మీరు గుడికి వెళ్ళినపుడు గుడి వెనక బాగం తాకకండి ! తాకితే మాత్రం ?

website 6tvnews template 2024 03 28T145645.291 మీరు గుడికి వెళ్ళినపుడు గుడి వెనక బాగం తాకకండి ! తాకితే మాత్రం ?

హిందువులకు ఆలయాలకు వెళ్ళడం అనేది వారి జీవితం లో చాల ముఖ్యమైనది. కొందరు వారు అనుకున్న పని జరిగిరితే గుడికి వస్తామని మొక్కులు పెడుతూ ఉంటారు. ఇలాంటి నమ్మకాలూ ప్రతీ హిందువు కి ఉంటుంది. కొందరు అయితే దేశం లో ఉన్న పలు ప్రముఖ ఆలయాలు చూడాలని ఎంతో కష్టపడి ప్రయాణాలు చేసి ఆ దేవుడిని దర్శించుకుంటారు.

ఇక పండగలు వస్తే ఆ హడావిడి వేరే, ఆ ఆలయం అంతా దీపాలతో అలంకరించి తమ భక్తి ని చాటుకుంటారు. కొందరు ప్రతిరోజూ విధిగా ఆలయాలకు వెళ్ళేవారు ఉంటారు. మరికొందరు వారానికొకసారి వెళ్తుంటారు. అయితే గుడికి వెళ్లిన వారంతా దేవుడిని ప్రార్థించే సమయంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండడం అనేది కూడా వారికి చాల ముఖ్యం.

అలాగే అదే సమయంలో దేవుడి, దేవుతల విగ్రహాలకు లేదా ఫొటోలను తాకుతూ తమ మనసులో కోరికలు తీరాలని కోరుకుంటూ ప్రదక్షణలు చేస్తూ ఉంటారు. ఒక్కక్క సారి తెలిసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు తెలియక పోతే పండితులను అడిగి తెలుసుకోండి. గుడికి వెళ్ళినపుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎం చెయ్యచ్చు, ఎం చెయ్యకూడదు అని.

గుడికి వెళ్ళి నపుడు వెన్ను చూపకండి :

మనం నిత్యం దగ్గర లో ఉన్న ఎదో ఒక గుడి కి, అది మామూలు రోజు అయిన కావచ్చు లేదా పర్వదినం కావచ్చు. ఒక్కక్క సారి మన మొక్కులు తీర్చుకోవడానికి కూడా వెళ్తూ ఉంటాం. అలాగే మనం ఏ పని మొదలు పెట్టినా ఆ పని విజయం సాధించాలని ప్రార్దిస్తాం. అందుకే గుడిలో దేవుడిని దర్శించుకున్నట్లయితే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని మాన హిందువుల విశ్వాసం.

మనం గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత తిరిగి వచ్చే సమయం లో గంట కొట్టడం కాని మన వీపు బాగం దేవుని వైపు ఉండేలా బయటకి రాకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మనం బయటకి వచ్చేటప్పుడు కూడా ఆ స్వామిని చూస్తూ మనసులో ధ్యానిస్తూ వెనకకు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ బయటకి రావాలి. జనం ఎక్కువగా ఉంటె పక్కకు వచ్చి తిరిగి సింహద్వారం దగ్గర స్వామి వైపు తిరిగి బయటకు రావాలని పండితులు చెప్తున్నారు.

గుడి కగి వెళ్ళేటప్పుడు నియమ నిష్టలతో వెళ్ళాలి:

మనం చూసే దేవుడికి నిత్యం మంత్రాలతో అభిషేకాలు, పూజలు జరుగుతాయి. అలా జరిగినపుడు ఆ విగ్రాగం లో కొన్ని రకాల శక్తులు వచ్చి చేరతాయి. దానినే కాస్మిక్ రేసస్ అంటారు. ఇది చాలా శక్తీ వంతమైన పవర్ అని పెద్దలు చెప్తారు. మనం ఏ చిన్న తప్పు చేసిన దాని వ్యతిరేక ప్రభావం మన మీద ఎదో విధం గా చూపిస్తుంది. అది ఎలా అంటే మనం మద్యం కాని మాంసాహారం కాని లేదా స్నానం చెయ్యకుండా కానీ వెళ్తే మనకి ఎదో రకం గా నెగిటివ్ ప్రభావం పడి మనకి ఏదైనా జరగవచ్చు. అందుకనే గుడికి వెళ్ళే టప్పుడు నియమ నిష్టల తో వెళ్ళాలి అని చెప్తారు మన పెద్దలు. అప్పుడే స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది.

ప్రదక్షణలు చేసేటప్పుడు ఆలయ గర్భ గుడి గోడలను తాకకండి :

మనలో చాలా మంది గుడికి వెళ్ళాక స్వామికి నమస్కరిస్తూ ప్రదక్షణలు చెయ్యడం చూస్తూ ఉంటాం. కాని శాస్త్రం లో ఆలయాల గోడలను తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు అని చెప్తోంది. దీనికి కారణం స్వామీ గర్భ గుడి ఆలయ నాలుగు పక్కల గోడలలో ఒక్కక్క దిక్కున అంటే ఉత్తరాన కుబేరుడు, పశ్చిమాన వరుణుడు, తూర్పున ఇంద్రుడు , దక్షిణాన అంటే స్వామికి వెనుక వైపు రాక్షసులు ఉంటారని శాస్త్రాలలో చెప్పడం జరిగింది.

మనం తాకినపుడు ఆ రాక్షసులను నిద్రలేపినట్లు అవుతుందని అందుకనే ఆ వైపు తాకవద్దని పెద్దలు చెప్తారు. ఈ లెక్కన స్వామి వెనుక వైపు తాకి దణ్ణం పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరగడం అటుంచి మీకు ఆన్ని ఆటంకాలు ఏర్పడతాయని పెద్దలు చెప్తున్నారు. అంతే కాదు మనం గుడిలో దేవుడిని ప్రార్థించే సమయంలో స్వామి కి ఎదుట నిలబడి ఉండకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మనం నమస్కరించే టప్పుడు పక్కకు తిరిగే ఉండాలి. అప్పుడు మనకు దేవుని ఆశీస్సులు లభిస్తాయి పండితులు చెప్తున్నారు.

Disclaimer:
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మీకు అందించడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ 6Tv ఇవ్వడం లేదు. అలాగే ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. మా ఉద్దేశం సమాచారం అందించడం వరకు మాత్రమే. ఏదైనా పాటించే ముందు లేదా సందేహాలు ఉన్న సంబంధిత నిపుణుల సలహా తీసుకోమని మనవి చేస్తున్నాం.

Leave a Comment