నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోమ్ మెస్సేజ్ తో గాలం – క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళియే : Work From Home Message – Cyber Fruad – Bank A/C Nill

website 6tvnews template 45 నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోమ్ మెస్సేజ్ తో గాలం - క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళియే : Work From Home Message - Cyber Fruad - Bank A/C Nill

Work From Home Message – Cyber Fruad : ప్రస్తుతం మన దేశం లో నిరుద్యోగ యువతీ యువకులు కి ఎం కొదవలేదు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరం గా మారింది. ఆన్లైన్ జాబ్స్ అని, వర్క్ ఫ్రం హోమ్ అని రక రకాల పేర్లతో మోసాలకు తెర తీసారు. దీనికోసం మా వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వమని ఒక లింక్ ఇస్తారు. దీనికి ఆకర్షతులైన యువతీ యువకులు ఆ లింక్ ని ఓపెన్ చేసి అందులో వారి వివరాలతో లాగిన్ అవుతున్నారు.

ఇటీవల ఓ యువతీ కి నకిలీ వెబ్ సైట్ లింక్ పంపారు. ఈమెది భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం నిజాంపేట అనే చిన్న గ్రామం. పేరు నవ్యశ్రి, ఈమె బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. ఈమెకు ఇంస్టా గ్రామ్ ద్వారా ఓ వ్యక్తి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఉన్నాయని ఒక లింక్ పపాడు. దీనిలో మేము మీకు కొన్ని వర్క్ లు ఇస్తాము మీరు మీ ఇంటివద్ద ఉండి కంప్లీట్ చేసి పంపుతే మీకు ఆన్లైన్ ద్వారా మని ట్రాన్స్ ఫర్ చేస్తామని నమ్మబలికాడు.

ఇది నిజమే అని నమ్మింది ఆ యువతీ. వెంటనే అందులో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడింది. అయితే మాట్లాడిన వ్యక్తి మేము మీకు వర్క్ ఇవ్వలంటే మీరు కొంత అమౌంట్ డిపాజిట్ చేయవలసి ఉంటుందని చెప్పాడు. అందుకు ఆ యువతీ కొంత డబ్బుని డిపాజిట్ చేసింది.

JobScam 1200x630 1 నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోమ్ మెస్సేజ్ తో గాలం - క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళియే : Work From Home Message - Cyber Fruad - Bank A/C Nill

అప్పుడు అవతలి వ్యక్తి మీరు కట్టిన అమౌంట్ కి కొద్దిగా నే వర్క్ ఇస్తామని అదే మేము చెప్పిన డబ్బు ని పంపితే వర్క్ ఎక్కువ వస్తుంది అంతే కాకుండా మీరు కట్టిన దానికి డబుల్ అమౌంట్ ఇస్తామని ఆశ చూపాడు ఆ అవతలి యక్తి. ఇది నమ్మిన ఆ యువతి ఏడు విడతులు గా దాదాపు 91,000 వేలు పంపింది.

ఇన్ని సార్లు డబ్బు కట్టిన ఒక్కసారి కూడా అమౌంట్ పంపలేదని అనుమానం వచ్చి ఆ వ్యక్తి కాల్ చేసింది. అప్పుడు ఆ వ్యక్తి కి కాలి చేసి తాను ఇంతవరకు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి మేము మీకు డబ్బు పంపాలంటే టాక్స్ కింద మేరె మాకు 83 వేలు పంపాలని చెప్పాడు.

దీనికి ఆమె ఇక నా దగ్గర డబ్బులు లేవని ఇప్పటి వరకు తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగింది. అవతలి వ్యక్తి మాత్రం మీరు మిగిలిన డబ్బులు పంపితే మొత్తం డబ్బులు పంపుతామని చెప్పి ఫోన్ కట్ చేసాడు.

ఈమె ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఆ నెంబర్ పనిచెయ్యడం లేదని రావడం తో ఆమె మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైం నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేసింది, అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లిఖిత పూర్వకం గ కంప్లైంట్ ఇవ్వడం తో పోలీసులు ఎంక్వయిరీ ప్రారంభించారు. అపరచితులు పంపిన లింక్ లు కాని మెస్సేజ్ లు కాని స్పందించ వద్దని పోలీసులు మీడియా విలేఖరుల సమావేశం లో కోరారు

Leave a Comment