రేపటి IPL మ్యాచ్ లో ఎవర్ని విజయం వరిస్తుందో !

website 6tvnews template 2024 03 26T115512.694 రేపటి IPL మ్యాచ్ లో ఎవర్ని విజయం వరిస్తుందో !

సోమవారం నాడు ముంబై ఇండియన్స్ చాల ఆనందోత్సాల మద్య హోళీ పండుగ జరుపుకున్నారు. హోళీ వేడుకలు జరుపుకున్న తర్వాత ముంబై జట్టు సబ్యులు తన తదుపరి మ్యాచ్ కోసం హైదరాబాద్ చేసుకున్నారు. తమ జట్టు సబ్యులు హైదరాబాద్ చేరుకుంటున్న సమయం లో వీడియో తీసి దానిని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. తమ తదుపరి మాత్చ్ కోసం ఉప్పల్ స్టేడియం లో సన్ రైజర్స్ తో ముంబై టీమ్ ఆడుతుంది.

అయితే ఆడిన రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ టైం ముంబై టీమ్ సారధి గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా కు ఫస్ట్ మ్యాచ్ లోనే ఓటమి చూడాల్సి వచ్చింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ విజయం అంచుల వరకు వచ్చి ఓడిపోవడం అభిమానులను ఆశ్చర్య పరిచింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది.

సన్ రైజర్స్ టీమ్ ను కోల్ కత నైట్ రైడర్స్ చిత్తు గా ఓడించింది. ఆఖరి సమయం లో ఒక భారీ షాట్ ఆడకపోవడం వల్ల ఓడిపోవక తప్పలేదు. ఇలా రెండు టీమ్ లు ఆడిన మొదటి మ్యాచ్ లు రెండు ఓటమి తో స్టార్ట్ చేసాయి. అయితే ఈ రెండు టీమ్ లు ఇప్పుడు ఎలాగైనా సరే గెలవాలి అనే కసి తో రేపటి మ్యాచ్ లో డీకొంటున్నాయి. చూడాలి రిపటి మ్యాచ్ లో ఎవరు విజేతలు అవుతారు అనేది.

Leave a Comment