T20 World Cup 2024: రికార్డు క్రియేట్ చేసిన నేపాల్.. మరలా పదేళ్ల తరవాతే అర్హత సాధించారు.
నేపాల్ దేశం క్రికెట్ లో ఒక ఘనత సాధించింది. ఆ జట్టు దాదాపు 10 సంవత్సరాల తరువాత 2024 సంవత్సరంలో జరగబోయే T20 ప్రపంచ కప్ కి అర్హత సాధించింది.
నేపాల్ లో నిర్వహించిన సెమి ఫైనల్ లో ఆ దేశం జట్టు యూఏఈ పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజయలక్ష్మిని వరించబట్టే నేపాల్ 2024 పురుషుల టి20 ప్రపంచకప్‌కు అర్హత పొందగలిగింది.
ఇక నేపాలీతోపాటు ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన మరో జట్టుగా ఒమన్ నిలిచింది. 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో ఒమన్ బెహ్రెయిన్ ను ఓడించింది.
ఇక ప్రస్తుత మ్యాచ్ గురించి చుస్తే మొదట బ్యాటింగ్ కి దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. యూఏఈ ఆటగాళ్లలో వికెట్ కీపర్ కం బ్యాట్సమెన్ 51 బంతుల్లో 64 పరుగులు సాధించి, ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
8 ఫోర్లు, 2 సిక్సర్లతో మంచి ఆటతీరును కనబరిచాడు. అయితే తన మెరుగైన ఆటతీరు జట్టు విజయానికి దోహదపడలేకపోయింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ముహమ్మద్ వాసిమ్ 16 బంతుల్లో 26 పరుగుల సాధించాడు.
వాసిమ్ కేవలం ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు ఆ జట్టు కెప్టెన్ కూడా. ఈ ఇద్దరు మినహా యూఏఈ జట్టులో ఏ ఒక్క ఆటగాడు కూడా 20 పరుగులకు మించి చేయలేకపోవడం గమనించదగ్గ విషయం.
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది.
17.1 వోవర్లలోనే ఆటను ముగించేసింది నేపాల్. నేపాల్ తరుపున అసిఫ్ షేక్ 51 బంతుల్లో 64 పరుగులు తీసి ఎక్కువ స్కోర్ చేసిన ఘనత సాధించగా, కెప్టెన్ రోహిత్ పౌడెల్ 34 పరుగులు చేశాడు. మరో ఆటగాడు గుల్సన్ ఝా 22 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో ఎక్కువ పరుగులు సాధించిన ఆసిఫ్ షేక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఘతన సాధించాడు. ఇక ఈ విజయంతో నేపాల్ అమెరికాలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించింది.