మహిళలు మంగళసూత్రం విషయం లో ఈ తప్పులు చెయ్యకండి !

222222 360x180 1 మహిళలు మంగళసూత్రం విషయం లో ఈ తప్పులు చెయ్యకండి !

భారత దేశం లో ఉన్న హిందువులకు ఆచార వ్యవహారాలకు సబందించి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. ముఖ్యం గా మన పండగలు విషయం లో పాటించే సాంప్రదాయం అనే దానికి ఎంతో ప్రాధాన్యత ని ఇస్తాం.

పూజలు కాని, ఆలయాలకు వెళ్ళేటప్పుడు కాని మనం ఎన్నో జాగ్రాత్తలు తీసుకుంటాం. అందులో ప్రాధానం గా చెప్పుకునేది మహిళల మెడలో ఉండే మంగళ సూత్రం. దీనిని స్త్రీలు ఎంతో పవిత్రమైనది గా భావిస్తారు. మరి అలాంటి మంగళ సూత్రం విషయం లో స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీ వివాహం కు ముందు వివాహం అయిన తర్వాత ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది. వివాహ సమయం లో వరుడు స్త్రీ మెడ లో కట్టిన పసుపుతాడు తో వారిద్దరికి ఒక భందం ఏర్పడుతుంది. ఆ భందం కడ వరకు ఉంటుంది.

ఎంతో పవిత్ర మైన ఈ మంగళ సూత్రం ఏరోజు మెడ నుండి బయటకి తియ్యకూడదు. ఒకే ఒకసారి తీస్తారు అది కూడా భర్త మరణించినట్లయితేనే తప్ప, ఒకవేళ తీయాల్సి వస్తే ముందుగా ఒక పసుపుతాడుకి పసుపుకొమ్ము కట్టుకొని అదికూడా భర్త చేత తీయించుకోవాలి. లేదా భర్త వేరే ఊరు లో ఉన్నప్పుడు తానే ఈ పసుపుతాడు ను దేవుడి మండపం లేదా దేవుడి పఠం ముందు కుర్చుని మాట్లాడకుండా శబ్దాలు చెయ్యకుండా మంగళ సూత్రాన్ని మార్చుకోవచ్చు.

ఇంకా ఎలాంటి నియమాలు ఉన్నాయో ఇప్పుడు మరిన్ని తెలుసుకుందాం:

1.మహిళలు మంగళ సూత్రం లో ఎరుపు,నలుపు పూసల ను కూడా వేసుకుంటారు. వీటికి కుడా ఎంతో ప్రాధాన్యత ఉంది.

2.మంగళ సూత్రం లో ఉండే నల్ల పూసలు పరమేశ్వరుడు గా భావిస్తే, ఎరుపు లేదా బంగారు వర్ణం లో పూసలను పార్వతిదేవిగా భావిస్తారు.

3.మంగళ సూత్రం లో ఈ రెండు రంగుల పూసల కలయికని శివుడు పార్వతి అనుగ్రం తో దీర్గ సుమంగళి గా ఉంటారని పురాణాలలో చెప్పబడింది.

4.కొందరి స్త్రీలు మెడ లో వేసుకున్న మంగళ సూత్రం లో వారికి ఇష్టమైన దైవం రూపం తో ఉండే లాకెట్ ను వేసుకుంటారు.

5.ఈ విధం గా మంగళ సూత్రం లో లాకెట్ ని వేసుకోవడం అస్సలు చెయ్యకూడదని అది చాలా తప్పని పండితులు చెప్తున్నారు.

6.మంగళ సూత్రం లో అలా లాకెట్ లు వేసుకోవడం అనేది కష్టాలను ఏరి కోరి తెచ్చుకోవడమే అవుతుందని పండితులు చెప్తున్నారు. మరి ముఖ్యం గా లక్ష్మి దేవి లాకెట్ ని మంగళ సూత్రం లో వేసుకోవద్దని పండితులు చెప్తున్నారు.

7.మనం కొంత మంది ని ఎప్పుడు చూస్తూ ఉంటాం మంగళ సూత్రం లో పిన్నీసులు, తాళం చెవులు కూడా వేసుకుంటారు.

8.అలా వేసుకోవడం అస్సలు మంచిది కాదని అలా వేసుకోవడం వల్ల ఇంటిలో దరిద్రం తాండవిస్తుంది అని అంతే కాదు భర్త ఆయుష్షు తగ్గిపోవడానికి అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు.

ఇప్పుడు చెప్పిన నియమాలు పాటిస్తూ ఎల్లప్పుడూ అనందం గా సంతోషం గా ఉండడానికి ప్రయత్నిచండి. దీర్ఘాయువుతో పాటు దీర్గ సుమంగళి గా ఉండండి.

Leave a Comment