World Athletic Championship in 2029: వరల్డ్ అథ్లెటిక్​ ఛాంపియన్​షిప్​నక ఆతిథ్యమివ్వనున్న భారత్..

World Athletic Championship in 2029

2029 లో వరల్డ్ అథ్లెటిక్​ ఛాంపియన్​షిప్​నకు ఆతిథ్యమివ్వనున్న భారత్.

వరల్డ్ అథ్లెటిక్​ ఛాంపియన్​షిప్​నకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్​ ఆసక్తి ని చూపిస్తోంది.
దానికోసం బిడ్​ ను కూడా దాఖలు చేయదానికి అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించింది.
ఇంతకుముందు కూడా ఒలింపిక్స్​ నిర్వహణపై భారత్ ఎంతో ఆసక్తి కనబరిచింది.

అథ్లెటిక్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా- ఏఎఫ్​ఐ సీనియార్​ ఉపాధ్యక్షురాలు అంజు బాబీ జార్జ్‌ 2029 లో వరల్డ్​ ఛాంపియన్‌షిప్‌ ఆతిథ్యానికి బిడ్‌ వేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.

2036 ఒలింపిక్స్‌, 2030 యూత్‌ ఒలింపిక్స్‌ ఆతిథ్యం కోసం భారత్‌ ఇప్పటికే ఆసక్తి తో ఎదురుచూస్తోంది. 2029 ప్రపంచ అథ్లెటిక్స్‌ నిర్వహణకు అవకాశం లభిస్తే ఇంకా బాగుంటుందని ఆమె వివరించారు.

అయితే, ఇంతకుముందు 2027 ప్రపంచ టోర్నీ ఆతిథ్యం పట్ల ఆసక్తి కనబరిచిన అథ్లెటిక్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా ఇప్పుడు 2029 పోటీలపై దృష్టిసారింంచింది.

2024 పారిస్‌ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత అగ్రశ్రేణి క్రీడాకారుల జాతీయ శిక్షణ శిబిరాలకు తెరదించాలని అథ్లెటిక్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు తెలియజేశామని, దీనిని వాళ్లు అభినందించారని తెలిపింది.

Add a heading 2023 12 04T114433.534 World Athletic Championship in 2029: వరల్డ్ అథ్లెటిక్​ ఛాంపియన్​షిప్​నక ఆతిథ్యమివ్వనున్న భారత్..

‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- సాయ్‌, రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ, టాటాతో పాటు ఇతర ప్రైవేటు సంస్థల దగ్గర మంచి మౌలిక వసతులున్నాయని, ఆ సంస్థలు భారీగా పెట్టుబడి పెట్టాయని తెలిపింది.

ఫారిన్ కోచ్‌లను కూడా నియమించారు. వాళ్లు అక్కడే క్రీడాకారులకు ట్రైనింగ్ ఇప్పించవచ్చని, కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అథ్లెట్లకు నేరుగా శిక్షణ ఇవ్వొచ్చు’ అని అథ్లెటిక్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా అధ్యక్షుడు ఆదిల్‌ సుమరివాలా వివరించారు.

2036 ఒలింపిక్స్​ నిర్వహణపై భారత్​ ఆసక్తి కనబరిచిన నేపథ్యంలో, ఆ ఒలింపిక్స్​ ఎడిషన్​లో అథ్లెటిక్స్ విభాగంలో 5 నుంచి 6 పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలని ఏఎఫ్​ఐ నిర్ణయించింది. ఈ మేరకు ఏఎఫ్​ఐ ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ లలిత్ బనోత్​ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా తెలిపారు.

Leave a Comment