ఇళయ రాజా తో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా ? ఇలా ఉన్నాడు ఏంటి ?

WhatsApp Image 2024 03 13 at 5.17.53 PM ఇళయ రాజా తో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా ? ఇలా ఉన్నాడు ఏంటి ?

who is the person with Ilaya Raja? : తన కెరీర్ ప్రారంభించి నప్పటి నుండి ఇతను అందించిన ట్యూన్ లు ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. 1999 సంవత్సరం లో కోడి రామకృష్ణ దర్సకత్వం లో వచ్చిన మూవీ దేవి తో తన జర్నీ స్టార్ట్ చేసాడు. అది సూపర్ హిట్ అవ్వడం తో ఇక వరుస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి .

ఇప్పటికి అతను ట్యూన్ చేసిన పాటలు ఎక్కడో అక్కడ నిత్యం వినిపిస్తూ ఉంటాయి. కొన్ని ట్యూన్ లు అయితే అసలు మర్చి పోలేము. అందులో కొన్ని సినిమాలు చూసినట్లయితే ఆనందం, ఖడ్గం, మన్మధుడు, కలుసుకోవాలని, సొంతం, ఆర్య, నువ్వు వస్తానంటే నేనొద్దంటాన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప తో పాన్ ఇండియాను టాప్ లేపాడు అని చెప్పాలి.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తన సంగీతం తో అలరించాడు.వేరే భాషలలో కూడా తన ట్యూన్ లు అందించి అక్కడ వారిని కూడా తన వైపు చూసేలా చేసాడు. ఇప్పుడు పుష్ప 2 కి సంగీతం అందించడం మే కాకుండా నాగ చైతన్య నటిస్తున్న తండెల్ కూడా తన సంగీతం మెస్మరైజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పడు ఈ ఫోటో లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా ! ఈ పాటికే మీకు ఇతను ఎవరో అర్ధం అయ్యి ఉండాలి, అతను ఎవరో కాదు మన దేవిశ్రీ ప్రసాద్. ఇతను సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 25 వసంతాలు పూర్తి చేసుకున్నాడు.

ఇప్పుడు 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లి వేడుక జరుపుకుంటున్న సమయం లో అతడు ఒక విదేఒను విడుదల చేసాడు. తాను ఇళయ రాజాను తన గురువు గా భావిస్తానని చెప్తూ ఆయన నేను ఇంత ఎత్తు ఎదగ డానికి నాకు మా గురువు అయిన ఇళయ రాజా గారు అని ఆయనే నాకు స్ఫూర్తి అని అన్నాడు. ఇప్పటికి ఆయన ఫోటో ను తన స్టూడియో లో పెట్టుకున్నట్లు చెప్పాడు. ఎప్పటికైనా మా గురువు గారు నా స్టూడియో కి వస్తే ఆ ఫోటో ముందు ఆయన తో ఒక ఫోటో తీయించుకోవాలని ఒక కోరిక బలంగా ఉండేది.

కాని ఆయన ఉన్న బిజి షెడ్యుల్ లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అడగలేక ఉండిపోయానని ఇప్పుడు నాకు ఆ అదృష్టం కలిగిందని చెప్పాడు. ఇటీవలే ఇళయ రాజా గారు తన స్టూడియో ను సందర్శించారని దేవిశ్రీ ఆనందం వ్యక్తం చేసాడు. ఆయన వచ్చినపుడు కలిసిన సందర్భం గా తీసిన ఫోటో ను X లో పోస్ట్ చేసాడు దేవిశ్రీ. కాని ఆ ఫోటో లో ఉన్నది దేవిశ్రీ ప్రసాద్ అని ఎవరు అనుకోరు. మనషి మొత్తం మారిపోయాడని ఎందుకు అలా అయిపోయాడు అని అందరు ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

Leave a Comment