కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathi Vijay)హీరోగా నటించిన విజిల్ (whistle)మూవీ బాక్సాఫీస్ లో మంచి హిట్ అయ్యింది. ఈ మూవీలో విజయ్ ఫుట్ బాల్ టీమ్ లో నటించి నటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అందులో బొద్దుగా తన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా నవ్వించింది పోచమ్మ. ఆమె అసలు పేరు ఇంద్రజ శంకర్ (Indraja Shankar). విజిల్ మాత్రమే కాదు ఇంద్రజ తమిళంలో పలు సినిమాల్లో నటించి అందరినీ ఆకర్షించింది. తాజా శింద్రజ మ్యారిడ్ లైఫ్ లోకి ఎంటరైంది. తన స్నేహితుడిని సంప్రదాయబద్ధంగా వివాహమాడింది. ఇంద్రజ శంకర్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్నేహితుడిని పెళ్లాడిన ఇంద్రజ :
కోలీవుడ్ నటుడు రోబో శంకర్ (Robo shankar) కూతురు ఇంద్రజ శంకర్ (Indraja Shankar).ఆమె వయసు 20 ఏళ్లు. వయసు చిన్నదే అయినా తన కామెడీ టైమింగ్ తో ఇన్నాళ్లు సినీ అభిమానులను అలరించింది ఇంద్రజ. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు డైరెక్టర్ కార్తీక్ (Karthik)ను పెళ్లాడింది ఇంద్రజ. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఫ్యామిలీ మెంబర్స్, సినీ సెలబ్రిటీస్, క్లోజ్ ఫ్రెండస్ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇంద్రజ శంకర్ పెళ్లి ఫోటోస్, వీడియోస్ ను నెట్టింట్లో షేర్ చేసింది. ఆ పిక్స్ ప్రస్తుతం చెక్కర్లు కొడుతున్నాయి.
ముందు నేనే ప్రపోజ్ చేశా :
ఇంద్రజ, కార్తీక్ మంచి స్నేహితులు. చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజ తన లవ్ గురించి చెప్పింది. అమ్మా నాన్న కంటే ఎక్కువగా కార్తీక్ తనకు సపోర్ట్ గా నిలిచేవాడని తెలిపింది. అంతే కాదు కార్తీక్ మామన్ ట్రస్ట్ (Maman trust)కూడా నడుపుతున్నాడని.. అందులో ఎంతో మంది ఆర్ఫన్ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడని చెప్పింది. ముందుగా తనే కార్తీక్ కు ప్రపోజ్ చేశానని.. నాలుగు నెలల తర్వాత కార్తీక్ తనకు ఓకే చెప్పాడంది.
ఆ తర్వాత వారంలోనే ఇంట్లో వారికి చెప్పి నిశ్చితార్థం చేసుకున్నామని చెప్పింది. ఇంత్రజ ఫాదర్ కూడా నటుడే. రోబో డ్యాన్స్ తో ఆయన తమిళ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యారు. ఆయన్ని అందరూ రోబో శంకర్ అని పిలుస్తారు. ఈయన మిమిక్రీతో తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లో హాస్యనటుడగా ఛాన్స్ రావడంతో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.