Yatra 2 Movie Review : అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే పేరు తో మూవీ తీసాడు దర్శకుడు మహి వి రాఘవ్…
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని , అప్పట్లో జరిగిన అంశాల నేపథ్యంలో తీసిన సినిమానే ‘యాత్ర 2’ గా విడుదల చేసారు చిత్ర యూనిట్. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల కోసం విడుదలకు ఒక్క రోజు ముందు స్పెషల్ షో వెయ్యడం జరిగింది. అమెరికా, యూకేలోని కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు సైతం పూర్తి అయ్యాయి.
ఈ మూవీ వైఎస్ఆర్‌సీపీ అభిమానులకు మాత్రమే నచ్చుతుంది..ప్రత్యర్థి పార్టీ వాళ్లకు తలనొప్పిలా ఉంటుంది! అనే టాక్ వచ్చింది. ‘యాత్ర 2’కు రేటింగ్ ఇవ్వడం కూడా కష్టమని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ పాత్రలో నటుడు జీవా అద్భుతంగా నటించాడని చెప్పారు.
అన్ని రకాలు గా ఈ పాత్ర కి ఆయనే సెట్ అయ్యాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.అచ్చం జగన్ లాగే ఉన్నాడని మరి కొందరు అంటున్నారు.ఈ సినిమాలో డైలాగ్స్ బావున్నాయని తెలిపారు.
ఇక సినిమా చివర్లో స్క్రీన్ మీద కనిపించిన జగన్! ‘యాత్ర’ మూవీ లో చేసినట్లు చివర్లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పాత్రధారి మమ్ముట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్క్రీన్ మీద రియల్ రాజశేఖర్ రెడ్డిని మహి వి రాఘవ్ చూపించారు.
అలాగే ఇప్పుడు కూడా ‘యాత్ర 2’లో కూడా ఆయన సేమ్ మేజిక్ రిపీట్ చేశారు. సినిమా చివరలో స్క్రీన్ మీద జగన్ మోహన్ రెడ్డిని చూపించారు. వైఎస్ జగన్ మీద వ్యతిరేకత సోషల్ మీడియాలోనూ కనబడుతోంది. సినిమా బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజనులు కూడా ఉన్నారు.