టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత రెండవ పురస్కారమైన పద్మ విభూషణ్(Padma Vibhushan) ను ప్రకటించింది. ఈ వార్త విన్న చిరు ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి, తమ అభిమాన హీరో, తమ అన్నయ్య కి ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. అయితే గడిచిన రెండు మూడు రోజుల నుండి చిరంజీవి గురించి మరో వార్త సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
అదేమిటంటే మెగాస్టార్ చిరుకి కేంద్రంలో ఉన్న బీజేపీ(BJP) ఉత్తర్ ప్రేదేశ్(UttarPradesh) నుండి ఎంపీగా(MP) రాష్ట్రపతి కోటా లో నామినేట్ చేసి ఆయనను రాజ్యసభకు(Rajyasabha) పంపనుంది అని టాక్ వినిపిస్తోంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ ఉంది అధిక సంఖ్యలో 10 రోజా సభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఈ ఏడాది. ఇదివరకే బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్(Dr Lakshman) ను ఉత్తర్ ప్రదేశ్ నుండే రాజ్య సభకు పంపింది బీజేపీ.
చిరు అంగీకరిస్తారా : Will Chiru Accept This
అయితే చిరు మరోసారి సెంట్రల్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టడం ఎంపీ పదవి ని తన పేరు ముందు రాసుకోవడం అనేది ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అంశమే, కానీ చిరు దానికి అంగీకరిస్తారా లేదా అన్నది పెద్ద సంశయం. ఎందుకంటే 2009 ఎన్నికలకు ముందు చిరు ప్రజారాజ్యం(Prajarajyam) పేరిట ఒక పార్టీ పెట్టారు. కానీ తదనంతర కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అయన కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. 2014 ఎన్నికల వరకు కూడా చిరు కాంగ్రెస్(Congress) లో క్రియాశీలకంగానే ఉన్నారు.
కానీ ఆతరువాత రాజకీయాల నుండి వైదొలగి మరల సినిమాలు చేసుకుంటూ బిజిబిజీ గా గడుపుతున్నారు. కానీ ఒక్క విషయం ఏమిటంటే చిరంజీవి టెక్నీకల్ గా ఇంకా కాంగ్రెస్ పార్టీని వీడలేదు. ఏపీ(Andhra Pradesh) కాంగ్రెస్ లో ఆయనకు ఇంకా సభ్యత్వం ఉంది. కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లో సభ్యత్వాన్ని అట్టేపెట్టుకుని అయన బీజేపీ ద్వారా రాజ్యసభ లోకి వెళతారా అన్నది పెద్ద ప్రశ్న.
ఏమో జత కలవావచ్చు : Might Chiru Join BJP ?
మరో విషయమేమిటంటే చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan Kalyan) కేంద్రం లోను, రాష్ట్రంలోనూ బీజేపీ తో కలిసి అడుగులు వేస్తున్నారు. కాబట్టి తమ్ముడితో జత కలవడం కోసం అయన కాంగ్రెస్ ను విడనాడి బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం కూడా లేకపోలేదని కొందరు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతుంటే, అసలు చిరు పాలిటిక్స్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అయన కి ఈ పదవులు తృణప్రాయం అని డై హార్డ్ ఫాన్స్ చెబుతున్నారు.