Theen Maar Mallana : కాంగ్రెస్ కండువా కప్పుకున్న తీన్ మార్ మల్లన్న.రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా.

13 Theen Maar Mallana : కాంగ్రెస్ కండువా కప్పుకున్న తీన్ మార్ మల్లన్న.రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా.

Theen Maar Mallana : కాంగ్రెస్ కండువా కప్పుకున్న తీన్ మార్ మల్లన్న..రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా..మల్లన్న సేవలను కాంగ్రెస్ ఎలా వాడుకుంటుంది..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు మరింత సరవత్తరంగా మారుతున్నాయి. ఏ నాయకుడు ఏపార్టీలో నుండి ఏ పార్టీలకి జంప్ కోడతాడో ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు.

ఇవాళ ఒక పార్టీ లో ఉన్న నేత రేపు తెల్లవారితే అదే పార్టీలో ఉంటాడు అన్న విషయం ధీమాగా చెప్పలేకపోతున్నారు. రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు అందుకు తగ్గట్టు వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పార్టీ మారిన నేత తీన్ మార్ మల్లన్న.

చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

కాంగ్రెసు పార్టీ నేతలు మల్లనకు ఆ పార్టీ కందువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.అయితే మల్లన్న మొదటి నుండి అధికార బిఆర్.

ఎస్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆపార్టీ అధినేత కే. సీ.ఆర్ ఆయన తనయుడు కే.టి. ఆర్ తీరును ఎండగాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన బిజేపి లో కూడా చేరారు.

అయితే అక్కడ ఆయనకు కమలనాధులతో పొసగలేదో ఏమో కానీ, మరలా బయటకు వచ్చేశారు. గడిచిన కొంత కాలం నుండి ఆయన కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుండటంతో, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.

వారి అంచనాలకు తగ్గట్టే మల్లన్న కాంగ్రెసు పార్టీ గూటికి చేరుకున్నారు. మల్లన్న గతంలో హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమిని చవిచూశారు.

నిన్నటి వరకు ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పార్టీ లో మల్లన్న సీ ఏం అభ్యర్ధిగా ఉన్నారు.

తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసేందుకు మల్లన్న టీంకు పార్టీ వర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగినది. కానీ మల్లన్న అనూహ్యంగా పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారు.

తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తనకు కాంగ్రెసు పార్టీ మద్దతు కావాలని మల్లన్న కొరినట్టు గా కొన్ని వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఆచర్చలు సఫలం కాలేదని, ఆ తరువాతే మల్లన్న కాంగ్రెస్ పార్టీ లో చేరారని తెలుస్తోంది.

మరి రానున్న ఎన్నికల్లో మల్లన్న పోటీ చేస్తే ఎక్కడ నుండి పోటీ చేస్తారు, ఒక వేళ పోటీ చేయకపోతే మల్లన్న సేవలను కాంగ్రెస్ పార్టీ ఎలా వినియోగించుకుంటుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Leave a Comment