Jawaan is the achievement of the movie: నయన్ ఎందుకు అలా అంటోంది..జవాన్ సినిమా సాధించిన ఘనత ఏంటంటే.

Why does Nayan say that..Jawan is the achievement of the movie.

Jawaan is the achievement of the movie: నయన్ ఎందుకు అలా అంటోంది..జవాన్ సినిమా సాధించిన ఘనత ఏంటంటే..

మలయాళ ముద్దు గుమ్మ నయనతార 2003 లో మలయాళ ఇండస్ట్రీ నుండి తెరంగేట్రం చేసినప్పుడు బొద్దుగుమ్మ, కానీ రాను రాను అటు నటనతోపాటు తన ఫిగర్ ను కూడా చిత్రిక పట్టుకుంది.

చంద్రముఖి సినిమాతో స్టార్ డం ను సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడి పై తెలుగు వారి కన్ను కూడా పడింది. లక్షి సినిమాతో తెలుగు తెరపై మెరిసిన నయన్, తెలుగు లో స్టార్ హీరోల అందరి సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. 75 సినిమాలు పూర్తిచేసుకుని లేడి సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది.

నయన్ ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరో పక్క నాయికా ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా నటిస్తోంది. అంతేనా ఒక పక్క షారుక్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే, మరో పక్క జై, జయం రవి వంటి తన ఏజ్ గ్రూప్ హీరోల తో కూడా నటిస్తోంది.

ఇలాంటివి ఒకప్పుడు శ్రీదేవి, మాధురి దీక్షిత్, సౌందర్య, విజయశాంతి వంటి వారికే సాధ్యమైంది. అప్పట్లో వారిని లేడి సూపర్ స్టార్ అనే పిలిచేవారు. అలా ఇప్పుడు నాయన తారను కూడా లేడి సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు.

నయనతార ఈ విషయం మీద స్పందించింది, తనను లేడి సూపర్ స్టార్ అని పిలవడం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. తనను ఎవరైనా లేడి సూపర్ స్టార్ అని పిలిస్తే సంతోషంగానే అనిపించినా అది తనను తిట్టినట్టుగా అనిపిస్తుంది అంటోంది.

ఈ పిలుపు జవాన్ సినిమా తరువాత మరింత ఎక్కువైందని అంటోంది. అలా పిలిపించుకోవడం ఇష్టం లేకపోయినా, పిలిచినందు వల్ల అసౌకర్యం మాత్రం లేదని అంటోంది.

తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం ప్రేక్షకులేనని, తాను ఇంతటి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నానంటే అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీనే కారణం అని చెబుతోంది నయనతార. ఇక ఈ అమ్మడు జవాన్ సినిమాతో ఉత్తరాది వారిని కూడా పలుకరిచేసింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక జవాన్ సినిమా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, షారుక్ నటించిన ఈ సినిమా వసూళ్ల పరంగా సునామి సృష్టించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

పఠాన్ వంటి హిట్టు తరవాత అంతకుమించిన విజయాన్నీ షారుక్ సొంత చేసి అతని రేంజ్ ఏంటో చూపెట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరో ఘనత కూడా అందుకుంది. ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అవార్డులకు జవాన్ సినిమా ఎంపికైంది.

భారతదేశం నుండి ఈ ఏడాది జవాన్ సినిమా ఒక్కటే ఎంపికవడం విశేషం. గతంలో ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ పేరుతో ఉన్న ఈ అవార్డస్ ను ఇప్పుడు ‘అస్త్ర’ అవార్డులుగా పిలుస్తున్నారు. ఇక అస్త్ర అవార్డు గెలుచుకోవాలంటే జవాన్ సుమారు పది సినిమాలతో పోటీ పడాలి.

గతంలో హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డులకు ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎంపికైంది. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఐదు విభాగాల్లో అవార్డులను కైవశం చేసుకుంది.

జవాన్ సినిమా ‘అస్త్ర’ అవార్డులకు ఎంపిక అయిన విషయం తెలిసి షారుక్ ఫాన్స్ సంబరపడుతున్నారు, జవాన్ మోవీ అస్త్ర అవార్డులు సొంతం చేసుకోవాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Leave a Comment