ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో భగవత్ గీత ఎందుకు వివాదం అయ్యింది

WhatsApp Image 2024 03 12 at 10.52.34 AM ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో భగవత్ గీత ఎందుకు వివాదం అయ్యింది

ప్రప్రంచ వ్యాప్తం గా ప్రతిష్టాత్మకంగా పేరుగాంచిన ఆస్కార్ అవార్డ్ వేడుకలో ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటిందనే చెప్పాలి. ఈ చిత్రం ఏకంగా 13 నామినేషన్ల లలో నిలబడడం ఒక విశేషం.అంతే కాదు ఈ మూవీ కి రాని అన్ని అంటే ఒకేసారి 7 ఆస్కార్‌లను గెలుచుకుంది. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఎన్నో కాంట్రవర్సీల కు కారణం అయ్యింది.

దీనికి కారణం ఈ మూవీ లో భగవద్గీతకు సంబందించిన ఒక సన్నివేశం ఉంది అదే ఈ కాంట్రోవర్సి కి కారణం అయ్యింది. దీని పై భారతీయ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తిని తెలిపారు. ఇందులో ఉన్న ఒక ఇంటిమేట్ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం చూడడానికి ఎబ్బెట్టు గా ఉంది. అలాంటి సమయం లో నటుడి చేతిలో భగవద్గీత పుస్తకం ఉంటుంది. ఆ సమయం లో అతని చేతిలో హిందువులు ఎంతో పవిత్రం గా బావించే ఆ గ్రంధం ఉండడం ఏంటి అని నెటిజన్లు మండిపడ్డారు. ఈ సన్నివేశం కు సంబందించి తమ అసంతృప్తిని అసహనాన్ని అక్కడి భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఆ సినిమా డైరెక్టర్లకు తమ నిరసన తెలుపుతూ ఘాటుగా లేఖ రాశారు.

ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్‌ను అణుబాంబు పితామహుడిగా భావిస్తారు అందరు. అంతే కాదు భారత దేశానికీ సంస్కృత భాష అతను నేర్చుకున్నాడు. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంధ మైన భగవద్గీత ద్వారా తాను ఎంత గానో ప్రభావితమయ్యాయని చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “జూలై 16, 1945 న అమెరికా జపాన్ మీద ఉపయోగించిన అణ్వాయుధం మొదటి పేలుడు సంభవించిన తర్వాత అది చూసిన నాకు ఒక ఆలోచన వచ్చిందని ఆ ఆలోచన భారత దేశానికి చెందిన ఒక ప్రాచీన హిందూ గ్రంధం అయిన భగవద్గీతలోని శ్లోకం అని చెప్పాడు.

మూవీ లో నటీనటుల మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నప్పుడు ఆ సమయంలో భగవద్గీతను చూపించాల్సిన అవసరం లేదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సన్నివేశం వల్ల సనాతన ధర్మాన్ని పాటించే హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని కొందరు విమర్శిస్తుంటే, మరికొంతమంది అయితే భగవద్గీతలోని ఒక సన్నివేశం ఉంది అనే మాట వాస్తవమే కానీ అది ఏ మతాన్ని కాని లేదా మత గ్రంథాన్నికాని అవమానించడం కోసం ఇలాంటివి పెట్టలేదు అనిపిస్తుంది.

మొత్తం మూవీ చూసినట్లయితే కారణం ఏంటి అనేది అందరికి కచ్చితంగా అర్థమవుతుంది’ అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సిన్నివేసాలు చిత్రీకరించే సమయం లో మత గ్రంధాలను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అనేది సినిమా టైటిల్ వేసే సమయం లో సినిమా చూసే ప్రక్షకులకు మెస్సేజ్ ద్వార తెలియ చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.

Leave a Comment