టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత నడుస్తుంది. ఇటీవల ఫైనాన్షియల్ దిగ్గజం పేపాల్ కూడా అదే తోవలో నడుస్తుంది.
తాజాగా పేపాల్ నుంచి వెలువడిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉద్యోగుల తొలగింపు :
పేపాల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో దాదాపు 9 శాతం మందిని తొలగిస్తున్నటుగా పేర్కొంది.
ఈ నేపథ్యంలో దాదాపు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సిబ్బందికి సీఈవో అలెక్స్ క్రిస్ ఒక లేఖ రాశారు.
దానిలో ఈ విషయాన్ని గురించి స్పష్టంగా వివరించారు.
కారణాలు :
- కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం
- వనరులను సమర్థంగా వినియోగించడం
- ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించడం.
అమలు :
ఈ ప్రకటనలో వెలువరిచిన దానిని 2024 లోనే అమలు చేయనున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. అయితే తొలగిస్తున్న ఉద్యోగులకు వారాంతంలో సమాచారాన్ని ఇస్తామని తెలిపారు.
కృత్రిమ మేధ:
ఏఐ వినియోగంతో సమాచారం వేగంగా ప్రాసెస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచుతామని పేపాల్ ప్రకటించింది.