Suicide: భార్త బిర్యానీ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య.
వడ్రంగి రాసూల్ కి అర్షియా బేగం రెండవ భార్య. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో వీళ్ళు నివాసం ఉంటున్నారు.
ఈ నెల 11వ తారీఖున భార్యాభర్తలిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
రసూల్ ని బిర్యానీ కొనమని అడగడంతో ఈ గొడవ మొదలైంది. ఇక ఆ గొడవ తారా స్థాయికి వెళ్ళడం తో మనస్థాపానికి చెందిన అర్షియా బేగం ఊరి తాడు బిగించింది. అతను నిర్మొహమాటంగా మొదటి భార్య దగ్గరకి వెళ్తానని చెప్పడంతో ఆమె ఊరి వేసుకుంది.
మొదట్లో ఇధి అనుమానాస్పద మృతిగా నమోదు అయ్యింది. అర్షియా బేగం చనిపోవడానికి కారణాలు వెతికినప్పుడు, రసూల్ ఫోన్ లో ఒక ఆందోళనకరమైన వీడియో లభ్యమైంది. ఆ వీడియో లో రసూల్ అర్షియా బేగంని చనిపోవడానికి ప్రేరేపించే సంఘటనలు ఉన్నాయు.
అర్షియా బేగం ఊరి బిగించడం, రసూల్ మొదటి భార్గ దగ్గరకే వెళ్తాను అని చెప్పడం, ఆమె మనస్తాపంతో ఊరి బిగించుకోవడం ఇవన్నీ నిందితుడు రికార్డు చేస్తూనే ఉన్నాడు. ఆసిఫ్ నగర్ పోలీసులు ముందుగా నిందితుడిని అదుపులోకి తీసుకొని,
ఈ ఆధారాలన్నీ లభ్యం చేసుకున్న తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేసి, జుడీషియల్ కస్టడీ కి తరలించారు.
=ఈ ఘటన అనంతరం , అర్షియా బేగంను నాంపల్లి ఏరియా ఆసుపత్రికి, తరువాతి రోజు ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె చనిపోయినట్టు నిర్ధారణ జరిగినది.