Xiaomi 13T Pro: చైనా బేస్డ్ ఎలక్ట్రానిక్ కంపెనీ షావోమీ, ఈ దిగ్గజ కంపెనీ ఇప్పటికే అనేక మోడళ్ల ను ప్రవేశ పెట్టి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ప్రియుల మనసు దోచుకుంది.
అధునాతన ఫీచర్లతో మొబైల్స్ ను లంచ్ చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఒక కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకు రాబోతోంది. అదే షావోమీ 13T ప్రో.
ప్రస్తుతం ఈ మోడల్ కి సంబంధించి పూర్తి వివరాలను సదరు కంపెనీ వెల్లడించకపోయినప్పటికీ అంతకు ముందు విడుదలైన మోడళ్లను బట్టి రాబోతున్న షావోమీ 13T ప్రో పై కొన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. అవేమిటి అనేదానిపై ఒక లుక్కేద్దాం రండి.
షావోమీ 13T ప్రో డిస్ ప్లే – Xiaomi 13T Pro Display
షావోమీ 13T ప్రో మొబైల్ స్క్రీన్ సైజు 6.67 అంగుళాలు పొడవు ఉంటుంది. అంటే 16.94 సెంటీమీటర్ల అని చెప్పొచ్చు. దీని వెడల్పు 2.94 ఇంచులు ఉంటుంది.
0.33 ఇంచుల మందం ఉంటుంది. 200 గ్రాముల బరువు ఉండే ఈ మొబైల్ ఫోన్ నాలుపు, మిడౌ గ్రీన్, ఆల్పైన్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఈ మొబైల్ రెసొలుతిఒన్ 1220 x 2712 గా ఉండనుంది.
20:9 యాస్పెక్ట్ రేషియో ఉండే ఈ మొబైల్ డిస్ ప్లే చుస్తే AMOLED తో ఉంటుంది, అలాగే డాల్బీ విషన్, HDR 10+ సౌలభ్యం కూడా ఉంటుంది. దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144 HZ గా ఉంటుంది. టచ్ రిఫ్రెష్ రేట్ చుస్తే 480HZ గా ఉంటుంది.
షావోమీ 13T ప్రో కెమెరా : Xiaomi 13T Pro Camera
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ కొనే ప్రతి ఒక్కరు చూసే విషయం కెమెరా, కెమెరా కి ఎంత మెగా పిక్సెల్ సామర్ధ్యం ఉంది అన్న విషయాన్నీ నిశితంగా పరిశీలించి కొంటున్నారు.
అలాగే సెల్ఫీ కెమెరా కి ఏమైనా స్పెషాలిటీలు ఉన్నాయా అన్నవాటిపై కూడా దృష్టి పెడుతున్నారు. కాబట్టి కంపెనీలు కూడా ఫోన్ తయారీ విషయంలో కెమెరా పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
ప్రస్తుతం షావోమీ 13T ప్రో కెమెరా ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని ఆశిస్తున్నారు. దీని ఫ్రీమారి కెమెరా 50 మెగా పిక్సెల్ తో వస్తుంది.
ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. అలాగే f/1.9 ఆపేర్చుర్, 24mm ఫోకల్ లెంగ్త్ ఉంటుంది. సెకండరీ రియర్ కెమెరా విషయానికి వస్తే ఇది 12 మెగా పిక్సల్ ఫో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఉండులో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 15mm ఫోకల్ లెంగ్త్, f/2.2 ఆపేర్చుర్ ఉంటుందని ఆశిస్తున్నారు. ఇక మూడవ రియర్ కెమెరా లో కూడా 50 మెగా పిక్సెల్ సామర్ధ్యం ఉంటుంది. టెలి ఫోటో లెన్స్ తోపాటు 50mm ఫోకల్ లెంగ్త్ ఉంటుంది.
షావోమీ 13T ప్రో బ్యాటరీ : Xiaomi 13T Pro Battery
స్మార్ట్ ఫోన్లలో వాడే బ్యాటరీ చాల ముఖ్యమైంది, ఈ అధునాతన మొబైల్ ఫోన్ లలో వచ్చే బ్యాటరీ ఎక్కువసమయం వచ్చేది గా ఉండాలి అలాగే త్వరగా ఛార్జ్ కూడా అవ్వాలి.
అలా ఉంటేనే ఆ ఫోన్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరి Xiaomi 13T Pro Batteryఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇందులో ఉండే బ్యాటరీ Li పాలిమర్ కి సంబందించిన బ్యాటరీ.
ఇది 5000 mah కెపాసిటీ తో ఉంటుంది. ఇది బయటకు తీయడానికి వీలుగా ఉండదు. త్వరగా ఛార్జింగ్ చేయడానికి వీలవుతుంది. కేవలం 19 నిమిషాల్లో వంద శతం ఛార్జింగ్ అవుతుంది. అయితే ఇందులో వైర్ లెస్ ఛార్జింగ్ సౌకర్యం లేదని తెలుస్తోంది.
షావోమీ 13T ప్రో స్టోరేజ్ – Xiaomi 13T Pro Storage
ఇక స్టోరేజ్ విషయానికి వస్తే దీని ర్యామ్ 12 జిబి గా ఉంటుందని, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 256 జిబిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఇది ఇన్ఫ్రా రెడ్ nfc చిప్ సెట్ తో వస్తుంది. ఇక కెమెరా ఫీచర్లు చుస్తే ఆటో ఫోకస్, ఆటో డిటెక్షన్, ఆటో ఫ్లాష్ సౌలభ్యంతో ఉటుంది.