Trivikram Srinivas: ‘రామాయణం’కి త్రివిక్రమ్‌ సాయం ? గురూజీ రెస్పాన్స్‌ ఏంటి?

website 6tvnews template 2024 04 04T172800.141 Trivikram Srinivas: 'రామాయణం'కి త్రివిక్రమ్‌ సాయం ? గురూజీ రెస్పాన్స్‌ ఏంటి?

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉన్న నార్త్, సౌత్ అన్న బార్డర్స్ తొలగిపోయాయి. ఫిల్మ్ మేకర్స్ ఎలాంటి హద్దులు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నార్త్ హీరోలు సౌత్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తుంటే…సౌత్ హీరోలు మేమేం తక్కువ కాదంటూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అంతే కాదు ఇప్పటికే సౌత్ డైరెక్టర్లు తెలుగు విడుదలైన చాలా వరకు సినిమాలను హిందీలో కూడా రిలీజ్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)రూపొందించిన ‘బాహుబలి’(Bahubali)సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.

ప్రభాస్ మొదలు పెట్టిన ఈ దండయాత్రను వరుసగా సౌత్ స్టార్స్ కంటిన్యూ చస్తున్నారు. ‘కేజీఎఫ్’(KGF),‘పుష్ప’(Pushpa), ఆర్ఆర్ఆర్ (RRR)వంటి సినిమాలు నేషనల్ వైడ్ గా భారీ హిట్ సాధించాయి. మైండ్ బ్లోయింగ్ వసూళ్లను సాధించాయి. అయితే హిందీ సినిమాల డబ్బింగ్‌ విషయమంలో ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. డబ్బింగ్ లో తెలుగు డైలాగ్స్ సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకులకు సరిగా అర్థం కాక విమర్శిస్తున్నారు. అందుకే అలాంటి తప్పు రిపీట్ కాకూడదని ‘రామాయణం’(Ramayanam)విషయంలో జాగ్రత్త పడుతున్నాడు డైరెక్టర్ నితీష్ తివారీ (Nitish Tiwari).ఇందుకోసం దక్షిణాది దర్శకుల సహాయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

నితీష్‌ తివారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ :

బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీష్‌ తివారి (Nitish Tiwari) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘రామయణం’ (Ramayanam).భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నితీష్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. రామాయణంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi)లీడ్‌ యాక్టర్స్‌గా ఇప్పటికే కన్‌ఫాం అయ్యారు. అయితే ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో స్పీడ్ పెరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ పనులు పూర్తికాగానే గ్రాండ్‌గా మూవీ లాంచ్‌ చేసేందుకు ప్లాన్ వేస్తున్నాడు డైరెక్టర్ . ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సౌత్ లోనూ వసూళ్లను సాధించాలనే టార్గెట్ తో మూవీ మేకింగ్‌ని ఛాలేంజింగ్‌ తీసుకున్నాడు.

ఈ మూవీ సెట్స్ మీదకు రాకముందే సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం త్రివిక్రమ్ (Trivikram)సాయాన్ని డైరెక్టర్ కోరుతున్నట్లు ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. రామాయణం పాన్ ఇండియా సినిమా కావడంతో నితీష్‌ ప్రతి భాష అనువాదం విషయంలో స్పెషల్ కేర్ తీసుకోబోతున్నాడట. ఏ భాషకు ఆ భాషలో మాటల కోసం ఆ ఇండస్ట్రీలోని ప్రముఖులను కాంటాక్ట్ అవుతున్నాడట. ఈ నేపథ్యంలో ‘రామయణం’ తెలుగు వెర్షన్‌ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ సాయం కోరినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

త్రివిక్రమ్‌ దినికి ఒప్పుకుంటాడా :

త్రివిక్రమ్‌ (Trivikram)డైలాగ్‌ రైటింగ్స్‌ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ రైటింగ్స్ కు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి. ఆయన మాటలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ను కూడా కలిగించాయంటే అతిశయోక్తి కాదేమో. త్రివిక్రమ్ కు మాటల మాంత్రికుడు అనే బిరుదును కూడా ఫ్యాన్స్ ముద్దుగా పెట్టుకున్నారు.

త్రివిక్రమ్ కు ఇతిహాసాలు, పురాణాల మీద మంచి పట్టు ఉంది. ఈ క్రమంలో రామయణం సినిమాకు అద్భుతమైన మాటలను అందిస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ నితీష్ రిక్వెస్ట్ ను త్రివిక్రమ్ ఒప్పుకుంటారో లేదో అనేదే అసలు ప్రశ్న. త్రివిక్రమ్‌ దర్శకుడిగా మారిన తర్వాత వేరే సినిమాలకు డైలాగ్స్‌ రాయడం మానేశారు. ఆయన తీసే సినిమాకు ఆయనే మాటలు రాసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో ఆయనకు ఉన్న క్లోజ్ నెస్ కారణంగా భీమ్లా నాయక్‌ (Bheemla Nayak), బ్రో (Bro) సినిమాలకు ఆయన కలం అందించారు. మరి రామయణం (Ramayanam)బాలీవుడ్‌ చిత్రం. మరి త్రివిక్రమ్‌ దినికి ఒప్పుకుంటారో! లేదో వేచి చూడాల్సిందే.

Leave a Comment