పొన్నం ప్రభాకర్ ఫోన్ ట్యాప్ చేస్తుంది ఎవరు? 3 సార్లు ఫోన్ కాల్స్ లీక్ అయ్యాయి.

website 6tvnews template 2024 03 30T162317.089 పొన్నం ప్రభాకర్ ఫోన్ ట్యాప్ చేస్తుంది ఎవరు? 3 సార్లు ఫోన్ కాల్స్ లీక్ అయ్యాయి.

రోజుకో మలుపు తిరుగుతున్న ఫోన్ కాల్ టాపింగ్ వ్యవహారం లో ఒక్కక్కరు బయటకు వస్తున్నారు. ఇందులో చాలా కీలక పదవులలో పని చేసిన వారు ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మరల కొన్ని ఫోన్ కాల్ టాపింగ్ కి గురి అయినట్లు పుకార్లు వస్తున్న్నాయి. ఈ మధ్యనే మళ్ళి దీనికి సంబందించి మళ్ళి బయటకి వచ్చాయి.

అయితే ఇప్పటివరకు పొన్నంకు సంబందించిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ వరుసగా 3 సార్లు లీక్ అయ్యాయని పొన్నం ప్రభాకర ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ప్రభుత్వంలోని పెద్దలే ఒక బీసీ నేత ఎదుగుతున్నాడని ఆయన మీద పగతో ఇలా ఫోన్ ట్యాప్ చేసి లీకులు వదులుతున్నారు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గత వారం CSW అదనపు డీసీపీ తిరుపతన్న, భూపాలపల్లి అదనపు ఎస్పీ ఎన్.భుజంగరావులను అరెస్ట్ చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకరరావుకు కుడా సమన్లు ​​అందజేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Mr T. ప్రభాకర్ రావు ప్రస్తుతం భారతదేశంలో లేరని వైద్య పరీక్షల కోసం అమెరికా లో ఉన్నట్లు మాకు చెప్పాడని అధికారులు చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని అవసరమైనప్పుడు అతన్ని ప్రశ్నించడానికి నోటీసు పంపిస్తామని అధికారులు చెప్పారు.

Leave a Comment