ఈ బస్సు లలో కుడా మహిళలు ఫ్రీ జర్నీ చెయ్యచ్చు – TSRTC

WhatsApp Image 2024 03 12 at 3.15.13 PM ఈ బస్సు లలో కుడా మహిళలు ఫ్రీ జర్నీ చెయ్యచ్చు - TSRTC

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వార బస్సు ఫ్రీ ప్రయాణించవచ్చు అని ప్రభుత్వం చెప్పడం తో మహిళలకు ఇది పెద్ద వరం గా మారింది అని చెప్పవచ్చు. ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని RTC అధికారులు చెప్పారు. నిత్యం లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ద్వార తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు అధికారులు చెప్పారు.

ఈ పెరిగిన రద్దీ దృష్టి లో పెట్టుకుని TSRTC కొత్త బస్సుల ఏర్పాటు చెయ్యడానికి తగిన కసరత్తులు చేస్తోంది. ప్రయాణికులకు మరింత సౌకర్యం కోసం ఎలక్ట్రిక్‌ బస్సులు నేటి నుంచి అందరు వినియోగించుకోవచ్చు అని అధికారులు చెప్పారు. దీని వల్ల నగరం లో ప్రయాణికుల కష్టాలు కొంతమేర తీరతాయని అధికారులు చెప్పారు.

ఈరోజు హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డు లో 22 ఎలక్ట్రిక్‌ కొత్త బస్సులను ఆర్టీసీ అధికారులు మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రయాణికుల రద్ది వల్ల 500 అద్దె బస్సులను ఆగస్టు నాటికి వస్తాయని అధికారులు చెప్పారు.

ఇవి పూర్తిగా నాన్‌ ఏసీ బస్సులు అని పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ఈ బస్సులను తీసుకొస్తున్నట్లు ‌అధికారులు చెబుతున్నారు. మహిళలు ఈ బస్సుల్లో ఆధార్‌ కార్డు చూపించి కూడా ఫ్రీగా ప్రయాణించ వచ్చని అధికారులు చెప్పారు.

ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలకు నడుపుతామని అధికారులు చెప్పారు. బస్సులను చార్జింగ్ చెయ్యడం కోసం నగరం లో కొన్న ప్రాంతాలను ఏర్పాటు చేసామని అధికారులు చెప్పారు.

బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, కంటోన్మెంట్‌, హెచ్‌సీయూ, రాణిగంజ్‌ డిపోల్లో చార్జింగ్ చెయ్యడానికి 33 కేవీ పవర్‌ లైన్లు తీసుకున్నమని వారు చెప్పారు. వీటితో పాటు మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులను తీసుకురావడానికి ఆని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అధికారులు చెప్పారు. మహిళలకు ఈ బస్సులన్నిటిలో ఉచితం గా ప్రయాణం చేయవచ్చు అని అధికారులు తెలిపారు.

Leave a Comment