YS Sharmila tweet On Son Wedding: Y.S షర్మిల ఇంటపెళ్లి బాజాలు.

Y.S Sharmila's Intapelli Bajalu.

YS Sharmila tweet On Son Wedding: వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ అనేక పరిణామాల అనంతరం ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ను వీడి తెలంగాణ(Telangana) కు చేరుకున్నారు.

తన రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రంలో బాటలు వేసుకోవడానికి ప్రణాళికలు రచించుకుని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ(YSR Telagana Party) పేరుతో ఒక పార్టీ ని ఏర్పాటు చేసుకున్నారు.

పార్టీ ఏర్పాటుచేసుకుని పాదయాత్ర చేపట్టి నారి బి.ఆర్.ఎస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. ఇవ్వని ఎంతలా పాపులర్ అయ్యాయో ఆమె పర్సనల్ విషయాలు కూడా అదే రేంజ్ లో పాపులర్ అయ్యాయి.

కొన్ని సందర్భాల్లో తన బిడ్డలు రాజారెడ్డి(Rajareddy), అంజలి రెడ్డి(Anjalireddy) ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉండేవారు. వారి చదువులు విదేశాల్లో కొనసాగుతూ ఉన్నాయని,

అప్పుడప్పుడు తానూ కూడా అక్కడికి వెళ్లి వాస్తు ఉంటానని చెబుతుండేవారు. ఈ క్రమంలో షర్మిల తనయుడు రాజారెడ్డి, విదేశాల్లో ఉన్నతచదువులే కాక ప్రేమ పాఠాలు కూడా వల్లే వేసినట్టు వార్తలు బయటకు వచ్చాయి.

చూడ్డానికి హీరోలా ఉండే రాజారెడ్డి మనసు దోచుకున్న ఆ అమ్మాయి కూడా తెలుగమ్మాయే, పైగా కమ్మ సామజిక వర్గానికి చెందిన అమ్మాయే. ఆ అమ్మాయి పేరు అట్లూరి ప్రియా(Priya Atluri).

తోలి పత్రిక ఇవ్వబోయేది అక్కడే : First Invitation Card Will be Given To

కొన్నాళ్ల క్రితం రాజారెడ్డికి కాబోయే భార్య ఈమె అంటూ, ఆమె ఫోటోలు ఇవిగో అంటూ ప్రియా అట్లూరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు చాలామంది.

పైగా ఆ ఫొటోల్లో వై.ఎస్ విజయలక్ష్మీ (Ys Vijaya lakshmi) ప్రియా అట్లూరి చీర కూడా పెదుతున్నట్టు కనిపించింది. మొత్తానికి సామజిక మాధ్యమాల్లో కనిపించింది, నెటిజన్లు ఊహించిందే నిజమైంది.

ప్రియా అట్లూరి రాజారెడ్డి తో ఏడడుగులు వేయబోతోంది. పెద్దల అంగీకారంతో జరగబోయే వివాహ వేడుకకి సంబంధించి నిశ్చితధాన్ని జనవరి 18వ తేదీన నిర్వహించనున్నారు అంతే కాదు ఫిబ్రవరి 17వ తేదీన వీరు మూడు మూళ్ళ బంధంతో ఒక్కటికానున్నారు.

ఈ విషయాన్ని వై.ఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు. ఇక వారు వధూవరులతో కలిసి కుటుంబ సమేతంగా వై.ఎస్ ఘాట్ (YSR Ghat)కి వెళతారని చెప్పారు షర్మిల.

అక్కడ తొలి పత్రికను ఘాట్ పై ఉంచి తన తండ్రి దివంగత నేత వై.ఎస్.ఆర్ ఆశీర్వచనాన్ని తీసుకుంటామని అన్నారు.

Leave a Comment