Praja Palana: ప్రజాపాలన ధరఖాస్తు కోసం ఏమేం అవసరం..ధరఖాస్తు ఎలా చేసుకోవాలి.

What is required for public administration application..How to apply.

Praja Palana: ప్రజాపాలన ధరఖాస్తు కోసం ఏమేం అవసరం..ధరఖాస్తు ఎలా చేసుకోవాలి.

తెలంగాణ లో నూతన ప్రభుత్వ పాలన మొదలైన తరువాత, సిఎం రేవంత్ రెడ్డి శర వేగంగా పనులు చేయడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉంది ప్రభుత్వం.
అందులో భాగంగానే ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

ప్రజాపాలన :

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి జనవరి 06 వ తేదీ వరకు ప్రజాపాలన అనే కార్యక్రమం జరుగుతుంది.
అధికారులే స్వయంగా గ్రామసభలు ఏర్పాటు చేసి, ప్రజాలనుంచి ధరఖాస్తులు స్వీకరిస్తారు.

ప్రజాపాలన ధరఖాస్తు కి ఏమేం అవసరం ;

  1. ఆధార్ కార్డు
  2. తెల్ల రేషన్ కార్డు

ధరఖాస్తు ఫారం నింపడం ఎలా :

ఒక్కో పథకానికి ఒక్కో ఫారం నింపే పని లేకుండా అన్నీ పథకాలు ఒకే ఫారం లో ఉండేలా ఈ ధరఖాస్తు ఫారం ని తయారు చేశారు.
దీనిలో మొదట కుటుంబ వివరాలు నింపాల్సి ఉంటుంది. ఆ తరువాత మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాలలో, ఏ పథకానికి ధరఖాస్తు చేయాలనుకుంటున్నారో దానిలో వివరాలన్నీ నమోదు చేయవలసి ఉంటుంది .
అలా పూర్తిగా నింపిన తరువాత గ్రామ సభలో ఉన్న అధికారికి ఆ ఫారం ని అందజేయలి. అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే, అపుడు వాళ్ళు అర్హులా కదా చూసి, సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేస్తారు.

Leave a Comment