Cryptocurrency: ఈ డిజిటల్ క్రిప్టోకరెన్సీ కి ఇంత డిమాండ్ ఎందుకు..?
ఈ డిజిటల్ యుగంలో మనిషి జీవితంలో ఎంతో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజు రోజుకి శాస్త్రీయ పరమైన అంశాలకు ఆధరణ పెరిగిపోతుంది.
మనిషి మెదడు కూడా హార్డ్ వర్క్ చేయడానికి ఇష్ట పడడం లేదు.. స్మార్ట్ వర్క్ కు అలవాటు పడిపోతుంది.. అందుకే, ఎన్నో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలం లో మనం డిజిటల్ చెల్లింపులకు బాగా అలవాటు పడిపోయాము..
ఆన్లైన్ లో చెల్లింపులు చేయడం వలన కాలాన్ని కూడా ఆదాచేసుకుంటున్నాము..ఇటీవల కాలంలో ఒక నయ ట్రెండ్ ప్రపంచం వ్యాప్తంగా నడుస్తుంది…
ప్రముఖ క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ విలువ మరోసారి 40 వేల డాలర్ల మార్క్‌ను దాటింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు ఇకపై ఉండకపోవచ్చుననే సంకేతాలు వెలువడుతున్న విషయం ఇప్పటికే సోషల్ మీడియా వేదిక గా హల్ చెల్ అవుతుంది. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టింది.
ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోత వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అంశాలే బిట్‌కాయిన్ ముందుకు దూసుకుపోవడానికి దోహదం చేస్తోంది.
భారత కాలమానం ప్రకారం.. 24 గంటల వ్యవధిలో ఈ బిట్‌కాయిన్ విలువ నాలుగు శాతం పెరిగి, 40,950 డాలర్ల వద్ద మంచి ట్రేడవుతోంది. గత ఏడు రోజుల్లో ఈ బిట్ కాయిన్ దాదాపు 10 శాతం పెరగడం డిజిటల్ మార్కెట్ అంచనాలను సైతం తారుమారు చేస్తోంది.
మరో కీలక కాయిన్ అయిన ‘ఇథేరియం’ గత 24 గంటల్లో 3.3 శాతం, 7 రోజుల్లో 8.5 శాతం పుంజుకుంది. 2023లో ఇప్పటి వరకు బిట్‌కాయిన్ 146 శాతం పెరిగింది.
చివరిసారిగా 2022లో 40 వేల డాలర్ల మార్క్ వద్ద ట్రేడైంది. ఆ సమయంలో’ టెర్రాయూఎస్‌డీ’ స్టేబుల్ కాయిన్ పతనంతో క్రిప్టో మార్కెట్‌లో రెండు లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయిన విషయం తెలిసిందే.
మరోవైపు బ్లాక్‌రాక్ కంపెనీ తొలి అమెరికా స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ను ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకుంది. దీనికి జనవరిలో అనుమతి లభించే అవకాశం ఉందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి.
ఈ అంశం కూడా క్రిప్టో కరెన్సీ పుంజుకోవడానికి దోహదం చేస్తోంది ఇది ఇలా ఉండగా క్రిప్టోఎక్స్ఛేంజ్ ఎఫ్.టీ.ఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్‌మన్ ను దోషిగా కూడా నిర్ధారించడం కూడా జరిగింది.
మరోవైపు బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ ఝావో అనేక ఆరోపణలతో క్రిప్టో మార్కెట్ నుంచి తప్పుకున్నారు. ఈ రెండు పరిణామాలు.. 2022 లో సంభవించాయి.
ఈ పరిమాణాల నుంచి కోలుకోవడానికి క్రిప్టో కరెన్సీ కంపెనీ లకు ఎన్నో అవాంతరాలు వచ్చాయి. లేకపోతే ఇప్పటికేబిట్‌కాయిన్ 50 వేల డాలర్ల మార్క్‌ను అందుకుని ఉండేదని నిపుణుల అంచనాలు చెపుతున్నాయి..