ప్రస్తుతం ఎక్కడ చూసినా వన్డే వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. యువత మొత్తం టీవీలకు అతుక్కుపోయి క్రికెట్ చూస్తున్నారు. అలా కుదరకపోతే అస్తమానం ఫోన్ చూస్తూ స్కోర్ చెక్ చేసుకుంటున్నారు.
ఇక కేవలం భారత్ మాత్రమే ఇతరదేశాలతో తలపడుతున్నప్పుడు మాత్రమే మన వాళ్ళు క్రికెట్ చూస్తున్నారు అనుకోకండి సుమా. మన వాళ్ళలో ఇతరదేశాల్లోని క్రికెట్ ఆటగాళ్లకు కూడా ఫాన్స్ ఉన్నారు. మన ఇండియన్ క్రికెట్ టీమ్ గెలవాలి అని అందరూ అనుకుంటారు, కానీ ఇతర దేశాల జట్ల ఆటను కూడా ఎంజాయ్ చేస్తుంటారు.
మరి అటువంటి క్రికెట్ అభిమానుల కోసం ఈ న్యూస్. ఇవాళ ఏయే జట్లు తలపడుతున్నాయి అన్న విషయం చూద్దాం, నేడు లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంకో ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ టీమ్స్ తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పేసర్ నవీనుల్ హక్ ప్లేస్ లో స్పిన్నర్ నూర్ అహ్మద్ ను తీసుకుంది. ఇక పిచ్ ను దృష్టిలో పెట్టుకుని ఆఫ్ఘన్ జట్టు తమ టీమ్ లో నలుగురు స్పిన్నర్లు ఉండేలా చూసుకుంది.
కేవలం ఆఫ్ఘన్ జట్టులో మాత్రమే కాదు నెదర్లాండ్స్ జట్టులో కూడా మార్పులు జరిగాయని చెప్పొచ్చు. నెదర్లాండ్స్ ఓపెనర్ విక్రమ్ జిత్ సింగ్ ను తప్పించి, వెస్లీ బరేసీ ని దించుతున్నారు.
పాయింట్స్ బోర్డు లో చుస్తే నెదర్లాండ్స్ 8థ్ ప్లేస్ లో ఉండగా ఆఫ్ఘనిస్తాన్ 6థ్ ప్లేస్ లో ఉంది. నెదర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ రెండు పసికూనలే అయినప్పటికీ నెదర్లాండ్స్ తో పోల్చితే ఆఫ్ఘనిస్తాన్ కొంచం బెటర్ పోసిషన్ లో ఉందని చెప్పొచ్చు. మరి ఇవాళ ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.