Xiaomi Entering In To Car Production: కార్ల రంగంలోకి అడుగుపెడుతున్న Xiaomi.
ఇప్పటివరకు మొబైల్స్ మాత్రమే తయారు చేసిన చైనా సంస్థ Xiaomi ఇప్పుడు ఒక అడుగు ముందుకి వేసింది. బీజింగ్ – చైనా క్లయింట్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఇప్పుడు ఎలెక్ట్రికల్ కార్ల తయారీ రంగంలోకి ప్రవేసించింది.
ఇప్పటికే ఈ రంగంలో పాతుకుపోయిన, బాగా డిమాండ్ కలిగినటువంటి సంస్థలైన టెస్లా, పోర్షే వంటి సంస్థలతో పోటీ పడేందుకు రెడీ అంటోంది.
ఈ క్రమం లోనే Xiaomi తన కొత్త మోడల్ Xiaomi SU7 ను మార్కెట్ కు పరిచయం చేసింది. అయితే అది పూర్తి స్థాయి కారు కాదట, వారు తయారు చేస్తున్న వాహనం తయారీ లో ఉందట,ఈప భవిష్యత్తులో మార్కెట్ లోకి వస్తుందని అంటున్నారు.
ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో CEO లీ జున్ X స్వయంగా ప్రకటించారు. అంతే కాదు దీని కోసం వారు, ఏకంగా 10 బిలియన్ యువాన్లు ఖర్చుచేస్తున్నారట.
టెస్లా పోర్షే తో పోటీ : Competing With Tesla And Porsha
వీరు మార్కెట్ లోకి తీసుకురాబోయే కారు గురించిన లీకులు ఎలా ఉన్నాయంటే వీరు తయారు చేస్తున్న కొత్త మోడల్ కారు ఇప్పటికే ఉన్న టెస్లా, అలాగే పోర్షే కార్లకన్నా యాక్సలరేషన్ విషయంలో మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు.
ఇక ఈ సంస్థ యానామాని లీ జున్ X గురించి మాట్లాడుకుంటే ఇతను భవిష్యత్తులో ఈ రంగంలోకి రావాలని ముందుగానే ఫిక్స్ అయ్యాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇతను గతంలో BMW, Mercedes Benz వంటి కంపెనీలలో పనిచేశాడు.
మొబైల్, గృహోపకరణాల ఉత్పత్తిలో : Production Of Mobile And House Hold Products
వీరు ఈ మార్కెట్ లోకి ధైర్యంగా అడుగు పెట్టడానికి మరో కారణం కూడా ఉంది, చైనా లో ఎలెక్ట్రానిక్ ఆటోలు ఉత్పత్తి చేసి విడుదల చేసిన మూడు సంవత్సరాల కాలంలోనే అవి బాగా అమ్ముడయ్యాయి,
పైగా వాటిని గృహ అవసరాలకి అనుకూలంగా కార్ తయారీ కోసం పరిశోధించి కొత్త మోడల్ కార్ ను వీరు పరిచయం చేస్తున్నారు.
పైగా ఈ కారు తయారీ కూడా Xiaomi సంస్థ కి బాగా అనుకూలత ఉన్న స్థలం కావడం విశేషం, ఇక్కడే ఆ సంస్థ అనేక రకాల ఫోన్లు, అలాగే గృహోపకరణాలు తయారు చేసి ప్రజలకు అందించి వారి మన్ననలు పొందింది.