వాహన దారులకు అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయక పోవడానికి ఇదే కారణం : Why FASTags will not work from April.

website 6tvnews template 41 వాహన దారులకు అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయక పోవడానికి ఇదే కారణం : Why FASTags will not work from April.


Why FASTags will not work from April: ఇప్పుడు మన దేశంలో ఉన్న ఫాస్టాగ్​ వ్యవస్థ స్థానంలో జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని తీసుకురావాలని కేంద్రం ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ.

అంతే కాదు ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ఫాస్టాగ్స్​ పని చేయవు అన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి! ఇంకొన్ని నెలల్లో దేశంలో 2024 లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చే లోపు దేశవ్యాప్తంగా జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని అమలు చేయాలని అనుకుంటున్నట్లు నితిన్​ గడ్కరీ తెలిపారు. అంటే.

ఈ కొత్త వ్యవస్థ ఏప్రిల్​ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రం ఇప్పటికే ఓ కన్సల్టెంట్​ని కూడా నియమించినట్టు చెప్పారు

ఫాస్టాగ్​ వ్యవస్థ 2021లో ప్రతి వాహనానికి ఉండాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఫాస్టాగ్​ లేని వాహనదారులు డబుల్​ టోల్​ కట్టాలని చెప్పుకొచ్చింది. అయితే జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని అమలు చేసి, ఫాస్టాగ్​ వ్యవస్థని దశల వారీగా తొలగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. దీనికి కారణం కొత్త వ్యవస్థలో.

ఆటోమెటిక్​ నెంబర్​ ప్లేట్​ రికగ్నీషన్​ సిస్టెమ్​ ఉంటుంది. అంతే కాకుండా వేలపై కెమెరాలు అమర్చి ఉంటాయి. వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్​ కట్​ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్​లు.. ఆర్​ఎఫ్​ఐడీ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని ఫాలో అవుతున్నాయి. ఇది శాటిలైట్​తో ముడిపడిన విషయం అని అందుకని మార్చ్​ నాటకి అమలు చేయాలని చూస్తున్నాము,” అని నితన్​ గడ్కరీ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఇది ఏప్రిల్​లో అమలవుతుందని వార్తలు వస్తున్నాయి.

GPS toll collection system process :

GPS Imaging Toll India StartupTalky వాహన దారులకు అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయక పోవడానికి ఇదే కారణం : Why FASTags will not work from April.

వాహనదారుల వెహికిల్​ నెంబర్​ ప్లేట్​ని రహదారులపై ఉన్న కెమెరాలు స్కాన్​ చేస్తాయి. ఆ తర్వాత వారి అకౌంట్ నుండి టోల్​ ఛార్జీలు కట్​ అవుతాయి. వాహనదారుల నెంబర్​ ప్లేట్స్​ అనేవి టోల్​ ఛార్జీలు వసూలు చేసే అకౌంట్స్​కి లింక్​ అయ్యి ఉంటాయి. ఇందులో ఉండే ఆటోమెటిక్​ నెంబర్​ ప్లేట్​ రికగ్నీషన్​ సిస్టెమ్​ చాలా కీలకంగ పనిచేస్తుంది.

Leave a Comment