What is the difference between FOMO and JOMO? : ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు ఊహ తెలిసీ తెలియని పిల్లలను ఎత్తుకుని చందమామ రావే జాబిల్లి రావే అంటూ చంద్రుడిని చూపిస్తూ అన్నం పెడితే తినేసేవాడు. కానీ ఈ తరం పసిపిల్లలకు చందమామ ను చూపెడితే తినకపోయింది కాక ఇంకా ఎక్కువ మారం చేస్తారు, అదే ఒక స్మార్ట్ ఫోన్ తెచ్చి వాడి చేతిలో పెడితే అది చూస్తూ మైమరచిపోయి హాయిగా అన్నం తినేస్తాడు.
కేవలం పసివాళ్లే కాదు స్కూల్ పిల్లలది కూడా ఇదే తీరు, ఒకప్పుడు స్కూల్ పిల్లలు బడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఆటలకు పెరిగెట్టేవారు, కానీ ఇప్పుడు అమ్మ దగ్గరో లేక నాన్న దగ్గరో సెల్ ఫోన్ తీసుకుని వీడియోగేమ్స్ ఆడుతున్నారు. ఈ విషయంలో పిల్లలను అనడం చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే పెద్ద వాళ్ళు కూడా సెల్ ఫోనే లోకంగా ఉంటున్నారు.
అసలు ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నారు అనేగా మీ అనుమానం. అందుకే ఏమాత్రం లెట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం.
అందుకే JOMO వచ్చింది : That’s Why JOMO Came
అసతమనం ఫోన్ పెట్టుకుని పేస్ బుక్ చూడటమో, లేదంటే ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుని ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అని చెక్ చేసుకోవడము కొందరికి అలవాటయిపోయింది.
ఏ పనిలో ఉన్నా సరే మధ్యలో ఒక సారి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. లేదంటే వారికి ఏమాత్రం పొసగదు. ఒక వేళ వారి ఫో గనుక కాసేపు కనిపించలేదంటే వారి ప్రాణం వివవిలలాడిపోతుంది.
ఈ తరహా లో బెంగపడటాన్ని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అంటారు. దానిని షార్ట్ కట్ లో ఫోమో (FOMO) అని పిలుస్తారు. అయితే ఈ ఫోమో కి పూర్తి భిన్నంగా మరో విషయం ఇప్పుడు ట్రేండింగ్ లోకి వచ్చింది. అదే జొమో (JOMO).
JOMO ఏమంటోంది : What JOMO Says
జోమో అంటే జాయ్ అఫ్ మిస్సింగ్ అవుట్, ఈ జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కి పూర్తి విరుద్ధం. అక్కడ సెల్ ఫోన్ కనిపించకపోతే విలవిలలాడుతూ ఉంటారు.
ఇక్కడేమో రోజు మొత్తం మీద కొంత సమయాన్ని సెల్ ఫోన్ కి దూరంగా గడుపుతారు. ఇలా చేయడం వల్ల పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అంత కూడా మానవసంబంధాలు దగ్గరగా ఉండే వీలవుతుంది.
అలా అని చెప్పేసి అస్సలు సెల్ ఫోన్ వాడకుండా ఉండమని దీని ఉద్దేశం కాదు. టెక్నాలజీకి దగ్గరగా ఉంటూనే కొంత సమయాన్ని మానవ సంబంధాలు పెంచుకునేందుకు కేటాయించాలి.
JOMO వల్ల లాభాలు : Benefits Of ZOMO
JOMO వల్ల చిన్న చిన్న ఆనందాలకు దూరం కాకుండా ఉంటాం, అలాగే అస్తమానం హ్యాష్‌ట్యాగ్‌లు, ఇన్‌స్టారీల్స్, లైకులు, కామెంట్ల గొడవ మాత్రమే కాకుండా కాస్త మనుషుల మధ్య ఉంటాం.
చిత్రమైన అంశం ఏమిటంటే సోషల్ మీడియాకి కొంత సమయం పాటు దూరంగా ఉండమని, ఉండిచూడమని చెప్పే అంశం కూడా సోషల్ మీడియాలోనే బాగా ట్రెండ్ అవుతోంది.
టిక్ టాక్ లో దీనిని ఏకంగా 53 మిలియన్ వ్యూస్ వచ్చాయట. # టాగ్ JOMO అనేది ట్రెండ్ అవుతోందట.
JOMO ఎలా వచ్చింది : How Does JOMO Came
ఇన్ని చెప్పుకున్నాం కానీ అసలు ఈ JOMO అన్నది ఎప్పుడు పుట్టుకొచ్చింది, ఎలా పుట్టుకొచ్చింది అన్నది చెప్పుకోలేదు కదా, ఈ జోమో అన్న పదం 2012 లో పుట్టింది.
దీనిని అమెరికాకి చెందిన అనిల్ డాష్ అనే వ్యక్తి కనిపెట్టాడట. అతనికి కొడుకు పుట్టిన సమయంలో పనుల్లో బిజీ బిజీగా ఉంది కుమారుడితో సమయం గడపలేకపోయాడట. అలా జారడం పట్ల చింతిస్తూ దానికి స్వస్తి పలికేందుకు జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే విధానాన్ని అవలంబించాడు.
అందుకే జోమో పుట్టుకొచ్చింది. జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే వదిలేయడం లో కూడా ఆనందం ఉందని అర్ధం.
JOMO ఎవరికీ మంచిది : JOMO is good for Whom
అందుకే ఎవరైతే సోషల్ మీడియా లో ఎక్కువ సేపు ఉంటూ అసలు ప్రపంచాన్నే మర్చిపోతున్నారో వారు ఈ జోమో ని అవలంబించడం కాస్త మంచిదే అంటున్నారు నిపుణులు.
అస్తమానం సెల్ ఫోన్ మాత్రమే ప్రపంచంగా సెల్ ఫోన్ పాకాన లేకపోతె ప్రాణవాయువు లోపించినట్టుగా ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమిమీద.
అలాంటి వారికోసమే ఇలాంటి కొత్త కొత్త విధానాలు పుట్టుకొస్తున్నాయి కావొచ్చు.