Yatra2 Poster Release: యాత్ర 2 పోస్టర్ విడుదల..జగన్ లా కనిపిస్తున్న జీవ.
త్రీ ఆటమ్ లీవ్స్ Three Autumn Leaves, వీ సెల్యూలాయిడ్ V celluloid బ్యానర్లపై తెరకెక్కుతున్న తాజా చిత్రం యాత్ర 2 Yatra 2 , వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ను ఆధారంగా చేసుకుని తీస్తున్న ఈ సినిమా లో ఏపీ సీఎం జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు.
రంగం ఫేమ్ జీవా ను అచ్చుగుద్దినట్టు జగన్ లా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాను మహి వి రాఘవ Mahi V Raghava డైరెక్ట్ చేస్తున్నాడు.
గతం లో మహి, యాత్ర Yatra సినిమాను తెరకెక్కించాడు. యాత్ర సినిమా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి Ys Rajasekhar Reddy చేపట్టిన పాద యాత్ర నేపథ్యంలో సాగింది.
ఆ సినిమా లో మలయాళ నటుడు మమ్ముట్టి దివంగత ముఖ్య మంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించారు.
ఇక యాత్ర 2 సినిమాను 2024 ఎన్నికల సమయానికి విడుదల చేసే యోచన లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా లోని పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక సోషల్ మీడియా వేదికగా జగన్ కి పుట్టిన రోజు Ys Jagan Birth Day శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ అదనపు ఆకర్షణ అయిందని చెప్పొచ్చు. ఈ పోస్టర్ లో ఒకవైపు జగన్ పాత్రలో జీవా Jeeva ఉంటే, అదే కుర్చీకి ఆనుకుని వెనుకవైపు ఉన్న మరో కుర్చీలో వైస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి Mummootty కనిపిస్తారు. ఈ పోస్టర్ వై.ఎస్ జగన్, వై.ఎస్.ఆర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Yatra 2 going Release On Same Date:
ప్రతుతం ఈ సినిమా చిత్రీకరణను శరవేగంగా చేస్తున్నారు. ఇక యాత్ర 2 సినిమాలో దర్శకుడు మహి 2009 నుండి 2019 వరకు చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాలను తెరపై ప్రేక్షకులకు తనదైన కోణంలో చేయూపెట్టే పనిలో ఉన్నారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో Tollywood Industry సెంటిమెంట్లు ఎక్కువే అని అంటారు, కాబట్టి మహి వి రాఘవ కూడా సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు.
యాత్ర సినిమాను 2019 ఫిబ్రవరి 8 వ తేదీన విడుదల చేశారు, అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది, కాబట్టి ఈ సరి కూడా 2024 ఫిబ్రవరి 8వ తేదీనే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
యాత్ర 2 సినిమా కూడా మొదటి భాగం మాదిరిగానే సక్సస్ ను అందుకుంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా కి మది Madhi సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. సంతోష్ నారాయణన్ Santosh Narayanan సంగీతాన్ని సమకూరుస్తున్నారు.