Women do not blow their noses! Do you know what is happening? : భారతీయ సాంప్రదాయాలలో హిందూ మతం ప్రకారం స్త్రీలకు ముక్కు, చెవులు కుట్టడం అనేది ఒక సంప్రదాయమైన ఆచారంగా తర తరాలనుండి వస్తోంది. హిందూ మతంలో వివాహం ఆయిన స్త్రీలు మాత్రమే ముక్కు పుడక పెట్టుకోవాలన్న నియమం అయితే లేదు.
అందువలన చిన్న పిల్లల దగ్గర నుండి పెళ్లి కాని స్త్రీలు వివాహంతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ముక్కుపుడకను పెట్టుకోవచ్చని చెప్తున్నారు పండితులు. అయితే ముక్కు పుడకలను పెట్టుకునే విధానం ప్రాంతాల వారీగా వేరు వేరుగా ఉంటుందని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు. హిందూమత ఆచారాల ప్రకారం, సాధారణంగా పెళ్లి రోజున వధువు ముక్కు పుడక లేదా నాథ్ ధరించడం ఆనవాయితీగా వస్తోంది.
భారత దేశం అంతటా అనేక సంస్కృతుల్లో ముక్కు రింగులను పెట్టుకోవడం అనేది వివాహ పరమైన జరిగే తంతు గా కనిపిస్తుంది. అంతే కాదు మన దేశం లో హిందూ మతంలో ఉన్న ఒక మహిళ ముక్కు పుడక ఆమె భర్త మరణంతో తీసేస్తారు కొందరు. ఇది వారి ఆచారాల ప్రకారం ఉంటుంది. అంతేకాదు హిందూ మత ఆచారం ప్రకారం అమ్మాయిలు 16 ఏళ్ల వయస్సులోకి రాగానే ముక్కు పుడక తప్పనిసరిగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తోంది అని పండితులు చెప్తున్నారు.
దీని ప్రకారం ఆ అమ్మాయి పెళ్లి చేసే వయస్సుకు వచ్చినట్లు ఆ రోజుల్లో అనుకునేవారు. కానీ ఇప్పుడు వివాహ వయసును భారత చట్టాల ప్రకారం 18 సంవత్సరాలకి పెంచినట్లు
అందరు గుర్తు పెట్టుకోవాలి. ఈ ముక్కు పుడక అనేది పెళ్ళికి సంబంధించిన దేవత అయిన పార్వతి దేవికి గౌరవ సూచకంగా వచ్చినది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు.
పురాతన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం, సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత గ్రంధం లో ముక్కు పుడకలు ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన ఎన్నో విషయాలు రాయడం జరిగింది. ముఖ్యం గా స్త్రీలు పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉన్న, ఎడమ ముక్కు భాగంలోని నరాలను శాంతపరచే క్రమంలో భాగంగా మహిళలు ఈ ముక్కు పుడకలను పెట్టుకోవడం చాలా మంచిది అని సుశ్రుతుడు తన ఆయుర్వేద గ్రంధం లో రాసాడు.
ఈ ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల స్త్రీల కు ప్రసవం సమయంలో సహాయపడుతుందని సుశ్రుతుడు చెప్పడం జరిగింది. అంతే కాదు ఆయుర్వేద ప్రకారం, ముక్కు మీద ఉండే ఒక ప్రత్యేకమైన భాగం లో ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల స్త్రీల లో వచ్చే నెలసరి సమయాల్లో వచ్చే నొప్పిని తగ్గిస్తుందని అందువల్ల స్త్రీలు వయస్సు తో సంబందం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవారు వరకు ఈ ముక్కు పుడక పెట్టుకోవడం చాలా మంచిది అని సుశ్రుతుడు తన ఆయుర్వేద గ్రంధం లో చెప్పడం జరిగింది.
ఈ ముక్కు పుడకను వెండి లేదా బంగారం తో చేసిన వాటినే పెట్టుకోవాలని వేరే లోహంతో చేసే వాటిని పెట్టుకోకూడదని దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని అంతే కాకుండా వేరే లోహం కావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పడి కొత్త కొత్త సమస్యలు వస్తాయని పండితులు చెప్తున్నారు.