నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న..మాకు నాయకుడిగా నిలబడు: Yatra 2 Movie Official Trailer

website 6tvnews template 5 నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న..మాకు నాయకుడిగా నిలబడు: Yatra 2 Movie Official Trailer

Yatra 2 Movie Official Trailer : ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajashekar Reddy)పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన మూవీ యాత్ర (Yatra). దీనికి సీక్వెల్‌గా వస్తున్న యాత్ర2 (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతోంది.

2009 నుంచి 2019 వరకు ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను తెరకెక్కిస్తున్న మూవీ యాత్ర 2. వైఎస్ఆర్ తనయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)ప్రజా నాయకుడిగా ఎదుగుతున్న తీరును ఈ సినిమా ద్వారా చూపించేందుకు రెడీ అయ్యాడు దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) .

యాత్ర2 వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ వైఎస్ఆర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా యాత్ర 2 మేకర్స్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో మూవీపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లోని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు.

Yatra 2 Movie Official Trailer :

ఇక గతంలో వచ్చిన యాత్ర1 విజయవంతమైంది. దీంతో యాత్ర‌-2 పైన కూడా వైఎస్ఆర్ అభిమానుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే యాత్ర‌-1లో కేవ‌లం దివంగ‌త వైఎస్సార్ మాత్ర‌మే క‌నిపించారు. యాత్ర2లో వైఎస్సార్‌తో పాటు ఆయ‌న కుమారుడు కనిపించడంతో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Malayalam megastar Mammootty as YSR : వైయస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి
ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖుల బయోపిక్‌లు వచ్చాయి. అయితే వాటన్నింటికీ దక్కని క్రేజ్ యాత్రకి దక్కింది.

యాత్ర-2 (Yatra 2) మూవీకి ఇంత క్రేజ్ రావడానికి ఏపీ సీఎం() జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. జగన్ మాస్ లీడర్, ఆయన ప్రజల నుంచి పుట్టిన నేత. అందుకే ఆయన రియల్ లైఫ్ ను వెండితెరపై చూడాలని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో వైఎస్ఆర్ క్యారెక్టర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటించనున్నారు. ఇక జగన్ క్యారెక్టర్ ను జీవా (jeeva)పోషిస్తున్నాడు.

ఇక వైయస్ భారతిగా (YS Bharathi) కేతికా నారాయన్ (kethika narayan) కనిపించనుంది. సోనియా(sonia)గా సుజానే నటిస్తోంది. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి నిర్మాత శివ మేక (siva meka)ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

How is the Yatra trailer? : యాత్ర ట్రైలర్ ఎలా ఉందంటే

yatra నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న..మాకు నాయకుడిగా నిలబడు: Yatra 2 Movie Official Trailer

పుట్టుకతోనే చెవుడు ఉన్న తమ కూతురుకు మెషిన్ పెట్టేందుకు స్థోమత లేక సహాయం చేయండి అంటూ ఓ సామాన్యురాలు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దగ్గరు వచ్చే సీన్ తో యాత్ర 2 ట్రైలర్‌ (Yatra 2 trailer)స్టార్ట్ అవుతుంది.

ఈ పాత్రలో మమ్ముటి (Mammootty)కనిపించారు. ఈ సీన్ లోని డైలాగ్స్ అందరి హృదయాలను హత్తుకున్నాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ చనిపోవడం, ఆయన కుమారుడు జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసే సీన్ వస్తుంది.

అనంతరం ఈ యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ (congress), టీడీపీ (TDP)చేసే కుట్రలు కనిపించాయి. కాంగ్రెస్ ను వీడి సొంతంగా ఓ పార్టీని స్థాపించి తర్వాత జగన్‌ మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించిన తీరు ట్రైలర్‌లో ఆసక్తిగా చూపించారు.

ఇక ట్రైలర్ చివర్లో ఓ అంధుడు ‘నువ్వు మా వైఎస్సార్‌ కొడుకువు అన్నా..మాకు నాయకుడిగా నిలబడు అన్నా’అని చెప్పే ఎమోషనల్‌ డైలాగ్ తో ట్రైలర్‌ ఎండ్ అవుతుంది. ఈ ట్రైలర్ యాత్ర 2పై అంచనాలను పెంచేసింది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వైఎస్ ఆర్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Leave a Comment