Bigg Boss Telugu 7 winner Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ పేరులో ఉన్న పల్లవి ఎవరు..ప్రశాంత్ కి కృష్ణ నగర్ కష్టాలు తప్పలేదా..
తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షోను ప్రతి ఒకరు ఫాలో అవ్వకపోవచ్చు, కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన వారు మాత్రం టూ తెలుగు స్టేట్స్ లో యమా పాపులర్ అవుతారు.
బిగ్ బాస్ సీజన్ లోని ప్రతి ఎపిసోడ్ ను ఫాలో అయ్యినా అవ్వకపోయినా గ్రాండ్ ఫినాలే మాత్రం తప్పక చూసేవారు ఉంటారు. లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే గెస్టులు, ఆ ఎపిసోడ్ లో చేసే స్పెషల్ ఈవెంట్లు అన్ని కూడా హైలైట్ గా నిలుస్తాయి.
అన్నిటికి మించి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అన్న దానిపై చివరివరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. చివరివరకు పోరాడి విజేతగా నిలిచినా వారినే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. అందుకే పోటీలో విజయాన్ని ముద్దాడాలని పోటీ లో నిలబడ్డ ప్రతి ఒక్కరు కృషి చేస్తారు.
ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లు ఒక ఎత్తు ఈ బిగ్ బాస్ సీజన్ మరోఎత్తు, ఎందుకంటే ఇప్పటివరకు సినిమా రంగానికో, టివి రంగానికో చెందిన ప్రముఖులు విజేతలుగా నిలిచారు, కానీ ఈ బిగ్ బాస్ సీజన్లో మాత్రం ఒక సామాన్య రైతు విజేత అయ్యాడు.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, కేవలం తన ఆటతీరు, తన మాట తీరుతోనే బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. మట్టి మనిషి ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాడు.
ఎన్నో సినిమాల్లో నటించి, ఆతరువాత రాజకీయంగా కూడా పలుకుబడిని కూడా తెచ్చుకున్న శివాజీ లాంటి వారిని కూడా తోసిరాజని ముందుకు వచ్చాడు పల్లవి ప్రశాంత్, అయితే ఇలాంటి సమయంలోనే అందరూ పల్లవి ప్రశాంత్ గురించే సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
కాబట్టి పలలవి ప్రశాంత్ నేపధ్యం ఏమిటి అన్నది తెలుసుందాం. పల్లవి ప్రశాంత్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన వాడు. ప్రశాంత్ తండ్రి సత్తయ్య కూడా రైతే.
డిగ్రీ వరకూ చదువుకున్న ప్రశాంత్‌కు చిన్నప్పటి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం అంటే చాల ఇష్టం. ఆమక్కువే అతడిని సహవాసగాళ్ళతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే విధంగా ముందుకి నడిపించింది. జానపద గీతాలతో అనతికాలంలోనే నెటిజన్లకు చేరువయ్యాడు.
అంతా బాగానే నడుస్తోంది అనుకున్న సమయం లో ఒక సమస్య తలెత్తింది. వారు ఉమ్మడి మీద మొదలు పెట్టిన యూట్యూబ్ ఛానల్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది.
అప్పటి వరకూ సంపాదించిన డబ్బులతో పాటు, ఆ యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రశాంత్ వదులుకోక తప్పలేదు. సున్నితమైన మనస్సు కలిగిన ప్రశాంత్ ఆ ఎదురుదెబ్బను తట్టుకోలేకపోయాడు.
మనోవేదనను గురైన ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరిసారిగా ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు, అయితే తండ్రి చెప్పిన మాటలు ప్రశాంత్ ను ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీరుకునేలా చేశాయి.
తండ్రి ఏమన్నాడంటే ‘బిడ్డా నువ్వు అలాంటి పని చేయకు, నీ ఎడబాటు మేము తట్టుకోలేము, నిను విడిచిపెట్టి మేము బతకం అని అన్నాడు. నువ్వు చేయాలనుకున్నది మళ్లీ చెయ్.
నువ్వు సాధించాలనుకున్నదానికోసం సాధన మొదలు పెట్టు, నీకు తోడుగా నేను ఉంటా’ అని చెప్పడు, కొడుకులో ధైర్యాన్ని నూరిపోయడంతో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 విన్నారయ్యాడు.
ఆసమయంలో ప్రశాంత్ తన ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేయడం మొదలు పెట్టాడు.
అంతా బాగానే ఉంది కానీ పల్లవి ప్రశాంత్ కి పల్లవి అనే పేరు ఎలా వచ్చింది అని చాల మంది డౌట్ ఉంది, కొనదరైతే అదేమైనా వారి పూర్వీకుల పేరా, లేక తన గర్ల్ ఫ్రెండ్ పేరా, అని ఆలోచించడం మొదలు పెట్టారు.
తన పేరులో ఆడపిల్ల పేరు మాదిరిగా ఉండే ‘పల్లవి’ అనే పేరు వెనుక ఒక చిన్న కథ దాగి ఉంది. ప్రశాంత్ తండ్రి సత్తయ్య ప్రశాంత్ పుట్టకమునుపు, మహాబలిపురంలోని పల్లవులు కట్టించిన గుడికి వెళ్లాడట. ఆ సమయంలో తనకు కొడుకు పుడితే,
ఆ పేరు పల్లవుల పేరు కలిసొచ్చేలా నామకరణం చేసుకుంటానని మొక్కుకున్నారట. ఆతరువాత కొడుకు పుట్టడంతో దేవుని మహిమ గా భావించి పుట్టిన ఆ అబ్బాయికి మొదట్లో పల్లవరాజు అని పేరు పెట్టారట. కానీ తరువాత కాలం లో పల్లవి ప్రశాంత్‌గా మార్చుకున్నారట.
తన తండ్రి తో కలిసి వ్యవసాయం చేయడం మొదలు పెట్టిన ప్రశాంత్ కి రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు బాగా అవగాహనలోకి వచ్చాయి.
కాబట్టి ఆ అవస్థలన్నిటిని వీడియోలుగా తీసి, సోషల్‌మీడియాలో పంచుకోవడంతో మొదలు పెట్టాడు. ఆ వీడియోలకు వ్యూవర్ షిప్ పెరిగింది, నెమ్మదిగా ప్రశాంత్‌కు అభిమానులు కూడా పెరిగారు.
అన్నా.. రైతు బిడ్డను.. అన్నా మళ్లొచ్చినా.. అంటూ పల్లవి ప్రశాంత్ తనదైన శైలిలో చెప్పే డైలాగ్‌లు, ఆ వీడియోలలో ప్రశాంత్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చాల మందిని కట్టిపడేశాయి. అయితే డిగ్రీ వరకు చదువుకున్నాడు కాబట్టి తనకి టీవీల్లో వచ్చే రియాలిటీ షోలమీద కొంత అవగాహనా ఉంది.
అందుకే ‘బిగ్‌బాస్’ షోపై ఆసక్తి పెంచుకున్నాడు‘ ఎప్పటికైనా బిగ్‌బాస్ షోలో పాల్గొంటా అని చెబుతూ వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. అంతే కాదు ‘బిగ్‌బాస్’ కొత్త సీజన్ మొదలు పెడుతున్నారన్న వార్త తెలిసి అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు.
పట్టుదలతో శ్రమిస్తే ఎంతకష్టతరమైన పనైనా తేలికగా సాధించవచ్చిని, పోరాడితే విజయం మన బానిస అవుతుందని ఊరికే అనలేదు. ప్రశాంత్ లాంటి వారిని చూసే ఇలాంటి మాటలు చెప్పరేమో.
ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న డబ్బులు అయిపోతే పస్తులు పడుకున్నాడు. కృష్ణా నగర్ కష్టాలు అన్నీ పడ్డాడు.
రెండు సీజన్‌ల నుండి ప్రయత్నిస్తే ఈ సీజన్ లో అవకాశం దొరికింది ప్రశాంత్ కి, ప్రయత్నిస్తున్న సమయంలో అవరోధాలు ఒకఎత్తయితే స్నేహితుల నుండి ఎదురయ్యే అవమానాలు మరోఎత్తు,‘నువ్వు బిగ్‌బాస్ వెళ్లడమా.. అది అయ్యే పని కాదులే’ అని ఫ్రెండ్స్ కూడా గేలి చేసేవారట.
వాటిని అస్సలు పెట్టించుకోని ప్రశాంత్, తానూ బిగ్ బాస్ లోకి వెళ్లాలనుకుంటున్నానని, ఈ వీడియోలు నాగార్జున చూసే అంతగా వైరల్ చేయండి అంటూ ఫాలోవర్స్ ను నెటిజన్లను కోరడంతో అవి బాగా ట్రెండ్ అయ్యాయి. ఫైనల్ గా తాను అనుకున్నదానిలో సగం విజయం సాధించాడు. సీజన్-7 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్రశాంత్‌ను ఎంపిక చేసింది.
ప్రశాంత్ రైతు బిడ్డ కదా అని జాలితో విన్నర్ ను చేయలేదు, అతని ఆటలో జోరు, టాస్కులు కంప్లీట్ చేసే హోరు, నామినేషన్ సమయంలో తను చూపించే ఫైరు, ఇవన్నీ అతడిని విజయం వైపు పరుగులు పెట్టించాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కొత్తలో కొంత తడబడినప్పటికీ ఆతరువాత ఆటతీరును అర్ధం చేసుకుని నిలబడ్డాడు. సీజన్ 7లో మొదటి కెప్టెన్సీ ని కూడా దక్కించుకున్నాడు.