లేఆఫ్స్ బెడద ఎవరికి : Who Should Worry about layoffs?

website 6tvnews template 2024 01 31T160326.682 లేఆఫ్స్ బెడద ఎవరికి : Who Should Worry about layoffs?

Who Should Worry about layoffs? : అమెజాన్(Amazon), ఈబే(eBay), ఆల్ఫబెట్(Alphabet), మైక్రోసాఫ్ట్(Microsoft), సిటీగ్రూప్(Citigroup), మేసీస్, షెల్, వేఫెయిర్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ వంటి సంస్థలు తమ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని హింట్ ఇవ్వడంతో అనేక మంది టెకీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

కొత్త సంవత్సరం మొదలై నెల కూడా గడవక ముందే లేఆఫ్స్ అనే సైరన్ మోగడంతో వారు ఖంగారు పడిపోతున్నారు.

ఇది చాలదన్నట్టు యునైటెడ్ పార్సెల్ సర్వీస్ అనే సంస్థ తన కంపెనీ నుండి ఏకంగా 12 వేల మందిని ఫైర్ చేస్తా అని చెప్పడంతో ఆ వార్త విన్న టెక్ ఉద్యోగస్తులు నిర్ఘాంత పోతున్నారు.

ఒక పక్క లేఆఫ్స్ మరోపక్క ఓపెనింగ్స్ : Layoffs on one side and openings on the other

thumbnail 5 0 లేఆఫ్స్ బెడద ఎవరికి : Who Should Worry about layoffs?

ఈ లే ఆఫ్ అని జాబ్ ఫైర్ అని రకరకాల పేర్లతో ఉద్యోగాలు ఊస్ట్ అవుతున్నాయనే వార్తలు వస్తుంటే మరోపక్క పూర్తి విరుద్ధమైన వాతావరం కనిపిస్తోంది.

ముఖ్యంగా అమెజాన్ లో అత్యధిక స్థాయిలో కొత్త ఉద్యోగస్తులను తీసుకుంటున్నారు. గడిచిన మూడు నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి ఆస్కారం ఉందొ అంత మొత్తంగా ఉద్యోగాలు ఆఫర్ చేసింది ఈ అమెజాన్(Amezon) సంస్థ.

నిపుణుల అభిప్రాయాలూ ఎలా ఉన్నాయంటే : What experts are telling ?

ఈ విషయంపై ఆర్థికవేత్తలు, రిక్రూటర్లు, కన్సల్టెంట్లు మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు అంటే ఈ లేఆఫ్స్ ప్రమాదం అనేది ఎక్కువగా మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌లో ఉన్న ఉద్యోగులకు, వర్క్ ఫ్రం హోం(Work From Home) చేసేవారికి ఉందని చెబుతున్నారు.

రిమోట్ ఏరియాల్లో ఉంది పని చేస్తున్న ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రప్పించే పనిలో ఉన్నాయి కంపెనీలు. కార్యాలయానికి వచ్చి పనిచేయడానికి ఇష్టపడని వారికి స్వస్తి చెప్పడానికి ఎంత మాత్రం ఆలోచించడం లేదట. కంపెనీ కి ఎంప్లాయి వల్ల ఎంత ప్రాఫిట్ అనే కోణంలోనే వారి ఆలోచనలు ఉంటాయి. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయంటే లేఆఫ్స్ చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించవు.

అపాయానికి ఉపాయం : Trick for layoff danger

layoffs pic e1679978373299 లేఆఫ్స్ బెడద ఎవరికి : Who Should Worry about layoffs?

ఈ గడ్డు పరిస్థితులను అధిగమించాలంటే ఒక్కటే మార్గం మేనేజ్మెంట్ తో మంచి సంబంధాలు కలిగి ఉండటం, రెండు వర్క్ ఫ్రేమ్ హోమ్ అనే పదాన్ని మర్చిపోవడం.

పైగా నెట్వర్కింగ్‌ మీద పట్టు ఉన్నవారికి ఈ గడ్డు పరిస్థులను ఎదుర్కోవడం కొంత తేలికగా ఉంటుందట. ఇక లేఆఫ్స్ గురించి బ్లూ కాలర్ స్థాయి ఉద్యోగులు అంతగా దిగులు చెందాల్సిన పని లేదని అంటున్నారు. ఈ లే ఆప్స్ బెడద ఏదైనా ఉంటె అది వైట్ కాలర్ ఉద్యోగులకే ఎక్కువ అని అంటున్నారు.

ఏ కంపెనీ అయినా చేసేది ఇదే : This is what any company does

ఎకాడమిక్ ఇయర్ కి సంబంధించి ప్రతి సంస్థ కూడా తమ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ను బెటర్ గా చేసుకోవాలనే అనుకుంటాయి. అందుకే ఏ కంపెనీలో అయినా సరే డిసెంబర్ జనవరి నెలల్లోనే ఈ లేఆఫ్ లు, ఫైర్ అనే మాటలు వినపడతాయి.

రానున్న ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక భారాన్ని ఎంత మేర తగ్గించుకోవాలి లాభాలు ఎక్కడ వెతుక్కోలి అన్న కోణంలోనే ఉంటుంది వారి దృక్పధం.

Leave a Comment