Why Indian Railways are so slow? : రైల్వేను ఎవరు స్టార్ట్ చేశారు..భారతదేశంలో రైళ్లు ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటి.?
రైలు ప్రయాణం ఇది సుఖవంతమైనది, సౌకర్యవంతమైనది అని ఎక్కువ మంది భావిస్తారు. ఇక రైలు ప్రయాణం చాలా సరదా అయినా ప్రయాణం. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ రైలు ప్రయాణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
చికు చికు రైలు వస్తోంది దూరం దూరం జరగండి అంటూ చిన్ననాటి నుండే రైలు పట్ల ఒక సరదాను పెంచుకుంటారు. అంతే కాదు ఈ రైలు ప్రయాణం కొత్త పరిచయాలను తెచ్చి పెడుతుంది. తోటి ప్రయాణికులతో కలిపే మాటలు స్నేహానికి దారితీస్తాయి.
రైలులో ఎక్కే వరకు బాగానే ఉంటుంది కానీ ఆ రైలు ఆలస్యం అయితే మాత్రం చాలా అసౌకర్యంగా, చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక వేళ రైలు ఎక్కిన తరువాత కూడా ఏదైనా సందర్భంలో క్రాసింగ్ నిమిత్తం నిలిపివేస్తే ప్రయాణికులు చాల ఇబ్బంది పెడుతూ ఉంటారు.
అసలు మన భారతదేశంలో రైళ్లు ఎందుకు ఆలస్యం అవుతూ ఉంటాయి. నిర్దిష్ట సమయానికి మన గమ్య స్థానికి మనల్ని చేర్చాల్సిన రైలు ఎందుకు క్రాసింగులు పెట్టబడుతూ ఉంటుంది.
How many people travel by train per day:
రాఖి సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ రైల్వే గురించి గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్తాడు. భారత దేశంలో రోజుకి 1కోటి యాభై లక్షల మంది రైల్వే లో ప్రయాణిస్తారని, 8 వేళా స్టేషన్లు, లక్ష ఏడు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్, ఒక్క రోజులో 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం జరుగుతోందని చెప్తాడు.
ఇక మొత్తం 64 డివిజన్లు, 15 లక్షల మంది ఉద్యోగులు, ఆపరేటింగ్ బ్రాంచ్ టెక్నీకల్ బ్రాంచ్, ఐవో డబ్ల్యు వంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి.
పైగా సంవత్సరానికి రైల్వే ద్వారా ప్రభుత్వానికి చేరుతున్న ఆదాయం 56 వేల కోట్లు. రైల్వే అంటే 150 సంవత్సరాల ఘన చరిత్ర అని ఆ డైలాగ్ లో ఉంటుంది.
The film Jayam movie produced by director Teja has a train carriage train carriage song:
అయితే ఈ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు మరో సినిమా గురించి మాట్లాడుకోవాలి, అందులో కూడా రైలుకి సంబందించిన ఒక ప్రస్తావన ఉంటుంది.
డైరెక్టర్ తేజ రూపొందించిన సినిమా జయం అందులో రైలు బండి రైలు బండి వేలకంటూ రాదులెండి, దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి అని ఉంటుంది, అయితే మరి ఆ పాత విషయంలో రైల్వే వాళ్ళు అభ్యంతరం తెలిపారో లేక సెన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపారో ఏమోకానీ తరువాత అందులోని
సాహిత్యాన్ని మార్చారు, రైలుబండి రైలు బండి ఎంత మంచి రైలు బండి అని ఊరువాడా తిప్పేనండి అంటూ రాసుకొచ్చారు. దీని బట్టి చుస్తే వెనుకటి ఒక సామెత గుర్తుకొస్తోంది, నడమంత్రపు కోక నడిబజారులో ఊడటం తప్పుకాదు కాదు కానీ పది మంది చూసి నవ్వడం మాత్రం తప్పు అన్నదాత ఒక వన్నెలాడి.
Before let’s talk about Late coming:
ఇక రైల్వే గురించి దాని లెట్ కమింగ్ గురించి మాట్లాడబోయే ముందు అసలు రేల్వే ను ఎవరు స్టార్ట్ చేశారు, దానిని ఎవరు అభివృద్ధి చేశారు అన్నది ఒక్కసారి చూద్దాం.
భారతీయ రైల్వే 1853 ఆగస్టు 15న స్టార్ట్ చేయబడింది. అంటే అది ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొదలు పెట్టారని మనం అర్ధం చేసుకోవచ్చు. మొదటి రైలు బెంగాల్ రాష్ట్రంలో పరుగులు పెట్టింది.
ఆ రైలు ప్రయాణించిన దూరం 34 కిలోమీటర్లు. ఖరగ్ పూర్ నుండి హౌరా వరకు ఆ రైలు ప్రయాణించింది. మొదట్లో ఎక్కువగా సరుకు రవాణా కోసమే రైలును ఉపయోగించేవారని తెలుస్తోంది. 1853 నుండి 1947వ సంవత్సరం వరకు భరతదేశంలోని రైల్వే శాఖను అనేక ప్రయివేటు కంపెనీలు నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది.
1947 వ సంవత్సరం లో బ్రిటిష్ వారు భారత దేశాన్ని విడిచిపెట్టినప్పుడు మనం స్వాతంత్రులమయ్యాం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుండి రైల్వే ను భారత సర్కారు క్రమంగా ప్రయివేటు కంపెనీల నుండి తన చేతుల్లోకి తీసుకోవడం మొదలు పెట్టింది.
మొత్తంమీద చుస్తే 1951 ఇండియన్ ఇండియన్ రైల్వే గా నిర్వహిస్తూ వస్తోంది. నిజానికి మనకి స్వాతంత్య్రం వచ్చేనాటికి వివిధ కంపెనీల ద్వారా రైల్వే ను భారతదేశం పాకిస్తాన్, బాంగ్లాదేశ్ కి కలిపి మొత్తం 65 వేల కిలోమీటర్ల ట్రాక్ వేయబడి ఉంది.
కానీ ఇండిపెండెన్స్ తరువాత, పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ లు భారత్ నుండి విడిపోయాయి. అంటే వారి రైల్వే కూడా భారత్ నుండి విడిపోవాలి కాబట్టి 65000 కిలోమీటర్ల ట్రాక్ నుండి 10 వేల కిలోమీటర్ల ట్రాక్ విడిపోయింది.
Diesel trains were converted into broad gauge trains and electric engine trains:
అంటే లక్షా ఏడు వేల కిలోమీటర్లు 2006 నాటికి 107000 కిలోమీటర్లు అదే 2023 నాటికీ వచ్చే సరికి 118043 కిలోమీటర్లు సుమారుగా వేసినట్టు తెలుస్తోంది.
టెక్నాలజీ సరిగా లేని ఆరోజుల్లోనే ప్రయివేటు కంపెనీలు ఈస్టిండియా కంపెనీతో కలిసి 50,000 కిలోమీటర్ల ట్రాక్ ను వేస్తె 1951 నుండి 2023 వరకు భారత ప్రభుత్వాలు వేసిన ట్రాక్ 68 వేల 43 కిలోమీటర్లు అని చెప్పుకోవాలి.
అయితే అప్పట్లో రైళ్లు అన్ని కూడా మీటర్ గేజ్ రైళ్లు, బొగ్గు సహాయంతో నడిచే రైళ్లు. చాలా నిదానంగా నడిచేవి. కాలానుగుణంగా వాటిని డీజిల్ తో నడిచే రైళ్లుగా బ్రాడ్ గేజ్ రైళ్లుగా, ఎలెక్ట్రిక్ ఇంజిన్ రైళ్లుగా మార్చారు. బొగ్గుతో నడిచే రైళ్లు నెమ్మదిగా వెళుతున్నాయేమో మార్చాము లే అనుకోవచ్చు.
కలనుకునంగా కరెంట్ తో నడిచే రైలుకు ప్రస్తుతం వచ్చాం. మరి పరాయి దేశాల్లో బుల్లెట్ రైళ్లు, స్పీడ్ రైళ్లు వచ్చిన తరువాత కూడా మన దేశంలో ఇంకా అదే మామూలు రైళ్లతో కాలక్షేపం చేస్తే ఎలా.
అయితే దానికి సమాధానంగా వందే భారత్ రైళ్లు వచ్చాయి కదా అని వాదించే వారు లేకపోలేదు, కానీ వందే భారత్ రైలు అసలు సామార్ధ్యం ఎంత మన దేశంలో పెరిగెడుతున్న స్పీడెంత.
వాటిలో చాల వ్యత్యాసం ఉంది. వందే భారత్ రైలు 160 కిలోమీటర్ల స్పీడ్ తో పరుగులు పెట్టగలడు అని చెబుతున్నప్పటికీ అది వెళుతున్న సగటు వేగం 90 కిలోమీటర్లు మాత్రమే.
Can’t go fast In Indian Railways:
మన భారత దేశంలో ఎంత అత్యాధునిక రైళ్లను తీసుకొచ్చినా ఇంతకన్నా వేగంగా వెళ్ళడానికి సాధ్యం కాదు, ఈ మాట మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇది చేదు నిజం.
అందుకు ప్రధాన కారణం మన భారత దేశంలో ఉన్న రైలు పట్టాలు. ఇండియా లో బొగ్గు తో నడిచే మీటర్ గేజ్ రైళ్లు తీసేసి ఫాస్ట్ గా వెళ్లే బ్రాడ్ గేజ్ రైళ్లను ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మీటర్ గేజ్ రైళ్లు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. పైగా అప్పట్లో మన దేశంలో ఉన్న ఇన్ఫ్రా స్ట్రక్చర్ కి అవి 40 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో నడిచేవి కావని చెప్పొచ్చేమో.
అయితే మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కి వచ్చినా పెద్దగా వ్యత్యాసం కనిపించకపోవడం విచారకరం. మన దేశంలో మామూలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్న సగటు వేగం గంటకు 42 నుండి 45 కిలోమీటర్ల వేగం. ఇక సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం గంటకు 55 కిలోమీటర్ల వేగం.
కొన్ని ప్రీమియం రైళ్ల వేగం మాత్రం గంటకు 75 నుండి 90 లోపే ఉంటున్నాయి. అందుకు కారణం మనదగ్గర సరైన రైలు ఇంజన్లు లేకపోవడం కాదు. సరైన ట్రాక్ లేకపోవడం.
మనం వేసుకున్న రైల్వే ట్రాక్ ఎప్పుడో పాతకాలం నాటిది. ఆ ట్రాక్ మీద వందే భారత్ కాదు కదా చైనా లో ఉన్న బులెట్ ట్రైన్ ను తీసుకొచ్చిన అది కూడా 90 కిలోమీటర్లకు మించి పురుగులు పెట్టె వీలుండదు.
Why are they trying to replace the old track with a modern new track:
మరి మన ప్రభుత్వాలు రైల్వే ట్రాక్ ను ఆధునీకరించవచ్చు కదా, పాత ట్రాక్ స్థానంలో అధునాతనమైన కొత్త ట్రాక్ ను వేసి రైలు వేగాన్ని పెంచకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు అంటే, అందుకు కూడా ఒక కారణం ఉంది.
ట్రాకులు వేసి రైలు వేగాన్ని పెంచినంత మాత్రాన ఆ వేగం ప్రజల కళ్ళకి కనిపించదు. అదే వేగంగా పరుగులు పెట్టె రైళ్లను తీసుకొచ్చినా, అధునాతన మైన రైలు కోచ్ లను తీసుకొచ్చినా అవి కళ్ళకు కనబడతాయి, అవి వేగంగా వెళ్లినా వెళ్లకపోయినా ఆధునికతా అనేది చూడ్డానికి పనికొస్తుంది.
ఇక రైళ్లు సమయానికి రాకపోవడానికి మరో కారణం రైల్వే స్టేషన్లు. భారత దేశంలో ఇప్పటివరకు కొత్త రైల్వే స్టేషన్లు అస్సలు రాలేదు. ఉన్న రైల్వే స్టేషన్లను పెద్దవిగా మార్చనూ లేదు.
కొన్ని స్టేషన్లలో 24 కోచ్ ల రైలు ఆగాలంటే అస్సలు సాధ్యం కాదు. మనదేశంలో ప్రభుత్వాలు రైల్వే స్టేషన్లలో లిఫ్టులు ఎస్కవేటర్లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని చెబుతున్నాయి.
స్టషన్లను గ్రీన్ అండ్ క్లిన్ గా ఉంచినంత మాత్రాన అభివృద్ధి జారినట్టేనా అంటే నిపుణులు, విమర్శకులు ముక్తకంఠంతో కాదనే అంటున్నారు.
ఎప్పుడైతే రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారం లు మరింత పొడవుగా విస్తరిస్తారో, ఎప్పుడైతే రైళ్లు ప్లాట్ ఫారం ఖాళి లేక స్టేషన్ బయట నిలుపుదల చేయబడవో అప్పుడే రైళ్లు సరైన సమయానికి చేరుకుంటాయి.
There is a situation of planning a train journey:
రైలు ప్రయాణం అంటే సమయం ఆలస్యమైనా పర్లేదు ఆ రోజు మనకు అంతటి బిజీ షెడ్యూల్ ఏమి లేదులే అనుకుంటేనే ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రైలు గమ్య స్థానానికి సక్రమంగానే చేరుకుంటున్నప్పటికీ స్టేషన్ లో ఖాళి లేక స్టేషన్ బయటనే నిలిచి పోతున్నాయి.
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్రతి ఏడాది కొత్త రైళ్లను ప్రారంభిస్తోంది. అయితే అలా చేయడం వల్ల పేరు డాబు మాత్రమే కానీ ప్రయాణికులు సమయానికి గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎంత మాత్రమూ ఉపయోగపడవు.
ఎందుకంటే రద్దీగా ఉండే రూట్ లో ఒకటికి మించి ఎన్ని రైళ్లు ఉన్నా వాటిని వివిధ స్టేషన్లలో క్రాసింగ్ పెట్టక తప్పదు. కాబట్టి ప్రయాణికులు ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది ప్రత్యేక రైళ్లు, స్పీడ్ రైళ్ల కోసం కాదు, అధునాతన ట్రాక్ నిర్మాణం కోసం, అలాగే రైల్వే స్టేషన్ల విస్తరణ కోసం.
అలా జరిగినప్పుడే రైల్వే లో సమయపాలన అనేది సాధ్యపడే వీలు కలుగుతుంది. రైల్ గాడి బన్ గయా బైల్ గాడి అనే మాటను రైల్వే చెరిపేసుకోవచ్చు.
At a time when thousands of crores of revenue is coming from the railways:
ఇక ప్రతి ఏటా వేల కోట్ల ఆదాయం రైల్వే నుండి వస్తున్న తరుణంలో ఆ ఆదాయం, లో కొంత భాగాన్నైనా రైవే ట్రాక్ పునరుర్ధరణ కోసం వాడితే కెలవం కొన్ని సంవత్సరాలలోనే ఇండియన్ రైవే ట్రైన్స్ టైం కి స్టేషన్ లోకి చేరుకుంటాయి.
గుంటూరు నుండి సికంద్రాబాద్ రావడానికి సుమారు 250 స్లీపర్ క్లాస్ టికెట్ ధర, అదే నాన్ ఏసీ స్లీపర్ ప్రయివేటు బసుకి ధర 700 నుండి 1000 రూపాయల వరకు రోజుల డిమాండ్ ను బట్టి ఉంటుంది.
అంటే బస్ టికెట్ లో పావు వంతు కె చక్కగా పడుకుని రావడానికి వీలు ఉన్నప్పటికీ అనేక మంది బస్ లోనే వెళ్లేందుకు ఎందుకు మొగ్గుచూపుతున్నారంటే, టైం ప్రాబ్లెమ్. రైలు లేటు గా రావచ్చు, దానివల్ల కాలేజ్ కో, ఆఫీస్ కో, పరీక్షకో, పెళ్ళికో లెట్ గా వెళ్లే అవకాశం ఉంటుంది.
కొన్ని సార్లు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఫ్లైట్ అందుకునే అవకాశాన్ని కూడా చేజార్చుకున్న వారు ఉన్నారు. కాబట్టి అవతల వేరే అర్జెంట్ వర్క్ ఉన్నవారు ట్రైన్ అనే అప్షన్ ను పక్కన పెట్టేస్తున్నారు. ధర గురించి ఆలోచించకుండా ప్రయివేటు లేదంటే ఆయా రాష్ట్రల ట్రాన్స్పోర్ట్ నో ఎంచుకుంటున్నారు.
Sometimes common people also become the cause of train delay:
ఇక అన్నిసార్లు రైలు ఆలస్యం అవ్వడానికి అధికారులు, రైల్వే ట్రాకులు, రైలు ఇంజన్లు, రైల్వే స్టేషన్లే కాదు, కొన్ని సార్లు సామాన్య ప్రజలు కూడా రైలు లేట్ కి కారణం అవుతారు. కొన్ని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ వద్ద సిబ్బంది ఉన్నప్పటికీ, వారు వారిస్తున్నా వినకుండా సిగ్నల్స్ చూడకుండా ట్రాక్ దాటుతూ రైలు చక్రాల కింద పడి మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు.
దాని వల్ల కూడా రైలు ఆలస్యం ఆయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్లు రైలు ఎక్కుతు రైలుకి ప్లాట్ ఫార్మ్ కి మధ్యలో ఇరుక్కుపోతుంటారు, అలా ప్రమాదం బారిన పడటం వల్ల కూడా రైలు ఆలస్యం అవుతుంది.
అలాగే కొంత మంది పశువుల కాపర్లు ఆవులను రైలు ట్రాక్ కి దగ్గరలో గడ్డి మేపుతూ ఉంటారు. కానీ వాటిని సరిగా చూడకుండా వదిలేసి అశ్రద్దగా ఉండటం వల్ల ఆమూగా జీవాలు రైలుకి అడ్డంగా పడిపోతాయి.
ఈ క్రమంలో రైలు వాటిని ఢీకొనడం వల్ల రైలు ఆగిపోయే సమయాలు తలెత్తితాయి, తద్వారా ఆలస్యం అవుతుంది. కాబట్టి మనం కూడా కొన్ని నిబంధనలు పాటిస్తూ, రైలు సమయానికి ప్రయాణం చేసేందుకు సహకరించాలి.