దొంగ నోట్లు బ్యాంకు లో ఎవరు ఎలా జమ చేస్తున్నారు – ATM లో జాగ్రత్త RBI హెచ్చరిక

spotlight 2 దొంగ నోట్లు బ్యాంకు లో ఎవరు ఎలా జమ చేస్తున్నారు - ATM లో జాగ్రత్త RBI హెచ్చరిక


భారత దేశంలో నకిలీ నోట్లను అరికట్టేందుకు అధికారులు, పోలీసులు ఎన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఇంకా అక్కడక్కడ కొన్ని నకిలీ నోట్లు వస్తునే ఉన్నాయి. తాజాగా బ్యాంకుల్లో జమ చేస్తున్న నకిలీ నోట్లు రూ.10 నుంచి రూ.2000 వరకు ఉన్న బ్యాంకుల్లో చేరుతున్నాయని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ మధ్యనే ఢిల్లీలోని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్లో మొత్తం 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు అక్కడి పోలీసులు చెప్పారు. విశేషం ఏంటంటే ఈ FIR లలో ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న అధికారిపై కేసు నమోదైంది.

బ్యాంకుల కు నకిలీ నోట్ల రావడం అనేది సర్వసాధారణం అయిపోయిందని దీనికి సంబందించి ఎప్పటికప్పుడు సమాచారం మాకు అందుతూనే ఉంటుందని పోలీసులు చెప్పారు. అయితే మా విచారణలో కొన్ని విషయాలు తెలుసుకున్నామని ఈ నోట్లు జూలై 1, 2023 నుండి డిసెంబర్ 31, 2023 ల మధ్య బ్యాంకులకు కొన్ని నకిలీ నోట్లు వచ్చినట్లు మాకు వివరాలు అందాయని పోలీసులు చెప్పారు. అయితే ఈ నోట్లు ఉన్నవారు నేరస్థులు మాత్రం కాదని సామాన్యులు, సాధారణ ప్రజలు నకిలీ నోట్లను మొదట గుర్తించక పోయినా తర్వాత బ్యాంకులో డిపాజిట్‌ అయిన తర్వాత మాత్రమే గుర్తిస్తున్నారు. అందువల్ల పోలీసులు కూడా ఎవరిపైన కూడా చర్యలు తీసుకోలేక పోతున్నారని బాంక్ వర్గాలు చెప్తున్నాయి.

ఒక విచిత్రం ఏంటంటే ప్రతిరోజూ కనీసం ఒకరిద్దరు వ్యక్తులు వద్ద ఈ నకిలీ నోట్లు ఉంటున్నాయని బ్యాంకులు పోలీసుల విచారణ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ నోకిలీ నోట్లు అనే సంగతి సామాన్య ప్రజలకు తెలియక పోవడం అనేది వస్తున్న సమస్య. వారు డిపాజిట్‌ చెయ్యడానికి బ్యాంకుకు వచ్చినప్పుడు మాత్రమే అవి నకిలీ నోట్లని అధికారులు గుర్తిస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఆ నోట్లను తిరిగి కస్టమర్ కి వెనక్కి ఇస్తున్నప్పుడు గొడవలు వస్తున్నాయని బ్యాంకు అధికారులు చెప్పారు. అప్పుడప్పుడు డబ్బుల కట్టల్లో మధ్యలో ఒకటి రెండు నోట్లు బయటపడుతున్నట్లు బ్యాంక్ అధికారులు చెప్తున్నారు.

Leave a Comment