Fish dying on that beach: ఆ బీచ్ లో చేపలు ఎందుకు మరణిస్తున్నాయి?

Add a heading 2023 12 11T173910.190 Fish dying on that beach: ఆ బీచ్ లో చేపలు ఎందుకు మరణిస్తున్నాయి?

Fish dying on that beach: ఆ బీచ్ లో చేపలు ఎందుకు మరణిస్తున్నాయి?

ఈ ప్రకృతిలోని సంపద అంతా మానవాళికి, ఈ అనంత జీవరాశికి చెందినది. ఈ భూగోళం పైన నివసించే ప్రతి ప్రాణి కి స్వేచ్ఛగా బ్రతికేహక్కు ఉంది.

అలాంటి ఈ ప్రపంచంలో రోజురోజుకు కృత్రిమమైన మానవ కార్యకలాపాలు పర్యావరణానికి, ప్రకృతిలో నివసించే జీవరాశులకు హాని కలిగిస్తుండడం ఎంతో విచారకరం.

ఇలాంటి సంఘటనే జపాన్ లో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న సముద్ర తీరంలో చేపలన్ని కుప్పలు తెప్పలుగా మరణించాయి. అసలు ఈ మరణానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం…

జపాన్ సముద్రం తీరానికి వేలాది మృతిచెందిన చేపలు కొట్టుకువచ్చాయి. ఒక కిలోమీటరు వరకు సముద్రం ఒడ్డున ఈ చేపలే ఉన్నాయి. దీనికి స్పష్టమైన కారణం తెలియరావడం లేదు.

హక్కైడో ప్రిఫెక్చర్లోని హకోడేట్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా దీనికి కారణాలను వెతకడంలో శాస్త్రవేత్తలు నిమగ్నమై పోయారు. వివరాల ప్రకారం… కొన్నిసార్లు

పెద్ద చేపల వెంటాడటం వలన కూడా ఇలా చేపలు మరణిస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేదా, శీతల జలాల్లోకి పెద్ద సంఖ్యలో చేపలు ప్రవేశించినా ఇలాగే వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతుంటాయని తెలిపారు.

చేపల మృతికి స్పష్టమైన కారణం తెలియకపోవడం వల్ల ఇలాంటి చేపలు తినడం ప్రమాదకరమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. స్థానిక అధికారులు సముద్రం ఒడ్డుకు చేరుకుని మృతిచెందిన చేపలను సేకరిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి.

కానీ, ఇంత పెద్ద సంఖ్యలో మరణించిన చేపలను ప్రత్యక్షంగా చూడటం నాకు కూడా ఇదే తొలిసారి…భారీ చేపలు ఈ చిన్న చేపలను తరిమి కొట్టడం వలన ఇలా జరిగిందా లేకపోతే వేరే ప్రమాద కరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?? అనే సందేహాలకు సమాధానాలు తెలియరాలేదు.

ఆ పెద్ద చేపల భారీ నుండి తప్పించుకునేందుకు ఈ చిన్న చేపలు చాలాసేపు సముద్రంలో ఈదడం వల్ల ఆ చిన్ని చేపలు అలసిపోయి ఉంటాయి. ఈ క్రమంలో అన్నీ ఒకే చోటికి చేరుకోవడం వలన ఆక్సిజన్ కొరత ఏర్పడి అవి చనిపోయి ఉండవచ్చు.

ఇంకా,కుళ్లిపోయిన చేపలు జలాలలోని ఆక్సిజన్ ను మరింత తగ్గేలా చేస్తాయి. కానీ, చేపలు ఎందువల్ల చనిపోయాయో స్పష్టంగా తెలియదు కాబట్టి వాటిని తినొద్దని టకాషి ఫుజియోకా, హకోడాటె ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు తెలిపాడు.

ఇలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియా తీరం లో జరిగింది. సముద్ర తీరానికి భారీ సంఖ్యలో అరుదైన తిమింగలాలు కొట్టుకొచ్చాయి. పదుల సంఖ్యలో తిమింగలాలు ప్రాణాలు కోల్పోయాయి.

అనేక తిమింగలాలు అక్కడి ఇసుక తిన్నెల్లో చిక్కుకుపోయాయి. వాటిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నించారు. పైలట్ తిమింగలాలుగా పిలిచే ఈ అరుదైన జీవులు మూడేళ్లకోసారి మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి.

ఇంత ఆయన సంపాదన కోల్పోయాం.. కానీ, కి కూడా కారణాలు తెలియ రాలేదు. మనం ఏమైనా పటికి ఈ చేపలను తినవద్దని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు.

Leave a Comment