మనదేశం లో విద్య నేర్పిన గురువుని దైవ సమానం గా భావిస్తాం. మన సాప్రదయం ప్రకారం తల్లితండ్రుల ఇచ్చే గౌరవం తర్వాత మనం ఇచ్చేది గురువు కే. పిల్లలకు మంచి నడవడిక తో పాటు విద్య లో ఉన్నత శిఖరాలకు చేరేలా చేసిది గురువే.
అందుకే మనం గురువు కి అంత ప్రాధాన్యం ఇస్తాం. కాని నేటి విద్యార్దులు చదువుకోవలసిన వయసు లో తప్పు దారి పట్టి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.దీనికి హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటనే దీనికి ఉదాహరణ గా చెప్పాలి. అనంతపురం కు చెందినా ఒక యువతీ ఇక్కడ హైదరాబద్ లో ఉంటూ చిక్కడపల్లి అశోక్ నగర్ లో సివిల్స్ కోచింగ్ సెంటర్ లో జేరింది. I A S తో పాటు వివిధ రకాల గ్రూప్ – 1 ఆఫీసర్ పోస్ట్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ లో జేరింది.
ఇక్కడే అసలు కధ మొదలైంది. తనకు చదువు చెప్పే గురువు నే ప్రేమించింది ఒక యువతీ. కాని తనకి విద్య నేర్పిన గురువు సున్నితం గా తిరస్కరించాడు. చదువుకుంటున్న సమయం లో ప్రేమ వద్దని బుద్దిగా చదువుకోవాలని ఆమెకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు.
తనకి ఇదివరకే పెళ్లి అయ్యిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడం తో ఆ యువతీ వినకపోగా మరింత విజ్రుంభించింది. తన ప్రేమను తిరస్కరించాడని ఆ గురువు మీదనే కక్ష పెంచుకుంది.తన ప్రేమని తిరస్కరించాడని కోపం తో తన క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టింది. ఎలాగైనా తన గురువుని మనశ్శాంతి లేకుండా చెయ్యాలని ప్లాన్ చేసింది.
అందుకు పెద్ద ప్లానే వేసింది. ఒక బిక్ష గాడి పేరు మీద సిం కార్డ్ తీసుకుని ఆ నెంబర్ నుండి మెస్సేజ్ పంపేది. ఇందులో బాగంగా ఇంకో అడుగు వేసి ఆ గురువు కి ఫ్యామిలీ కి సంబందించిన ఫోటో లు సేకరించింది. ఇక ఆ ఫోటో లను మార్ఫింగ్ చేసి సోషలో మీడియా పోస్ట్ చేసి వేధింపులకు గురియ్యేలా చేసింది. అయితే ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలను చూసి ఖంగుతిన్నాడు ఆ టీచర్.
నేరుగా అతనికి సంబదించిన ఫోటోలతో నేరుగా పోలీసు స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో రంగం లో దిగిన సైబర్ క్రైం పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు. సదరు ఆ ఫోటోలు ఆ యువతీ పెట్టినవే అని నిర్దారించారు. అనంతరం ఆ యువతిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు పోలీసులు. చివరకి ఆమె పాపం పండి కటకటాలపాలైంది.