Y.S.Viveka Murder, Sunita’s sensational comments – Don’t vote for Jagan : రాజకీయాలు ఎప్పుడు ఆహ్లాదకరం గా ఉండాలని కాని హత్యా రాజకీయాలు అనేవి ఉండకూడదని Y.S.వివేక కూతురు Y.S.సునీత వాఖ్యానించారు.
తను రోజు ఎక్కడికి వెళ్తున్నా ప్రతి ఒక్కరు Y.S.వివేక హత్య కేసు
వివరాలు చెప్పమని అడుగుతున్నారు అని ఆమె అన్నారు.
అంతే కాదు తన తండ్రి మర్డర్ జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాని తాను చేస్తున్న పోరాటం లో ప్రముఖ నాయకులు చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే ఎంపి రఘురామక్రిష్ణం రాజు తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.
ఈరోజు ఢిల్లీ లో మీడియా తో మాట్లాడుతూ ఈ కేసులో నిందుతులు గా ఉన్న Y.S. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లను ఈ కేసునుండి తప్పించాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. CBI సరిగ్గా పారదర్సకంగా విచారణ చెయ్యాలని ఆమె కోరారు.
కాని వారు సరిగా విచారణ చెయ్యడం లేదని మరి వారిపై ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయో తనకి అర్ధం కావడం లేదని అన్నారు.