Why earthquakes are more in the north: భూకంపాలు ఉత్తరాదిలోనే ఎందుకు ఎక్కువ..భూకంపాలపై ఎలా అవగాహనా కల్పించాలి..భూకంపాల వల్ల ముప్పు ఉన్నట్టేనా.
భూకంపం, ఈ మాట వింటేనే మనకు వణుకు వస్తుంది, సంవత్సరంలో ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే దక్షిణాదిలో భూకంపాలు వస్తూ ఉంటాయి. అయితే అవి చాలా చిన్న చిన్న భూకంపాలు. కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఆ భూకంపం ఉంటుంది.
కానీ ఈలోపే మనకు పైప్రాణాలు పైనే పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రకంపనలు మొదలవుతాయో అప్పుడే ఇళ్ల నుండి బయటకు ప్యారుగులు పెట్టేస్తాం. అయితే ఇదే భూకంపం ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల ప్రజలను నిత్యం వణికిస్తూ ఉంటుంది.
ప్రాణలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతికేలా చేస్తుంది. ఈ భూకంప తీవ్రత ను రిక్టర్ స్కెలుపై కొలుస్తారు. అయితే ఉత్తరాదిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో రిక్టర్ స్కెలు పై భూకంప తీవ్రత ఎక్కువగానే నమోదవుతూ ఉంటోంది.
కేవలం ఒక్క 2023 సంవత్సరంలోనే ఉత్తరాదిన ఢిల్లీతో కూడా కలుపుకుని 10 సార్ల వరకు భూకంపాలు సంభవించాయి. ఇవి ప్రాణ న్సహతం ఆస్తి నష్టం కలిగించకపోయి ఉండొచ్చు.
కానీ ఎందుకు అన్ని పర్యాయాలు భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. వాటి గురించి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా. శాస్త్రవేత్తలు వీటిపై ఏమంటున్నారు వంటి విషయాలు చూద్దాం.
ఢిల్లీకి ముప్పు ఉన్నట్టేనా:
ఉత్తరాదిలో భూకంపాలు అనే మాట గురించి తెలుసుకునే ముందు అసలు భూకంపం అనే దాగి గురించి తెలుసుకుందాం.
ఈ భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణాలేంటి ? భూమి అడుగుభాగంలో ఎం ఉంటుంది ? భూమి లోపల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి ? భూమి లోపల కదలికలు ఉంటాయా ? ఉంటె ఎలాంటి కదలికలు ఉంటాయి ? ఇవన్నీ మనలో మెదిలే ప్రశ్నలు.
భూకంపం అంటే భూమికి పై భాగంలో వచ్చే కదలిక, దాని వల్ల భూమి మీద నిమించబడిన అన్ని కట్టడాల్లో కదలిక వస్తుంది.
కేవలం నిర్మాణాల్లోనే కాదు కొన్ని వృక్షాలు కూడా కదలికలకు గురవుతాయి. భూమి పై భాగంలో ఉండే వస్తువుల కదలిక అనేది భూమి లోపల ఉండే శక్తి కారణంగా సంభవిస్తుంది.
భూమి లోపల భాగాల్లో మొదలైన బలమైన శక్తి భూమి లోని అన్ని భాగాలను కదిలిస్తుంది. ఈ శక్తి కేవలం భూమి లోపల ఉండే భాగాలను కదిలించడమే కాకుండా భూమి పై భాగంలో కొన్ని తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. అలా ఏర్పడిన తరంగాలు భూమి ఉపరితలంపై ప్రయాణించడమే కాకుండా భూకంపం రావడానికి కూడా కారణమవుతాయి అని తెలుస్తోంది.
How is an earthquake measured:
భూకంపం సంభవించిన ప్రతిసారి టివి చానెళ్లలో, వార్తా పత్రికల్లో ఒక విషయం వింటూ ఉంటాం. పలానా ప్రాంతంలో భూకంపం సంభవించింది, రిక్టర్ స్కేలు పై దాని తీవ్రత అంత వచ్చింది, ఇంత వచ్చింది అని చూస్తూ ఉంటాం. అసలు ఈ రిక్టర్ స్కేల్ అంటే ఏంటి.
దీనిని ఎలా ఉపయోగిస్తారు. అనేది చూద్దాం. అనేకానేక కారణాల వల్ల సంభవించిన భూకంపాలను సదరు రిక్టర్ స్కేల్ పై కొలుస్తారు. అయితే ఈ రిక్టర్ స్కేల్ అనేదానిపై తీవ్రత కి సంబంధించిన కొలతలు ఉంటాయి. అవి సున్నా నుండి తొమ్మిది వరకు ఉంటాయి.
సున్నా అంటే అతి తక్కువ అని అర్ధం. ఇక తొమ్మిది అంటే భీభత్సకరమైన స్థాయిలో వచ్చినట్టు భావించవచ్చు. అయితే ఈ రిక్టర్ స్కెలు పై ప్రతి ముద్ర 10 రేట్లు ఎక్కువ శక్తిని సూచిస్తుంది.
What is Richter Scale:
అయితే ఈ భూకంపానికి సంబంధించి తీవ్రత ను కొలిచేదానిని రిక్టర్ స్కేలు అంటరాని మనం తెలుసుకున్నాం, దానికి కొన్ని కొలతలు ఉంటాయని, రిక్టర్ స్కేల్ మీద తీవ్రత పెరిగే కొద్దీ భూకంప తీవ్రత కూడా పెరిగినట్టే అని మనం అర్ధం చేసుకున్నాం.
అయితే ఈ రిక్టర్ స్కెలు అనేది ఎక్కడ ఉంటుంది, దానిని పరీక్షించేది ఎవరు. ఎలా ఆపరేట్ చేస్తారు అనే అనుమానాలు కూడా రావచ్చు మనలో చాల మందికి. ఈ రిక్టర్ స్కెల్ అనేది సీస్మాలజీ సెంటర్ లో ఉంటుంది.
అక్కడే దీని పై కొలతలను భూకంపాల తీవ్రతను కొలుస్తారు. అయితే అసలు సీస్మాలజీ అంటే ఏమిటి, సీస్మాలజీ సెంటర్ లో ఎం జరుగుతుంది అనేది చూద్దాం. ఈ సీస్మాలజీ కేంద్రాలలో భూకంప తీవ్రతను కొలుస్తారు.
అంతే కాకుండా భూమి ఉపరితల భాగం పై వచ్చిన భూకంపాలను అద్యయనం చేస్తుంది. ఇలా భూకంపాలను అధ్యయనం చేయడం వల్ల ప్రజలను భూకంపాల బారి నుండి రక్షించేందుకు వీలవుతుంది.
ఈ సీస్మాలజీ సెంటర్ ఎం చేస్తుంది అంటే ఇది భూకంపాల ప్రధాన కేంద్రాన్ని గుర్తిస్తుంది. అలాగే ఆ భూకంపం ఎంత తీవ్రత తో సంభవించింది అనేది కూడా ఏ సుస్మాలజీ కేంద్రమే వెల్లడి చేస్తుంది.
How a Seismology Center Works:
అంతే కాక భూకంపం ఏ దిశా నుండి మొదలై ఎక్కడి వరకు సంభవించింది అనే వాటిని కూడా చెబుతుంది సీస్మాలజీ సెంటర్. అదే విధంగా ఒక దారి భూకంపం వచ్చినట్లయితే అది అక్కడితో ఆగుతుందా లేదా ?
మరోసారి అదే స్థానంలో కానీ భూకంప కేంద్రానికి సమీపంలోని వేరేదైనా ప్రాంతంలో సంభవిస్తుందా అనే దానిపై వివరాలు తెలియజేస్తుంది. ఇటువంటి సమాచారాన్ని అందజేయడం వల్ల ప్రజలను ప్రక్రుతి విపత్తు అయిన భూకంపం నుండి రక్షించడానికి తోడ్పడుతుంది.
తద్వారా భూకంపాల నుండి ప్రజలకు ఈ సీస్మాలజీ సెంటర్లు రక్షణ కల్పిస్తాయి. అంతే కాకుండా ఈ సీస్మాలజీ సెంటర్లలో ఎప్పటికప్పుడు భూకంప రక్షణ పద్దతులను అబ్భివృద్ధి చేస్తాయి. ఇక ఈ సీస్మాలజీ కేంద్రాలను ఐ.ఎన్.ఎస్.డి.సి నేతృత్వంలో పనిచేస్తాయి.
ఐ.ఎన్.ఎస్.డి.సి పూర్తి అర్ధం ఇంటర్నేషనల్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ డేటా బేస్ కొలాబరేషన్. ఈ ఐ.ఎన్.ఎస్.డి.సి అనేది భారతదేశ వ్యాప్తంగా మొత్తం 100 సీస్మాలజీ సెంటర్లను నిర్వహిస్తోంది.
దీని ముఖ్య పాత్ర ఏమిటంటే ఇది భారతదేశంలో సంభవించే అన్ని భూకంపాలను గుర్తించడమే కాకుండా, వాటి తీవ్రతను అలాగే వాటి దిశను కూడా గుర్తిస్తాయి.
అంతేకాకుండా భూకంపాలు సంభవించినప్పుడు వాటి నుండి బయటపడేందుకు తీసుకోవలసిన రక్షణ చర్యలను కూడా రూపొందిస్తు ఉంటుంది, అలాగే పూర్వం రూపోంచిన పద్దతులను అభివృద్ధి కూడా చేస్తూ ఉంటాయి.
Earthquake damage:
ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ప్రక్రుతి విపత్తుల్లో భూకంపం కూడా ఒకటి, ఈ భూకంపం తీవ్రత ఎక్కువగా నమోదైన కొద్దీ ప్రాణ ఆస్తి నష్టాలు కూడా పెరుగుతూ ఉంటాయి.
ఇప్పటివరకు చూసుకుంటే భారతదేశంలో భూకంపం వల్ల అనేక వంతెనలు, కట్టడాలు, పెద్ద పెద్ద భవంతులు కూలిపోయిన సంఘటనలు చూసాం.
కొన్ని దేశాల్లో అయితే పెద్ద పెద్ద ఆనకట్టలు కూలిపోయాయని తెలుస్తోంది. ఇక రహదారులు బీటలు వారడం సర్వసాధారణం. ఈ భూకంపాలు దేశంలోని మౌలిక సదుపాయాలకు కూడా ఆటంకం కలిగిస్తూ ఉంటాయి.
ఇక ప్రాణనష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పేద భవంతులు బోకంపాల వల్ల కూలిపోవడంతో వాటి శిధిలాల క్రింద పది అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
అలాగే అనేక మంది తీవ్ర గాయాలపాలైన వారు కూడా ఉన్నారు. ఇక తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఎటువంటి భవనాలు నిర్మించుకోవాలి, వాటిని ఎలా నిర్మించుకోవాలి అనే వాటిపై కూడా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు.
Is earthquake related to tsunami:
కొన్ని కొన్ని సందర్భాల్లో భూకంపం అనేది సునామి కి కూడా దారి తీస్తూ ఉంటుంది. భూమి ఉపరితలం మీద సంభవించే భూకంపాల వల్ల సముద్రం లో సునామి సంభవించే ప్రమాదాలు కూడా ఉంటాయి.
అయితే భూకంపం వల్ల సునామి రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం, భూకంపం అనేది భూమి ఉపరితలం మీదనే కాదు సముద్ర భూభాగంలో కూడా వస్తూ ఉంటుంది, భూకంప కేంద్రం అనేది భూమి కి అడుగు భాగంలోనే ఉంటె సునామి వచ్చే అవకాశం తక్కువగానే ఉండొచ్చు కానీ.
ఒకవేళ భూకంపం అనేది సముద్ర భోభాగంలో అంటే సముద్రం అడుగున గనుక వస్తే అది సునామీకి దారి తీసే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.
సముద్రం లో వచ్చే భూకంపం కూడా భూమి మీద వచ్చే భూకంపం మాదిరిగానే ఉంటుంది. నీటి అడుగున ఉన్న భూమిలోపల బలమైన కదలికలు రావడం వల్ల సముద్ర భూభాగం ఊగుతుంది, తద్వారా సముద్రపు నీరు కూడా బలంగా
ఊగడంతో తీరా ప్రాంతం వరకు సముద్రపు కెరటాలు పెద్ద ఎత్తున కదలికలకు గురై తీరాన్ని ముంచెత్తుతాయి. దానినే సునామి అంటారు.
How do tsunamis occur in the ocean:
ఈ సముద్రంలో వచ్చే భూకంపాలు రెండు రకాలు, ఒకటి తలవంపు భూకంపం కాగా రెండవది సరిహద్దు భూకంపం. తలవంపు భూకంపం ఎలా సంభవిస్తుంది అంటే మనం ఉంటున్న భూమి అంతర్భాగం లో మాదిరిగానే సముద్ర అంతర్భాగం లో కూడా భూమి కింద ఫలకాలు ఉంటాయి.
ఆ ఫలకాలు గనుక ఒక దాని మీదకి ఒకటి వెళ్లినా, లేదంటే ఒకదానికి కిందకి మరొకటి చొచ్చుకువెళ్లినా భూకంపం సంభవిస్తుంది. మరో రకమైన సరిహద్దు భూకంపం, ఈ రకమైన భూకంపం ఎలా వస్తుంది అంటే సముద్రం అడుగు భాగంలో భూమి ఒక్కసారిగా విడిపోతుంది, అలా విడిపోవడం వల్ల పెద్ద అగాధం ఏర్పడుతుంది, భూమి ఫలకాలు విడిపోవాదం వల్ల ఏర్పడిన అగాధంలోకి నీరు క్షణాల్లో చేరుకుంటుంది.
అయితే అలా విడిపోయిన ఫలకాలు మరలా యధా స్థానానికి చేరుకుంటాయి. దాని వల్ల ముందుగా అందులోకి చేరుకున్న నీరు వెళ్లిన దానికన్నా రెట్టింపు వేగంతో బయటకు నెట్టబడుతుంది.
ఇది సరిహద్దు ప్రాంతాలకు దగ్గరలో గనుక సంభవిస్తే ఆ నీరు తీర ప్రాంతాన్ని అత్యంత వేగంగా తాకుతుంది. ఒక్కోసారి ఆ నీటి వేగం గంటకు 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది.
సముద్రం అడుగు భాగంలో సంభవించే ఈ భూకంపం సునామి రూపంలో తీరాన్ని తాకుతున్నప్పుడు సముద్ర అలల వేగం అమాంతం పెరిగిపోతుంది.
ఆ అలలు తీరాన్ని తాకడంతో తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందుకు ఉదాహరణగా 2004 లో సంభవించిన సునామీని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామి వల్ల 230,000 మంది మరణించగా అనేకమంది నిరాశ్రయులయ్యారు.
Why earthquakes in Delhi:
ఉత్తర భారతదేశం నుంచి ఈశాన్య భారతదేశం మధ్య హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. మన భారతదేశం ఇంకా పొరుగున ఉన్న నేపాల్ దేశానికి మధ్య ఈ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. ఈ హిమాలయాల క్రిందనే రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల ఉన్నట్టు తెలుస్తోంది.
పైగా ఈ హిమాలయాలు ఆ టెక్టోనిక్ పెట్లకు సరిహద్దుల్లో ఉండటం మరో విశేషం కూడా. అందుకే ఆ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
ఈ భూకంప కేంద్రానికి భారత్ తో పాటు నేపాల్ కూడా దగ్గర లోనే ఉంది కాబట్టి నేపాల్ లో కూడా భూమి కంపించడం పారిపాటిగా మారిపోయింది.
ఇకనేపాల్ ల్లో సంభవించే భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లి లో కూడా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తాయి. అయితే ఈ టెక్టోనిక్ ప్లేట్లు క్రస్ట్ అనే లేయర్ లో ఉంటాయి.
ఉత్తర భారతదేశం నుంచి ఈశాన్య భారతదేశం మధ్య హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. మన భారతదేశం ఇంకా పొరుగున ఉన్న నేపాల్ దేశానికి మధ్య ఈ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి.
ఈ హిమాలయాల క్రిందనే రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఈ హిమాలయాలు ఆ టెక్టోనిక్ పెట్లకు సరిహద్దుల్లో ఉండటం మరో విశేషం కూడా. అందుకే ఆ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
ఈ భూకంప కేంద్రానికి భారత్ తో పాటు నేపాల్ కూడా దగ్గర లోనే ఉంది కాబట్టి నేపాల్ లో కూడా భూమి కంపించడం పారిపాటిగా మారిపోయింది. ఇకనేపాల్ ల్లో సంభవించే భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లి లో కూడా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవలి కాలంలో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తాయి. అయితే ఈ టెక్టోనిక్ ప్లేట్లు క్రస్ట్ అనే లేయర్ లో ఉంటాయి.