ఆంద్ర ప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో విజయం ఎవరిదో తెలిసిపోయింది

website 6tvnews template 15 1 ఆంద్ర ప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో విజయం ఎవరిదో తెలిసిపోయింది

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజు రోజు కి వేడేక్కుతున్నాయి. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి, అధికారం లోకి వచ్చేది ఎవరు ఇలా ఎవరికి వారు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక సర్వే చేసిన సంస్ద అంచనా వేసింది. ఆ సంస్ద పేరు ” పయనీర్ పోల్ ” ఇది ఒక సర్వే చేసి సంచనల రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం TDP +జనసేన కూటమి దాదాపు 104 సీట్లు గెలుస్తాయని చెప్పింది. ఇప్పుడున్న అధికార పార్టీ అయిన YCP పార్టీ ప్రతిపక్ష పాత్ర వహించక తప్పదని జోస్యం చెప్పింది. వచ్చే ఎన్నికలలో కేవలం 45 సీట్లు మాత్రం గెలవడానికి ఆస్కారం ఉందని చెప్పింది. అయితే కొన్ని చోట్ల మాత్రం నువ్వు నేనా అన్నట్లు TDP +జనసేన పార్టీ అధికార YCP పార్టీ ల్స్ మధ్య హోరా హోరీ గా ఉంటుందని చెప్పింది. అంతే కాకుండా MP స్దానాలు చూసినట్లయితే మొత్తం 28 స్దానాలకి గాను TDP +జనసేన కూటమి కి 18 సీట్లు, YCP కి 7 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందని ” పయనీర్ పోల్ ” సంస్ద తన సర్వే వివరాలు చెప్పింది.

ఈ సారి రాయలసీమ లో పెరిగిన కాంగ్రెస్ సీట్లు :

రాబోయే అసెంబ్లీ ఎలేక్షన్స్ లో TDP +జనసేన కూటమికి 52% ఓట్ షేర్ అధికంగా ఉంటుందని చెప్పింది. ఇప్పుడున్న అధికార పార్టీ కి ఓటు షేర్ 42% కి తగ్గిపోతుందని పయనీర్ పోల్ సంస్ద అంచనా వేసింది.శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అలాగే కోస్తా జిల్లాలోను YCP కి వ్యతిరేకత చాల ఎక్కువగా ఉందని సర్వే లో తేలిందని ఆ సంస్ద చెప్పింది. రాయలసీమ ఉమ్మడి అనంతపురం జిల్లా తప్ప మిగిలిన 3 జిల్లాలలోను ప్రభుత్వ వ్యతిరేకత తక్కువ ఉందని చెప్పింది. మరోపక్క ఈ సారి కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఈ ఎన్నికలలో కాగ్రెంస్ పార్టీ ఓటు షేర్ 2.4% ఓట్లు వస్తాయని, కేంద్రం లో
BJP కి ఈ ఎన్నికలలో 1.5 % ఓటు షేర్ ఉంటుందని పయనీర్ పోల్ సంస్ద ఒక ప్రకటన విడుదల చేసింది.

175 నియోజకవర్గాల్లో సర్వే వివరాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మొత్తం నియోజక వర్గాలలో ఫీబ్రవరి 1,2024 నుండి ఫీబ్రవరి 14, 2024 ల మధ్య పయనీర్ పోల్ సంస్ద ఈ సర్వ్ ను చేపట్టినట్లు చెప్పింది.ఆంధ్ర రాష్రం లో మొత్తం 175 స్దానాలకు సంబందించి 90 వేల మంది అభిప్రాయం తీసుకున్నామని ఒక ప్రకటన జారి చేసింది. ఈ సర్వ్ లో పాల్గొన్నవారు 52% పురుషులు, 48% మహిళలు ఉన్నారని చెప్పింది. Y.S.R.C.P తో పాటు TDP +జనసేన కూటమి, కాంగ్రెస్,బిజెపి, సిపిఐ,సిపిఎం,ఆప్, బీఎస్పి, బీస్ఐ , జై భారత్ వంటి పార్టి లను కూడా సర్వ్ లో వారిని కూడా పరిగణ ణ లోకే తీసుకుని అంచనా వేసామని చెప్పింది.మా లెక్కలు ఏ ప్రకారం చుసిన TDP +జనసేన కూటమికి అధికారం దక్కే అవకాశం పూర్తిగా వీటికే ఉందని చెప్పింది.

Leave a Comment