X Down Complaints Raised By Users: ఎక్స్ డౌన్..అయోమయంలో ఎక్స్ యూజర్లు.
వరల్డ్ వైడ్ గా ఎక్స్ , అంటే ఒకప్పటి ట్విట్టర్ మరమ్మత్హులకు గురైంది. కాస్త అర్ధమయ్యేలా చెప్పాలి అంటే ఎక్స్ డౌన్ X Down అయింది అని చెప్పాలి.
డిసెంబర్ 21వ తేదీ ఉదయం నుండి ఎక్స్ లో వేసిన పోస్టులు వినియోగదారులకు కనిపించడం లేదట పైగా పోస్ట్ కోసం సెర్చ్ చేస్తుంటే బ్లాంక్ అనే ఎర్రర్ కనిపిస్తోందని తెలుస్తోంది.
ఇక ఎక్స్ లో ఖాతా ఉన్న వారు వారి ఖాతా ప్రొఫైల్ X Profile లోకి వెళ్లగా అక్కడ పీపుల్స్ లిస్ట్ అనేది మాత్రమే చూపెడుతోందని అంటున్నారు.
ఈ ఎక్స్ అనే సామజిక మాధ్యమం డౌన్ అయినా క్షణం నుండి మనం చూసిన పోస్టులు మాత్రమే కనిపించకుండా పోవడం లేదు.
అసలు ఎక్స్ లో ఎవరి పోస్టులు కూడా చూపించడం లేదని వినియోగదారులు అసహనానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఎక్స్ ను ఉపయోగిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంది అంటే చిన్నపిల్లవాడి నోట్లో తేనె పీక లాగేసినట్టుగా మారింది.
No Posts Found In X:
ఎక్స్ లో ఉన్న ఏ పేజీని మనం క్లిక్ చేసినా ఒకటే చూపెడుతోంది, ఏ సెగ్మెంట్ Segment ను టచ్ చేసిన అదే చూపెడుతోంది. అదేమిటనేగా మీ డౌట్, అదే పీపుల్స్ ఐడీలు Peoples ID.
డిసెంబర్ 21 వ తేదీ ఉదయం నుండి అవే హైలైట్ అవుతున్నాయి. ఈ ప్రక్రియ చూసి ఎక్స్ వినియోగదార్లు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఎక్స్ డౌన్ X Down అయింది అని తెలిసిన వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో అవసరాలు తీర్చుకుంటుంటే ఈ విషయం తెలియని వారు మాత్రం ఎక్స్ ప్రొఫైల్ లోకి వెళ్లి లాగ్ అవుట్ చేస్తున్నారు,
మరలా లాగిన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరల మరల చేసిన ఉపయోగం లేదని తెలిసి వదిలేశారు. చివరకు పోస్టులు కనిపించడం లేదని ఫిర్యాదులు పెట్టిన వారు కూడా లేకపోలేదు.
టెక్నాలజీకి కి సంబంధించి ఏవైనా చిక్కులు చికాకులు Technical Issues వచ్చినప్పుడు ఎక్స్ లో ఆ వివరాలను పంచుకునే వారు నెటిజన్లు, కానీ ప్రస్తుతం ఎక్స్ కె టెక్నీకల్ ప్రాబ్లమ్ రావడంతో ఎక్కడ చెర్ చేయాలో తెలీక అల్లాడిపోతున్నారు.
Disruption in micro blogging site:
డిసెంబర్ 21 వ తేదీ ఈ తేదీన రాజకీయ సినీ ప్రేమికులకు చాలా అవసరం ఉన్న రోజు, ఈ తేదీన కింగ్ ఖాన్ షారుక్ Sharukh Khan నటించిన డుంకి Dunki విడుదల,
పైగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినం Ys Jagan Birth Day కూడా. కాబట్టి ఎక్స్ యూజర్లు ట్రేండింగ్ గా ఉండే వీటి కోసం ఉదయం నుండే వెతకడం మొదలు పెట్టారు. కానీ అందులో ఏ ఒక్క పోస్టు కనిపించకపోవడంతో ఖంగారు పడిపోయిన వారు ఎక్కువ గా ఉన్నారు.
మైక్రో బ్లాగింగ్ సైట్ Micro Blogging Site ఎక్స్ లో అంతరాయం కలిగింది అంటే ఈ అవస్థ కేవలం భారతదేశంలోని
వారికి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్ యూజర్లు ఎవ్వరు కూడా దీనిని ఉపయోగించలేదు. కాబట్టి ఎక్స్ సరిగా పనిచేయడం లేదు, తమ ప్రొఫైల్ ఖాళీగా కనిపిస్తోంది అనే ఫిర్యాదులు అనేకం వచ్చాయి.
X Down Got Trending:
Ookla అనే సాధనం ద్వారా ఎక్స్ పనిచేయడం లేదంటూ సుమారు 4,500 నలుగు వేల ఐదు వందల మంది కంప్లైంట్ చేశారు.
అంతే కాదు డిసెంబర్ 21 వతేది సుమారు ఉదయం 11 గంటల సమయం నుండి ఎక్స్ సామజిక మాధ్యమం లో లోపం తలెత్తడంతో ఎక్స్ డౌన్ X Down ,
ట్విట్టర్ డౌన్ Twitter Down అనే హాష్ టాగ్స్ ట్రేండింగ్ # Tag Trending అవడం మొదలెట్టాయి. ఇప్పటివరకు వివిధ రకాల అంశాలు ఎక్స్ లేదా ట్విట్టర్ లో హాష్ టాగ్స్ తో ట్రెండింగ్ అవుతూ ఉండగా ఇప్పుడు ఏకంగా ఎక్స్ ట్రెండింగ్ అయింది. X # tag Trending