Madras High Court is serious about Mansoor: నువ్వు కేసు పెట్టడమేంటి?..మన్సూర్‏పై మద్రాస్ హైకోర్టు సీరియస్.

Why did you file a case? Madras High Court is serious about Mansoor

Madras High Court is serious about Mansoor: నువ్వు కేసు పెట్టడమేంటి?..మన్సూర్‏పై మద్రాస్ హైకోర్టు సీరియస్.

తమిళ నటి త్రిష, సీనియర్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్‎ల మధ్య జరుగుతున్న వివాదం మద్రాసు కోర్టు మెట్లు ఎక్కింది. మన్సూర్ త్రిష, చిరంజీవి, కుష్బూలపై పరువు నష్టం దావా వేస్తానని ఈ మధ్యనే ప్రకటించాడు. ఆ మాట ప్రకారమే మద్రాసు హైకర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మొత్తానికి ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. గత కొంత కాలంగా త్రిష, మన్సూర్ మధ్య జరుగుతున్న వాగ్వాదం కాస్త కోర్టులో కొత్త మలుపు తిరిగింది. పరువునష్టం దావా వేసిన మన్సూర్ తనకు నష్టపరిహారం ఇప్పించాలంటూ కోరడంతో మద్రాసు హైకోర్టు ఆయనపై సీరియస్ అయ్యిందని తెలుస్తోంది.

కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో మద్రాస్ హైకోర్టు మన్సూర్ తిక్క కుదిర్చిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే మన్సూర్ అలీ ఖాన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఈ మధ్యనే ఈయన విజయ్ నటించిన లియో మూవీలో కనిపించారు.

ఇదే సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓక ఇంటర్వ్యూ లో మన్సూర్ మాట్లాడుతూ త్రిషను ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద వివాదంగా మారింది. ఈ సినిమాల త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను కానీ లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యానని చెప్పారు.

ఈ విషయంపై త్రిష సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. సీనియర్ నటి కుష్బూ కూడా త్రిషకి అవమానం జరిగిందంటూ మన్సూర్ పై మండిపడింది.

Add a heading 2023 12 12T112233.299 Madras High Court is serious about Mansoor: నువ్వు కేసు పెట్టడమేంటి?..మన్సూర్‏పై మద్రాస్ హైకోర్టు సీరియస్.

అంతే కాదు మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసింది. మన్సూర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. త్రిషకు మెగాస్టార్ చిరంజీవి కూడా సపోర్టివ్ గా నిలిచారు.

మన్సూర్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. త్రిషకు మన్సూన్ క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున త్రిష అభిమానులు డిమాండ్ చేశారు.

అయినా మొదట మన్సూర్ ఈ విషయంలో తన తప్పేమి లేదని చెప్పుకుంటూ వచ్చారు. క్షమాపణలు చెప్పనని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత విషయం కాస్త సీరియస్ అవుతుందని గుర్తించి ఎట్టకేలకు దిగొచ్చి త్రిషకు క్షమాపణలు చెప్పాడు.

అక్కడితో వివాదం ముగిసిందనుకుంటూ మన్సూర్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. త్రిషకు సపోర్టివ్ గా నిలిచిన ఖుష్బూ, చిరంజీవిలతో సహా త్రిషపైన మ‌న్సూర్ పరువునష్టం దవా వేశారు. ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచార‌ణ‌కు రాగా న్యాయ‌మూర్తి మ‌న్సూర్‌పై ఫైర్ అయ్యారు.

నువ్వే అభ్యంతరకరంగా మాట్లాడి , నువ్వే ఆతర్వాత క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ఇప్పుడు నువ్వే రివ‌ర్స్ గా వారిపై కేసు పెడ‌తావా అంటూ న్యాయ‌మూర్తి మండిపడ్డారు.

అంతేకాదు ఎలాపడితే అలా ఇష్టానుసారంగా ప్రవర్తించడం సరికాదని, తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని కోర్టు మొట్టికాయలు వేసిందట.

ఈ వివాదంలో పెడితే త్రిష కేసు పెట్టాలి కానీ రివర్స్ గా నువ్వు కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఓ ద‌శ‌లో మన్సూర్ త‌రుపున వాదించిన లాయ‌ర్‌ను కూడా కోర్టు మందలించిందట.

ఇదిలా ఉండ‌గా న్యాయమూర్తి ఓ వైపు మ‌న్సూర్‌పై సీరియ‌స్ అయిన‌ప్ప‌టికీ అతని తరఫు న్యాయవాది త‌న వాద‌న‌లు వినిపించారు. ఈ విషయంలో మన్సూర్ నిర్దోషి అని చెప్పుకొచ్చారు.

తన ఇంటర్వ్యూ వీడియోను పూర్తిగా వినకుండా మ‌న్సూర్‌పై కామెంట్స్ చేస్తూ చేసిన పోస్టుల‌ను వెంటనే తొల‌గించేలా వారికి ఆదేశాలు జారీ చేయాలన్నారు.

అయితే త్రిష,చిరంజీవి,ఖుష్బూల విష‌యంలో త‌మ స్టేట్‌మెంట్స్ ఇవ్వాల‌ి తెలుపుతూ న్యాయమూర్తి ఈ కేసును డిసెంబ‌ర్ 22కు వాయిదా వేశారు.

Leave a Comment