Next CMs Of Chhattisgarh, MP and Rajasthan?: ఆ మూడు రాష్ట్రాలకు కొత్త సీఎంలు ఎవరో.. ఎంపిక చేసేది వీరే.

Who will be the new CMs for those three states.

Next CMs Of Chhattisgarh, MP and Rajasthan?: ఆ మూడు రాష్ట్రాలకు కొత్త సీఎంలు ఎవరో.. ఎంపిక చేసేది వీరే.

దేశ వ్యాప్తంగా కొన్ని రాష్టాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్నీ రాష్టాలలో ఎన్నికల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. తెలంగాణా లో అయితే ముఖ్య మంత్రి మరియు ఇతర మంత్రులు ప్రమాణ శ్రీకారం కూడా చేయడం జరిగింది. ఇంకా కొన్ని రాష్టాలలో ముఖ్యమంత్రులు ఎవరు అనే విషయం పైన మంతనాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బంపర్‌ మెజార్టీతో గెలిచిన బీజేపీ ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికకు కసరత్తును ముమ్మరం చేసింది. వారి ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున పరిశీలకులను నియమించింది.

రాజస్థాన్​కు, మధ్యప్రదేశ్​కు, ఛతీస్​గఢ్​కు ముగ్గురు చొప్పున మంత్రులు, సీఎంతో కూడిన పరిశీలన బృందాన్ని నియమించింది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ పోటీ కారణంగా సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశమై సీఎం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఇక మూడు రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా ఎన్నిక కానున్న శాసనసభాపక్ష నేతలు ఆయా రాష్ట్రాలకుముఖ్యమంత్రులుగావ్యవహరించనున్నారు. అయితే, రాజస్థాన్​ సీఎం ఎంపిక కోసం
సరోజ్​ పాండే, వినోద్​ తావడే, రాజ్​నాథ్ సింగ్​ను మధ్యప్రదేశ్​ సీఎం ఎంపికకు


కే.లక్ష్మణ్,ఆశాలక్రాను, మనోహర్ లాల్ ఖట్టర్​ నుఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎంపికకు అర్జున్​ ముండా,సర్భానంద సోనోవాల్,​దుశ్యంత్​ కుమార్​ గౌతమ్​ ను పరిశీలకులను నియమింంచారు.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న పలువురు నేతలు పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ జాబితాలో ముందున్నారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్​ షానూ కలిశారు. రాజేతో పాటు ఇతర ముఖ్య నేతలు మహత్ బాలక్ నాథ్, దియా కుమారి, రాజ్యవరార్ధన్ సింగ్ రాథోడ్​ కూడా రాజస్థాన్​ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఛత్తీస్‌గఢ్‌లో ఓబీసీ లేదా గిరిజన నాయకుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని బీజేపీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అరుణ్ సావో, ఎస్టీ నేతలు లతా ఉసెండి, గోమతి సాయి, రేణుకా సింగ్​ వంటి వారు కూడా సీఎం పదవి కోసం చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.


మధ్యప్రదేశ్​లో ‘మామా’గా పేరొందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది బీజేపీ హైకమాండ్​.

ఎందుకో ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రజల్లో అనుమానం వచ్చేలా సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయనపై కొన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నట్టు సమాచారం.
ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందారు.


ఇటీవలే విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 150కుపైగా సీట్లు సాధించింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అన్ని రాష్ట్రాల్లో లాగానే ఇక్కడ కూడా సీఎం కుర్చీ కోసం కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్​, జ్యోతిరాథిత్య సింధియా కూడా పోటీ పడుతున్నారు.

అయితే, సుదీర్ఘకాలంగా సీఎంగా సేవలందిస్తున్న శివరాజ్​కే ఈసారి కూడా ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్తారా లేదా వేరే వారికి అవకాశం ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Leave a Comment