Breaking News

Anasuya angry with Aunty? ఆంటీ అంటే అనసూయకు ఎందుకు కోపం? ఇలాంటి వాళ్ళే రేపిస్ట్‌లు అవుతారు.

maxresdefault Anasuya angry with Aunty? ఆంటీ అంటే అనసూయకు ఎందుకు కోపం? ఇలాంటి వాళ్ళే రేపిస్ట్‌లు అవుతారు.

ఆంటీ అంటే అనసూయకు ఎందుకు కోపం? ఇలాంటి వాళ్ళే రేపిస్ట్‌లు అవుతారు..


యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఆ తర్వాత నటిగా బిజీ అయింది. ప్రస్తుతం యాంకర్ గా గ్యాప్ తీసుకొని ఫుల్ టైం సినిమాలతో బిజీగా ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ, ఏదో ఒక దాని మీద, ఎవరో ఒకరి మీద కామెంట్స్ చేస్తూ, తనని ట్రోల్ చేసే వారికి గట్టిగా సమాధానం ఇస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. దీంతో అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.


ఇక అనసూయని ఆంటీ(Aunty) అని గతంలో బాగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ట్విట్టర్ లో ఆంటీ అనే పదం ట్రెండింగ్ అయ్యేంతలా ట్రోల్ చేశారు.

అనసూయ కూడా ఆంటీ అంటే పోలీస్ కేసు పెడతాను అంటూ హెచ్చరించింది కూడా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనని ఆంటీ అంటే ఎందుకు కోపం వస్తుందో చెప్తూ క్లారిటీ ఇచ్చింది అనసూయ.


అనసూయ మాట్లాడుతూ.. నేనేమన్నా పోస్ట్ చేస్తే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా ఆంటీ అని అంటారు. ఆంటీ అనే పదం తప్పు కాదు. కానీ దాన్ని చాలా మంది వల్గర్ గా వాడతారు.

చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆంటీ అని క్యూట్ గా పిలుస్తారు. చిన్న పిల్లలు ఆంటీ అని పిలిస్తే నాకు హ్యాపీనే. కానీ నా ఏజ్, నీ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఆంటీ అని మరో రకంగా పిలుస్తారు. అది నాకు నచ్చదు.

అసలు ఆంటీ అని ఇంగ్లీష్ లో పిన్నికి, అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి వాడతారు. నేను చిన్నప్పుడు చాలా మంది పక్కింటి వాళ్ళని ఆంటీ అనే పిలిచాను.

ఒకవేళ వాళ్ళు నన్ను అలా పిలవొద్దు అంటే నేను పిలవను. నేను అలా పిలిస్తే వాళ్ళు హర్ట్ అవుతున్నారని నేను అర్ధం చేసుకొని ఆపేస్తాను. నాకు ఏదో కారణంతో నచ్చట్లేదు, నేను అదే చెప్పాను.

అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు అనాలి. అవతలి వాళ్ళని ఎందుకు హార్ట్ చేయాలి. అలాంటి పైశాచిక ఆనందం ఎందుకు. నా మీద కామెంట్స్ వేసేవాడ్ని ఫేస్ టు ఫేస్ జన్మలో చూస్తానో కూడా లేదో తెలీదు, వాడు నన్ను చూస్తాడో లేదో తెలీదు.

అయినా నా మీద అంత హేట్ ఉందంటే అతని చుట్టు పక్కన ఉన్న ఆడవాళ్ళని ఇంకెలా చూస్తాడు. ఇలాంటి వాళ్ళే ఫ్యూచర్ లో రేపిస్ట్ లు అవుతారు అంటూ సీరియస్ అవుతూనే ఎమోషనల్ అయింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *