడం బాగా తక్కువయ్యాయి.
ఇక మళ్ళీ సినిమాలకి దూరం అవుతున్నాడన్న సమయంలో ఒక యథార్ధ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు .ఇటీవల RGV విడుదల చేసిన ” వ్యూహం ” టీజర్ తో అది ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ గందరగోళల్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన మొదటి టీజర్ వచ్చేసింది. రెండవ రోజు మళ్ళీ రెండవ టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ సినిమా వైఎస్ ఆర్ మరణం నుంచి మొదలుపెట్టి జనసేన పార్టీ ఆవిర్భావం వరకు ఆంద్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ గందరగోళాలు, వ్యూహాలు అన్నింటిపై ఈ సినిమా కథ సాగుతూ ఉంటుంది.
ఆంద్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులైన జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, విజయమ్మ, సోనియా గాంధీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి, మన్మోహన్ సింగ్, రోశయ్య వంటి పాత్రలను పోలిన పాత్రలను ఈ టీజర్ లో చూపిస్తూ, అంతర్గత రాజకీయ కుతంత్రాలను, డ్రామాను చిత్రీకరించారు.
పవన్ కళ్యాణ్ ని వెన్ను పోటు పొడుస్తారా అని చంద్ర బాబు పాత్రని మరో పాత్ర అడిగిన ప్రశ్నతో టిజర్ పూర్తయ్యింది.RGV తీస్తున్న 2 సినిమాలు మొత్తం YS జగన్ చుట్టూ కేంద్రీకృతం అయి ఉన్నాయి.
అందులో మొదటి చిత్రం ” వ్యూహం “, ఇది డిసెంబర్ 29వ తారీఖున విడుదల కానుంది. దేనికి సీక్వల్ ” శపధం “. ఇది కూడా విడుదలకు సిద్దమవుతుంది.